Tuesday 20 September 2016

హైదరాబాద్‌లో 45 ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లు

హైదరాబాద్‌లో 45 ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లు
21-09-2016 07:20:10

హైదరాబాద్‌ను మురికివాడల రహితంగా తీర్చిదిద్దాలన్న సర్కారు సంక ల్పానికి క్షేత్రస్థాయిలో అవరో ధాలు ఎదురవుతున్నాయి. బస్తీల్లో బహుళ అంతస్థులు నిర్మించి నిరుపేద లకు రెండు పడకల గదుల ఇళ్లు ఇవ్వాలన్న ప్రతిపాదనకు మిశ్రమ స్పందన వస్తోంది. 45 మురికి వాడల్లో మాత్రమే సానుకూల స్పందన లభించింది.
ఆంధ్రజ్యోతి,హైదరాబాద్‌సిటీ: గతంలో నిర్వహించిన సర్వే ప్రకారం గ్రేటర్‌లో 1476 మురికివాడలున్నాయి. ఇందులో దాదాపుగా 20లక్షల మంది నివసిస్తున్నారని అంచనా. గూడులేని వారికి పక్కాగృహాలను ఉచితంగా నిర్మించి ఇవ్వడంతోపాటు.. నగరాన్ని మురికివాడల రహితంగా తీర్చిదిద్దాలన్నది సర్కారు ఆలోచన. ఇందులో భాగంగా ఈ యేడాది లక్షఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకు న్నారు. బస్తీలు, మురికివాడల్లో ప్రస్తుతం ఉన్న ఇరుకు ఇళ్లను తొలగించి వాటిస్థానంలో రెండు పడకల నివా సాలు నిర్మించాలని భావించారు. జీహెచ్‌ఎంసీ అర్బన్‌ కమ్యూనిటీ డెవలప్‌ మెంట్‌(యూసీడీ), ఇతర విభాగాలు మురికివాడల్లో పర్యటించాయి. ప్రస్తుతం ఉంటోన్న చిన్నఇళ్లను ఖాళీచేసి స్థలాలను అప్పగిం చాలని, సౌకర్యవం తంగా జీవించేందుకు అనువైన వసతులతో డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు దాదాపు 300బస్తీల్లో స్థానికులతో అధికారులు చర్చించగా.. 45 మురికివాడల్లో మాత్రమే సానుకూల స్పందన లభిం చింది. దీంతో ఆయా ఏరియాల్లో ఇళ్ల నిర్మాణానికి కస రత్తుప్రారంభించారు. ఇప్పటికే 18ప్రాంతాల్లో రూ.428.85 కోట్లతో 5050ఇళ్ల పనుల కోసం టెండర్లు పిలవగా... మరో 32చోట్ల రూ.1298.95 కోట్లతో 15,519 ఇళ్ల నిర్మా ణానికి త్వరలో టెండర్‌నోటిఫికేషన్‌ ప్రకటించ నున్నారు.
మురికివాడల్లో ఇప్పటికే బహుళ అంతస్థులు..
కొన్నేళ్ల క్రితం నగరంలో సర్వేనిర్వహించిన ప్రభుత్వ విభాగాలు మౌలికవసతుల లేమి.. అక్కడి ప్రజల జీవన స్థితిగతులు.. నివాసాలను బట్టి1476 ప్రాంతాలను మురికివాడలుగా ప్రకటించారు. అప్పట్లో చాలా ప్రాంతా ల్లో గుడిసెలు వేసుకొని ఉండేవారు. రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, వీధిదీపాలు వంటి కనీస సౌకర్యాలు ఉండేవి కాదు. కాలగమనంలో చాలామార్పొచ్చింది. మురికి వాడల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయి. నివాసాలు, రేకులషెడ్డుల స్థానంలో మూడు, నాలుగు అంతస్థుల నిర్మాణాలు వెలిశాయి. 50నుంచి 80చదరపు గజాల స్థలంలోనే బహుళ అంతస్థులు నిర్మించారు. ఇది పట్టణ ప్రణాళికా విభాగం నిబంధనలకు వ్యతిరేకమైనప్పటికీ.. పట్టించుకునే వారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా ఇళ్లు వెలిశాయి. ప్రస్తుతం యజమానులు ఉండడంతోపాటు.. అద్దెలద్వారా ఆదాయం వస్తోంది. తల్లిదండ్రులు, పెళ్లిళ్లయిన పిల్లలూ అందరూ ఒకేఇంట్లో ఉంటున్నారు. అయితే ఒక్కరికే ఇల్లుఇస్తామంటున్నారు. ఈ నేపథ్యంలో ఇళ్లుఖాళీ చేసి స్థలాలు ఇచ్చేందుకు కొన్ని బస్తీలవాసులు ఒప్పుకోవడంలేదు. మౌలికవసతులు కల్పిస్తాం.. విశాల మైన ఇళ్లలో ఉండొచ్చు... పెళ్లిళ్లయి వేరుగా ఉంటున్న వారికీ కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తున్నాం అని అధికా రులు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. అయినా ఇరుకు గల్లీలు.. అంతకంటే ఇరుకైన ఇళ్లలో ఉండేందుకే వారు ప్రాధాన్యం ఇస్తున్నారు.
50 ప్రాంతాల్లో.. 200 ఎకరాలు..
45 బస్తీలు.. శివార్లలోని 50ప్రాంతాల్లో ఉన్న ఖాళీ స్థలాల్లో ఇళ్లునిర్మించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. అందు బాటులో ఉన్న 200 ఎకరాల స్థలంలో 21వేలఇళ్లు నిర్మించొచ్చని ఉన్నతాధికారొకరు తెలి పారు. మురికివాడల నుంచి స్పందన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఖాళీ స్థలాల అన్వేషణ ప్రారంభించారు. టీఎస్‌ఐఐసీ, హెచ్‌ఎం డీఏ, రెవెన్యూ తదితర విభాగాల నుంచి ఖాళీ స్థలాలు ఇప్పించాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. గ్రేటర్‌ ఆవల ఉన్న బుద్వేల్‌, బైరాగిగూడ, నల్లగండ్ల, ఖైతలాపూర్‌ ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో రెండు పడకల ఇళ్ల నిర్మాణం జరగనుంది. గ్రౌండ్‌ ప్లస్‌ 3కి రూ.7లక్షలు, సెల్లార్‌ ప్లస్‌ సిల్ట్‌ప్లస్‌ 5.75లక్షలు, సెల్లార్‌ ప్లస్‌ సిల్ట్‌ప్లస్‌9 అంతస్థులకు రూ.9లక్షల చొప్పున ఖర్చవు తుందని అంచనా వేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఒక్కో యూనిట్‌కు రూ.1.5లక్షలు, రాష్ట్ర సర్కారు రూ.5.5 లక్షలు ఇవ్వనుంది. గ్రౌండ్‌ప్లస్‌ 5, 9 అంత స్థులకయ్యే రూ.7లక్షలు దాటిన అదనపు ఖర్చును జీహెచ్‌ఎంసీ భరించనుంది. దీనికి తోడు రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ వంటి కనీస సౌకర్యాల కల్పనకు యూనిట్‌కు రూ.70వేలచొప్పున ఖర్చు చేయాల్సి ఉంది. ఈ లెక్కన జీహెచ్‌ఎంసీ 50వేళఇళ్లకు రూ.500 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది.

No comments:

Post a Comment