Wednesday, 30 March 2016

మోదీ సర్కార్‌కు హైకోర్టు మొట్టికాయలు!

మోదీ సర్కార్‌కు హైకోర్టు మొట్టికాయలు!

Others | Updated: March 30, 2016 16:08 (IST)
మోదీ సర్కార్‌కు హైకోర్టు మొట్టికాయలు!
డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడంపై కేంద్ర ప్రభుత్వం తీరును ఆ రాష్ట్ర హైకోర్టు తప్పుబట్టింది. రాష్ట్ర అసెంబ్లీలలో బలనిరూపణ చేసుకునేందుకు సభలో విశ్వాస పరీక్ష నిర్వహించడం ఉత్తమమైన, సరైన మార్గమని పేర్కొంది. గవర్నర్‌ విశ్వాస పరీక్షకు పిలుపునిచ్చినప్పటికీ, రాష్ట్రపతి పాలన విధించడమేమిటని ప్రశ్నించింది. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా కేంద్రం తప్పుడు సందేశాన్ని పంపినట్టయిందని హైకోర్టు స్పష్టం చేసింది.

ఉత్తరాఖండ్‌లో హరీశ్‌ రావత్‌ ప్రభుత్వం మైనారిటీ పడిందంటూ కేంద్రం రాష్ట్రపతి పాలన విధించగా.. దీనిని తోసిపుచ్చుతూ హైకోర్టు గురువారం హరీశ్ రావత్ సర్కార్ విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలని ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ  ఉత్తర్వులకు వ్యతిరేకంగా కేంద్రం హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఇప్పటికే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన నేపథ్యంలో అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించడం వీలుపడదని, అలా నిర్వహిస్తే రాష్ట్రంలో రెండు ప్రభుత్వాలు ఏకకాలంలో ఉన్న భావన కలుగుతుందని కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగీ వాదనలు వినిపించారు. రాష్ట్రంలో విశ్వాస పరీక్ష నిర్వహించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని ఆయన పేర్కొన్నారు. 

Saturday, 26 March 2016

'బాబు గిరిజనులకు చేసిందేమీ లేదు'

మీరు ఇక్కడ ఉన్నారు: హోం హైదరాబాద్కథ

'బాబు గిరిజనులకు చేసిందేమీ లేదు'

Sakshi | Updated: March 26, 2016 19:47 (IST)
'బాబు గిరిజనులకు చేసిందేమీ లేదు'
హైదరాబాద్: ‘రాబోయే కాలంలో బాక్సైట్ తవ్వమని, గిరిజనుల పక్షాన నిలబడతామని, పర్యావరణాన్ని కాపాడతామని శాసనసభలో తీర్మానం చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలి’ అని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. జీవో 97ను రద్దు చేయాలన్నారు. శనివారం పద్దుల మీద జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ... టీడీపీ ప్రభుత్వ హయాంలో గిరిజనులకు ఒరిగిందేమీ లేదన్నారు. ఇంకా ఆమె  ఏమాట్లాడారంటే..

