Sunday 14 February 2016

మన్మోహన్‌ ప్రధాని అయ్యాకే సంస్కరణలు ఆగాయ్‌: జైట్లీ

మన్మోహన్‌ ప్రధాని అయ్యాకే సంస్కరణలు ఆగాయ్‌: జైట్లీ 
15-02-2016 03:04:37

ముంబై: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా పనిచేశారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన ఆయన.. ప్రధాని అయ్యాక మాత్రం సంస్కరణల ప్రక్రియ స్తంభించిందని విమర్శించారు. సీఎన్‌ఎన్‌ ఏషియా బిజినెస్‌ ఫోరం సమావేశంలో జైట్లీ మాట్లాడారు. ప్రభుత్వంలో విశ్వాస సంక్షోభం ఏర్పడిందన్న మన్మోహన్‌పై ఫేస్‌బుక్‌లోనూ ఆయన విమర్శలు గుప్పించారు. దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధి పథాన నడపడానికి ప్రతిపక్షాలు కలిసి రావడం లేదన్నారు. యూపీఏ హయాంలోని విధానపరమైన పక్షవాతం నుంచి భారతను ప్రపంచానికి వెలుగురేఖగా ఎన్డీఏ నిలబెడుతోందని తెలిపారు. జీఎ్‌సటీ బిల్లును ఆమోదించకుండా కాంగ్రెస్‌ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. యూపీఏ హయాంలో విధానాలన్నీ కాంగెరస్‌ ప్రధాన కార్యాలయంలో రూపొందేవని ఎద్దేవాచేశారు. తమ హ యాంలో మోదీ మాటకు తిరుగు ఉండదన్నారు. ‘మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు అరుదుగా మాట్లాడతారు. వాళ్లు మాట్లాడినప్పుడు దేశమంతా ఆలకిస్తుంది. ఎందుకంటే వారి వివేకం జాతికి మార్గదర్శకం. వాళ్లు నిష్పక్షపాతంగా ఉండాలని, నిర్మాణాత్మక సూచనలు చేయాలని అందరూ ఆశిస్తారు. సమయం వచ్చినప్పుడు దేశ విశాల ప్రయోజనాల దృష్ట్యా సొంత పార్టీకి కూడా వారు గట్టి సందేశమివ్వాలి‘ అని జైట్లీ హితవు పలికారు.

No comments:

Post a Comment