Thursday 8 December 2016

డిజిటల్‌ డిస్కౌంట్స్‌

డిజిటల్‌ డిస్కౌంట్స్‌
09-12-2016 01:50:54

 నగదురహిత చెల్లింపులకు కేంద్రం ప్రోత్సాహకాలు

2000 వరకూ సేవాపన్ను లేదు.. పెట్రోలు, డీజిల్‌ కొనుగోలుపై 0.75 శాతం రాయితీ
సబర్బన్‌ రైల్వేల్లో సీజనల్‌ టికెట్లపై 0.5% డిస్కౌంట్‌.. రైల్వే కేటరింగ్‌ సేవలకూ అది వర్తింపు
ప్రభుత్వ బీమా కంపెనీ చెల్లింపులకు 10, 8% రాయితీ.. కిసాన్‌ క్రెడిట్‌ కార్డుదార్లకు రూపేలు
టోల్‌ప్లాజాల్లో ఆర్‌ఎ్‌ఫఐడీ, ఫాస్ట్‌ కార్డులతో టాక్స్‌ చెల్లిస్తే 10 శాతం మినహాయింపు
ఆన్‌లైన్లో రైల్వే టికెట్‌ కొంటే 10 లక్షల బీమా.. ప్రభుత్వ సంస్థలతో లావాదేవీలకు చార్జీలుండవు
10 వేల మంది ఉన్న ఊర్లకు 2 పీవోఎస్‌లు.. దేశవ్యాప్తంగా లక్ష గ్రామాలు ఎంపిక

న్యూఢిల్లీ, డిసెంబరు 8: దేశవ్యాప్తంగా డిజిటల్‌ లావాదేవీలు ప్రోత్సహించడానికి కేంద్రం ప్రోత్సాహకాలను ప్రకటించింది. నగదు రహిత లావాదేవీలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ గురువారం ఢిల్లీలో డిస్కౌంట్లను వెల్లడించారు. ‘‘ప్రధాన మంత్రి పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించి నేటికి సరిగ్గా నెల. నగదు లావాదేవీల కట్టడికి శక్తివంచన లేకుండా కృషి చేశాం. ఆర్బీఐ కూడా షెడ్యూలు మేరకే నగదు విడుదల చేసింది. పెద్ద నోట్ల రద్దు లక్ష్యంగా డిజిటల్‌ లావాదేవీల దిశగా కదులుతోంది’’ అని స్పష్టం చేశారు.

జైట్లీ ప్రకటించిన 11 ప్రోత్సాహకాలు
నగదు రహితంగా కొనుక్కుంటే పెట్రోలు, డీజిల్‌ మరింత చవక అవుతాయి. నగదు రహితంగా చెల్లింపులు చేసే వారికి మొత్తం కొనుగోలుపై 0.75 శాతం రాయితీ ఇస్తారు.
కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు ఉన్న రైతులందరికీ నాబార్డు రూపే కార్డులను అందజేస్తుంది.
సబర్బన్‌ రైల్వే నెట్‌వర్కుల్లో డిజిటల్‌ చెల్లింపుల ద్వారా నెలవారీ సీజనల్‌ టికెట్లు కొనుక్కునే వారికి 0.5 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది.
ఈ ఆఫర్‌ను తొలుత ముంబై సబర్బన్‌ రైల్వే నుంచి శ్రీకారం చుడతారు. ఇది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది.
డిజిటల్‌ పద్ధతిలో రైల్వే టికెట్లను కొనుక్కునే వారికి రూ.10 లక్షల బీమా కల్పిస్తారు.
రైల్వేల్లో కేటరింగ్‌, విశ్రాంతి గదులు వంటి వాటికి నగదు రహితంగా చెల్లింపులు చేసే వారికి అదనంగా 5ు రాయితీ ఇస్తారు.
10 వేల జనాభా కలిగిన గ్రామాలకు రెండు పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ మిషన్లను అందిస్తారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా లక్ష గ్రామాలను ఎంపిక చేస్తారు.
అన్ని జాతీయ రహదారుల్లోని టోల్‌ ప్లాజాల వద్దా నగదు రహిత చెల్లింపులతో ఆర్‌ఎఫ్ ఐడీ, ఫాస్ట్‌ కార్డులను తీసుకునే వారికి 10 శాతం రాయితీ ఇస్తారు.
డెబిట్‌, క్రెడిట్‌ వంటి కార్డులను ఉపయోగించి చేసే కొనుగోళ్లకు సంబంధించి 2000 వరకూ లావాదేవీలపై సర్వీస్‌ టాక్సును వసూలు చేయరు. ఈ మేరకు 2012 జూన్‌లో జారీ చేసిన సర్వీస్‌ టాక్స్‌ నోటిఫికేషన్‌కు సవరణలు చేపడతారు.
ప్రభుత్వ రంగ బీమా కంపెనీల వెబ్‌సైట్ల నుంచి సాధారణ, జీవిత బీమా కొత్త పాలసీలు కొనుక్కున్నా, బీమా ప్రీమియం చెల్లించినా ప్రీమియం మీద వరుసగా 10 శాతం, 8 శాతం రాయితీలు వర్తిస్తాయి.
ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో నగదు రహితంగా ప్రజలు చేసే లావాదేవీలకు ట్రాన్సాక్షన్‌ చార్జీలు, ఎండీఆర్‌ చార్జీలు ఉండవు.
రైళ్లు, బస్సుల్లో పాత 500 చెల్లేది రేపటి వరకే!

పాత రూ.500 నోట్లతో రైలు టికెట్లు, బస్సు టికెట్లు, మెట్రో రైలు టికెట్లు కొనే అవకాశం శనివారం వరకే పరిమితం చేశారు. 10వ తేదీ తర్వాత ఇక ఈ నోట్లతో టికెట్లు కొనడం కుదరదు. ఇంకా పాత నోట్లు ఉన్నవారు ఈనెల 30వ తేదీ వరకూ వారి వారి బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేసుకోవచ్చు.

No comments:

Post a Comment