► ఏజెన్సీలో ఉన్న సీహెచ్‌సీ(కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు), పీహెచ్‌సీ(ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు)ల్లో స్పెషలిస్టులు లేరు. వైద్యం కోసం నగరానికి వెళ్లడానికి డబ్బుల్లేక, గిరిజనులు వైద్యానికి దూరమవుతున్నారు.
► టీడీపీ ప్రభుత్వం వచ్చి దాదాపు రెండేళ్లయింది. అటవీ శాఖ మంత్రి ఒక్కసారి కూడా తమ ప్రాంతాల్లో పర్యటించలేదు. వారి బాగోగుల గురించి పట్టించుకోలేదు.
► ప్రాథమిక విద్య కూడా గిరిజనులకు అందకుండా పోతుంది. ప్రతి కిలోమీటరు ఒక ప్రాథమిక పాఠశాల ఉంటే.. హేతుబద్దీకరణ పేరిట వాటిని తొలగించారు. వాగులు దాటి స్కూళ్లకు పోలేక విద్యార్థులు చదువు మానేస్తున్నారు. ఫలితంగా డ్రాపౌట్స్ సంఖ్య పెరుగుతోంది.
► పాఠశాలల్లో మౌలిక వసతుల్లేవు. స్కూళ్లలో టాయిలెట్స్ లేవు. ఉన్నా ఉపయోగించే పరిస్థితిలో ఉండటం లేదు. విద్యావాలంటీర్ల శ్రమను ప్రభుత్వం దోచుకుంటోంది. నెలకు రూ. 5 వేల జీతంతో సరిపెడుతున్నారు.
► ఉపాధ్యాయులు, ఉద్యోగులకు పెన్షన్ భద్రత లేదు. కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలనే విన్నపాలను ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. తమిళనాడులో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నారు.
► గిరిజన గ్రామాలు తాగునీటి కోసం అలమటిస్తున్నాయి. ఎన్టీఆర్ సుజల, జలసరి అడ్రస్ లేవు.
► అరకు మెయిన్ రోడ్డు నిండా గోతులే. ఇక గిరిజన గ్రామాల రోడ్ల పరిస్థితి చెప్పడానికి లేదు.
► గిరిజన సలహా మండలి ఏర్పాటు చేసి ఉంటే.. కనీసం పరిస్థితుల్లో కొంత మార్పు ఉండేది. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెలే ఉన్నారనే ఉద్దేశంతో సలహా మండలిని ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వంలో గిరిజన మంత్రీ లేకపోవడం గమనార్హం.

Monday, 21 March 2016

చంద్రబాబు ఈ విషయంలో కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకున్నారా?

చంద్రబాబు ఈ విషయంలో కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకున్నారా?
21-03-2016 13:11:36

భవిష్యత్తు కోసం కేవలం కలలు కనేవారు స్వాప్నికులు. అవే వ్యూహాలను వర్తమానంలో అమలుచేస్తూ ముందుకెళ్లేవారిని విజనరీ అంటారు. కానీ ఈ వ్యూహాలలో తలమున్కలై తనచుట్టూ జరిగే అంశాలను పట్టించుకోకపోయినా ప్రమాదమే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి పరిస్థితే నెలకొన్నది. అక్కడి నేతలు ఇప్పుడిప్పుడే వాస్తవాన్ని ఆకళింపు చేసుకుంటున్నారు. కులాల పేరుతో జరుగుతున్న కుమ్ములాటలను మొగ్గలోనే తుంచేసేందుకు నడుంకట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదర్శమో.. లేక భవిష్యత్తులో కులాల కుమ్ములాటలు తన కుర్చీకే ఎసరు పెడతాయనుకున్నారో తెలీదు కానీ, చంద్రబాబు వాస్తవంలోకి వచ్చారు. పోలీసుల్ని రంగంలోకి దించారు. కామ్‌గా జరిగిపోయిన ఈ కథ వెనుక పెద్ద తతంగమే నడిచింది. అదేమిటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!
 
విభజన తర్వాత ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబునాయుడు రాజధాని నిర్మాణంపై ప్రధానంగా దృష్టిసారించారు. భూముల స్వాధీనం కోసం భూసమీకరణ విధానాన్ని ప్రవేశపెట్టడం, రైతులకు ఫ్లాట్స్ కేటాయించటం, మాస్టర్ ప్లాన్ రూపొందించటం వంటి కార్యక్రమాలతో రాజధాని అంశం దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రెవెన్యూలోటుతో ఆంధ్రప్రదేశ్‌ సతమతమవుతున్న రీత్యా.. రాజధాని నిర్మాణానికి నిధుల కోసం చంద్రబాబు విదేశాలకు వెళ్లటం, అంతర్జాతీయ బ్యాంకులను ఆశ్రయించటం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. కేంద్రం ప్రకటించిన పలు సంస్థలకు రాష్ట్రంలో శంకుస్థాపనలు జరగ్గా, మరికొన్ని విద్యాసంస్థల్లో క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం తాత్కాలిక భవనాల్లో క్లాసులు జరుగుతున్నాయి. వీటికి శాశ్వత భవనాల నిర్మాణం కోసం కేంద్రం నుంచి నిధుల మంజూరు అంతంతమాత్రంగానే ఉంది. ఈ సమస్యలు చాలవన్నట్టు రాష్ట్రంలో రాజుకున్న కులాల కుంపటి చంద్రబాబుకు కొత్త చికాకులు తెచ్చిపెట్టింది.
 
కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. కొద్దిగా ఆలస్యంగానైనా కాపుల కోసం ఓ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసింది చంద్రబాబు ప్రభుత్వం. బడ్జెట్‌లో వారికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించింది. ఆర్థికంగా ఆదుకునేందుకు రుణాల మంజూరును కూడా చేపట్టింది. ఈ నేపథ్యంలోనే మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం తునిలో 'చలో కాపునాడు'కు పిలుపునివ్వడం, విధ్వంసకాండ చోటుచేసుకోవడం, ఆమరణ నిరాహారదీక్ష చేపట్టడం, ప్రభుత్వంతో చర్చల తర్వాత దీక్ష విరమించడం వంటి ఘటనల క్రమం అందరికీ తెలసిందే! తిరిగి పదిరోజుల్లోనే మరోసారి ముద్రగడ ఆమరణదీక్షకు పూనుకోవటం చంద్రబాబుకు చికాకు తెప్పించింది. ఇదే సమయంలో ఏబీసీడీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ చంద్రబాబు స్వస్థలమైన నారావారిపల్లె నుంచి రథయాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు. ఇది కూడా చంద్రబాబుకు పుండుమీద కారం పూసిన చందంగా తయారైంది.
 
ఏబీసీడీ వర్గీకరణ కోసం మందకృష్ణ చేస్తున్న ఉద్యమానికి గతంలో ప్రభుత్వం స్పందించింది. ఎస్సీల్లో ఏబీసీడీ వర్గీకరణ కోసం ఉద్యమం చేపట్టి ఆ సమస్యను అటు ప్రజల దృష్టికీ, ఇటు ప్రభుత్వ దృష్టికీ తెచ్చిన ఘనత మాత్రం మందకృష్ణకే దక్కుతుంది. ఈ సమస్యను గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు పరిష్కరించినప్పటికీ, మళ్లీ తమపైనే అస్త్రం సంధించడం ప్రభుత్వ పెద్దలకు ఎంతమాత్రం నచ్చలేదు. నిజానికి కేంద్ర స్థాయిలో ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉంది. ఇందుకోసం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడాలనీ, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలనీ డిమాండ్‌ చేస్తూ మందకృష్ణ మళ్లీ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఎమ్మార్పీఎస్ పేరిట మరికొన్ని సంఘాలు ఈలోగా ముఖ్యమంత్రిని కలుసుకున్నాయి. ఏబీసీడీ వర్గీకరణ కోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతాననీ, కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని ఆ నేతలు ప్రకటించారు. ఈలోగా మందకృష్ణ తన ఉద్యమాన్ని నారావారిపల్లె నుంచి ప్రారంభించేందుకు రంగం సిద్ధంచేసుకొని హైదరాబాద్ నుంచి గుంటూరు జిల్లా సరిహద్దులకు చేరుకున్న వెంటనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయన చేపట్టిన రథయాత్రకు అనుమతిలేదని స్పష్టంచేశారు. సీఎం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్ళినందునే పోలీసులు ఓ అడుగు ముందుకేశారన్నది ఈ మొత్తం వ్యవహారంలో కీలక అంశం. మందకృష్ణని పోలీసులు హైదరాబాద్ తీసుకెళ్లి దించి వచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు మద్ధతు పలికిన మందకృష్ణకు ఆంధ్రాలో పనేమిటని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు కూడా.
 
ఇక... కాపు రిజర్వేషన్ల కోసం ఈ నెల 11వ తేదీన తలపెట్టిన ఆమరణ నిరాహారదీక్షని కూడా వాయిదా వేసినట్టు స్వయంగా ముద్రగడ ప్రకటించారు. విద్యార్థుల పరీక్షల కోసం నిరాహారదీక్షను వాయిదావేసినట్టు ముద్రగడ ప్రకటించినప్పటికీ.. దీనివెనుక బలమైన కారణమే ఉందని తెలుగుదేశం నేతలు అంటున్నారు. ముద్రగడ చేస్తున్న డిమాండ్లలో ప్రభుత్వం తక్షణం రిజర్వేషన్ కల్పించటం మినహా, మిగిలినవన్నీ నెరవేర్చిందనీ.. అటువంటప్పుడు దీక్ష ఎలా చేస్తారంటూ క్యాబినెట్‌లోని కాపు మంత్రులు విరుచుకుపడ్డారు. దీక్షపై స్పందించని మంత్రి గంటా శ్రీనివాసరావుపై కూడా సీఎం సీరియస్ అయ్యారంటే ఆయన ఎంత పట్టుదలగా ఉన్నారో విశదమవుతోంది.
 
