Wednesday, 30 March 2016

మోదీ సర్కార్‌కు హైకోర్టు మొట్టికాయలు!

మోదీ సర్కార్‌కు హైకోర్టు మొట్టికాయలు!

Others | Updated: March 30, 2016 16:08 (IST)
మోదీ సర్కార్‌కు హైకోర్టు మొట్టికాయలు!
డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడంపై కేంద్ర ప్రభుత్వం తీరును ఆ రాష్ట్ర హైకోర్టు తప్పుబట్టింది. రాష్ట్ర అసెంబ్లీలలో బలనిరూపణ చేసుకునేందుకు సభలో విశ్వాస పరీక్ష నిర్వహించడం ఉత్తమమైన, సరైన మార్గమని పేర్కొంది. గవర్నర్‌ విశ్వాస పరీక్షకు పిలుపునిచ్చినప్పటికీ, రాష్ట్రపతి పాలన విధించడమేమిటని ప్రశ్నించింది. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా కేంద్రం తప్పుడు సందేశాన్ని పంపినట్టయిందని హైకోర్టు స్పష్టం చేసింది.

ఉత్తరాఖండ్‌లో హరీశ్‌ రావత్‌ ప్రభుత్వం మైనారిటీ పడిందంటూ కేంద్రం రాష్ట్రపతి పాలన విధించగా.. దీనిని తోసిపుచ్చుతూ హైకోర్టు గురువారం హరీశ్ రావత్ సర్కార్ విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలని ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ  ఉత్తర్వులకు వ్యతిరేకంగా కేంద్రం హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఇప్పటికే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన నేపథ్యంలో అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించడం వీలుపడదని, అలా నిర్వహిస్తే రాష్ట్రంలో రెండు ప్రభుత్వాలు ఏకకాలంలో ఉన్న భావన కలుగుతుందని కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగీ వాదనలు వినిపించారు. రాష్ట్రంలో విశ్వాస పరీక్ష నిర్వహించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని ఆయన పేర్కొన్నారు. 

No comments:

Post a Comment