సీఎం చంద్రబాబునుద్దేశించి ముద్రగడ రాసిన లేఖ కూడా చర్చనీయాంశంగా మారింది. ఇది జగన్ స్ర్కిప్ట్ అంటూ ఒకవైపు మంత్రివర్గ సహచరులతో విమర్శలు ఎక్కుపెట్టిస్తూనే.. మరోవైపు పోలీస్ వ్యూహానికి కూడా ప్రభుత్వం పదునుపెట్టించింది. గతంలో జరిగిన విధ్వంసకాండ వెనుక ఎవరున్నారో కూడా లీకులు ఇచ్చారు. చర్యలు కఠినంగా ఉంటాయని పరోక్షంగా సంకేతాలిచ్చారు. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దగ్ధం, పోలీస్టేషన్లపై దాడి, దహనం, పలు వాహనాలను తగులబెట్టడం వంటి ఘటనల్లో పాల్గొన్నవారి విజువల్స్, ఫొటోలు, ఫోన్ కాల్ డేటాను కూడా పోలీసులు సేకరించి సిద్ధంచేశారు. ముద్రగడ దీక్షనెదుర్కొనేందుకు కూడా పోలీసులు పకడ్బందీ వ్యూహం రూపొందించారు. ఈ వ్యూహాలేమిటో కూడా ఆయనకు తెలిసేటట్టు చేశారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల నుంచి వచ్చిన కాపునేతలు దీక్షను వాయిదా వేసుకోవాల్సిందిగా ముద్రగడకి సూచించారు. పదో తరగతి పరీక్షల కారణం చెప్పినప్పటికీ వెనుక జరిగిన తతంగమే దీక్ష వాయిదాకు కారణమనేది ప్రభుత్వ వర్గాల విశ్లేషణ.
 
తెలంగాణలో వివిధ సమస్యలను, పలు సంఘటనలను పోలీసుల ద్వారా డీల్‌చేయించడంలో సీఎం కేసీఆర్‌ విజయవంతమయ్యారు. తన చేతులకు ఎక్కడా మట్టి అంటకుండా జాగ్రత్తపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా అదే పంథాలో పయనించేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఈ రెండు ఉద్యమాలను కూడా ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండానే పోలీసుల ద్వారా డీల్‌చేసి.. కామ్‌గా హైదరాబాద్‌లో అసెంబ్లీ సమావేశాల్లో మునిగిపోయారు. మొత్తానికి ఏపీలో కూడా తెలంగాణలో అనుసరిస్తున్న వ్యూహానికి ప్రభుత్వం పదునుపెట్టి.. ప్రయోగించింది.

Tuesday, 8 March 2016

అవధులు దాటిన అసహనం

అవధులు దాటిన అసహనం

Sakshi | Updated: March 08, 2016 10:25 (IST)
అవధులు దాటిన అసహనంవీడియోకి క్లిక్ చేయండి
వార్త - వ్యాఖ్య
 
‘నా తెలివితేటలతో రైతులకు నచ్చజెప్పాను. వాళ్ళకున్న కామన్‌సెన్స్ వీళ్ళకు (ప్రతిపక్షం వారికి) లేదు... హైదరాబాద్ సిటీని ఏ విధంగా కట్టాం?... పట్టిసీమను వ్యతిరేకించారు. పోలవరాన్నీ వ్యతిరేకిస్తున్నారు.... అభివృద్ధిని అడ్డుకుంటే మాత్రం ఉపేక్షించేదిలేదు...  కాపు ఉద్యమం ఎవరు చేయిస్తున్నారండీ?  ఇంకోపక్క కృష్ణమాదిగ...ఒక వయొలెన్స్ క్రియేట్ చేస్తున్నారు. వెస్ట్ గోదావరిలో ఒక చదువుకున్న అమ్మాయిని కిరోసిన్ పోసి కాల్చి చంపారు... ఊరూరా ప్రార్థనలు చేయించి, ప్రధానిని పిలిచి శంకుస్థాపన చేయించి,  పవిత్రమైన భావనతో రాజధాని నిర్మిస్తుంటే అడుగడుగునా అడ్డుపడుతున్నారు.’  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం మీడియా గోష్ఠిలో చేసిన ఈ వ్యాఖ్యలు అసందర్భంగా, అర్థంపర్థం లేని మాటలుగా, సంధిప్రేలాపనలాగా కనిపించవచ్చు.

కానీ ఈ అసంబద్ధమైన  వాక్యాలలో దాగున్న అంతస్సూత్రం ఏమిటంటే ఆరోపణలు చేసినవారిపైన ఎదురుదాడి చేయడం. స్వీయ తప్పిదాలను ఎత్తి చూపినప్పుడు తప్పు ఒప్పుకోకపోగా, సవరించుకోకపోగా ప్రతిసారీ ప్రతిపక్షాన్ని ఆడిపోసుకునే అలవాటు. ఇందుకోసం  అసత్యాలూ, అర్ధసత్యాలూ షరామామూలే. ఆత్మస్తుతి, పరనింద సరేసరి.  పోలవరాన్ని ఎవరు వ్యతిరేకిస్తున్నారు? పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్‌లో కేవలం వంద కోట్లు కేటాయిస్తే ముఖ్యమంత్రి నోరుమెదప లేదు. ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతికీ, దేశీయాంగ మంత్రికీ పోలవరంతో సహా విభజన చట్టంలో చేసిన హామీలన్నీ అమలు చేయాలంటూ విజ్ఞప్తి చేశారు, అయినా సరే, ప్రతిపక్షమే పోలవరానికి అడ్డు తగులుతోందంటూ జంకూగొంకూ లేకుండా బొంకటంలోని ఆంతర్యం ఏమిటి? తన హయాంలో జరుగుతున్న అన్ని అనర్థాలకూ ప్రతిపక్షాన్ని నిందించడం, నిరాధారమైన ఆరోపణలు చేయడం ముఖ్యమంత్రికి బాగా అలవాటైన  పలాయనవాద, బుకాయింపు  రాజకీయంలో భాగం.

కాపు ఉద్యమాన్ని, పశ్చిమగోదావరిలో యువతిపై జరిగిన అమానుషాన్ని కలిపి వెంట వెంటనే ప్రస్తావించడంలో ఉద్దేశం ఏమిటి? ఆ రెండింటికీ ఏమైనా సంబంధం ఉన్నదా? సం బంధం ఏమైనా ఉంటే అది ప్రభుత్వ వైఫల్యమే. ముఖ్యమంత్రి మాటలలోనే ప్రశ్నించాలంటే ‘ఎక్కడికి పోతున్నారు?’. చివరికి మంత్రి కిశోర్‌బాబు సుపుత్రుడు హైదరాబాద్‌లో ఒక యువతిని వేధిస్తే దాని తాలూకు టేపులను మార్ఫ్ చేయించింది ప్రతిపక్ష నాయకుడేనంటూ మంత్రి చేత చెప్పిం చిన ముఖ్యమంత్రి ఎటువంటి మానసిక స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాలి. ఈ దృశ్యాలను అన్ని చానళ్ళూ అనేక సార్లు చూపించాయి. ప్రతి పక్షం ఒక అనవసరమైన అవరోధంగా ముఖ్యమంత్రికి కనిపిస్తోంది. ప్రతిపక్షం లేకుండా పోతే బాగనే భావన ఆయన వైఖరిలో స్పష్టంగా కనిపిస్తోంది.

రాజధాని భూముల క్రయవిక్రయాలకు సంబంధించి ఈ పత్రికలో వచ్చిన కథనాలపైన వివరణ ఇవ్వడానికి ఉద్దేశించిన విలేకరుల గోష్ఠిలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వచ్చిన ఆరోపణలను తవ్వితీసుకొని వచ్చి చదివి వినిపించారు చంద్రబాబు. ఔటర్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టులో మార్పులకు సంబంధించి తన ప్రభుత్వంపైనా, కడప జిల్లాలో భూముల క్రయవిక్రయాలకు సంబంధించి తన బంధువులపైనా,  ఫోక్స్‌వ్యాగన్ వ్యవహారంపైన తన మంత్రివర్గ సహచరుడిపైనా వచ్చిన ఆరోపణలను సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని నిర్ణయించినట్టు  వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి హోదాలో 2006 సెప్టెంబర్ 28వ తేదీన ప్రకటించారు. సీబీఐ దర్యాప్తుతో పాటు న్యాయవిచారణ కూడా జరిపించాలని నిర్ణయించారు. అదే స్ఫూర్తితో తన ప్రభుత్వంపైన రాజధాని భూముల విషయంలో వచ్చిన ఆరోపణలలోని నిజానిజాలు నిగ్గుతేల్చడానికి కేంద్ర దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించవలసిందిగా ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేయవలసిన ముఖ్యమంత్రి పత్రికనూ, విలేఖరులనూ, ప్రతిపక్షాన్నీ తిట్టిపోయడం అన్యాయం.

భూమి లావాదేవీల వివరాలను ప్రచురిం చిన ‘సాక్షి’ పత్రికపైన ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారు. అటాచ్‌మెంట్ అంటే ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా తప్పుడు నిర్వచనం ఇచ్చారు. ఏ మాత్రం పొంతన లేని సత్యం రామలింగరాజు కేసుతో పోల్చి తన ‘తెలివితేటలను’ నిరూపించుకున్నారు. ‘సాక్షి’ ప్రజల ఆస్తి. అంటే ప్రభుత్వం ఆస్తి అంటూ చిత్రమైన భాష్యం చెప్పారు.  ఏ ఆరోపణపైన అయినా విచారణ ప్రారంభించే ముందే అభియోగాలు ఎదుర్కొంటున్నవారి  పేరుపైన ఉన్న ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ ‘అటాచ్’ చేయడం ఆనవాయితీ. అభియోగాలు ఎదుర్కొంటున్నవారు దోషులని అర్థం కాదు. విచారణ తర్వాత వారు  దోషులుగానో, నిర్దోషులుగానో నిర్ధారణ అవుతుంది. అంతిమ తీర్పుపైన శిక్ష విధించడమా, నిర్దోషిగా ప్రకటించడమా అనే నిర్ణయం  న్యాయస్థానానిది. విచారణ కాలంలో  అభియోగాలు ఎదుర్కొంటున్నవారు  ఆస్తులను విక్రయించకుండా, వాటిలో మార్పులూచేర్పులూ చేయకుండా నిరోధించే ఉద్దేశంతోనే ఆస్తులను ‘అటాచ్’ చేస్తారు. ఆస్తులపైన హక్కును ఈ అటాచ్‌మెంట్ హరించదు.

ఆస్తుల నిర్వహణకు సంబంధించి ఇబ్బందులు ఉండవు. ఆర్థిక అక్రమాలు చేసినట్టు స్వయంగా ఒప్పుకున్న రామలింగరాజు కేసుకూ, రాజకీయ కక్షతో కాం గ్రెస్, టీడీపీలు కలసి పెట్టించిన కేసులకూ పోలిక లేదు. చట్టం తెలిసినవారందరికీ ఈ విషయం స్పష్టమే. ముఖ్యమంత్రిగా పదేళ్ళకు పైగా పని చేసిన వ్యక్తికి ఈ అంశం తెలియదని ఊహించలేము. తెలిసే, బుద్ధిపూర్వకంగానే, ప్రజలను తప్పుదారి పట్టించే ఉద్దేశంతోనే, రాజకీయంగా ప్రతిపక్షాన్ని దెబ్బతీయాలన్న లక్ష్యంతోనే ‘అటాచ్‌మెంట్‌లో ఉన్న ఆస్తులన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి మొన్ననే లెటర్ రాశాం’ అంటూ చెప్పారు. ఒక వేళ ముఖ్యమంత్రి అటువంటి ఉత్తరం కేంద్ర ప్రభుత్వానికి నిజంగానే రాసినా దానికి విలువ ఉండదు. తన మంత్రులూ, మిత్రులూ నేరం చేశారంటూ ఆరోపణలు వచ్చినప్పుడు ‘మీడియా ముసుగులో నేరాలు చేస్తామంటే, రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తామంటే ప్రభుత్వం కఠినంగా ఉంటుంది’ అంటూ బెదిరించడం ఫక్తు బుకాయింపు రాజకీయం.

మంత్రులు ఆస్తులు కొనుక్కుంటే తప్పా? వారికి డబ్బులుంటే భూములు కొనుక్కుంటారు. ఇందులో విచారించడానికి ఏముంది? ఇందుకోసం ఢిల్లీ నుంచి సీబీఐ అధికారులు రావాలా? అంటూ ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్నలోనే మంత్రులు భూములు కొనుగోలు చేశారన్న ఒప్పుకోలు ఉన్నది. అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన సహచరులను మందలించకపోగా సమర్థించడం ముఖ్యమంత్రి  స్వభావానికి నిదర్శనం. రాజధాని గురించి ప్రకటన వెలువడటానికి ముందు ఎవరైతే భూములు కొనుగోలు చేశారో వారిపైన విచారణ విధిగా జరిపించాలి. వారికి రాజధానికి సంబంధించి ముందస్తు సమాచారం రహస్యంగా అందించినవారిని ఇన్‌సైడర్ ట్రేడింగ్ రహస్యాలను మిత్రుడు రాజ రత్నంకు అందజేసి పట్టుబడి న్యూయర్క్‌లో రెండేళ్ళ జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రవాస భారతీయ వణిక్ ప్రముఖుడు, గోల్డ్‌మన్ సాచ్ మాజీ డెరైక్టర్ రజత్ గుప్తాతో పోల్చాలి. మన చట్టాలు అమెరికాలో వలె తమ పని తాము చేసుకుంటే పోతే అక్రమాలు చేసేవారికి బరితెగించే వీలు ఉండదు. నిర్దోషులు నిందలు భరించే అవసరం ఉండదు. ప్రశ్నించేవారిపట్ల అసహసనం ప్రదర్శించే అవకాశం ఉండదు. మంత్రులుగా ప్రమాణం చేసే సమయంలో ప్రభుత్వ రహస్యాలను ఎవ్వరికీ వెల్లడించననీ, భయం, పక్షపాతం లేకుండా వ్యవహరిస్తాననీ చేసిన వాగ్దానాలను ఉల్లంఘించే సాహసం ఎవ్వరూ చేయరు. రాజ్యాంగ నైతికతకు భంగం కలిగించే పనికి ఒడిగట్టరు.

 ప్రభుత్వానికీ, తనకూ, ప్రభుత్వ ఆస్తులకూ, తన ఆస్తులకూ, తన ప్రతిష్ఠకూ, ప్రభుత్వ ప్రతిష్ఠకూ మధ్య అభేదం పాటిస్తున్న రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనపైన వచ్చిన ఆరోపణలను ప్రభుత్వాన్ని అస్థిరపరచే కుట్రలుగా, అభివృద్ధిని అడ్డుకునే ప్రతీప చర్యలుగా అభివర్ణించడంలో ఆశ్చర్యం లేదు. ప్రభుత్వం అవకతవకల గురించీ, ప్రభుత్వంలో ఉన్నవారి అవినీతి పనుల గురించీ రాయకుండా పాత్రికేయులనూ, పత్రికలనూ, టీవీ చానళ్ళనూ బెదిరించడం వల్ల ప్రయోజనం లేదు. ఆరోపణలు చేసినవారందరినీ అభివృద్ధి నిరోధకులంటూ నిందించడం  బెడిసికొడుతుంది. ఇది పాలక పక్షానికీ, ప్రతిపక్షానికీ సంబంధించిన వివాదం కాదు. మీడియాకూ ముఖ్యమంత్రికీ మధ్య తగవు కాదు. ఇది ప్రజలకూ, పాలకులకూ సంబంధించిన వ్యవహారం. ముఖ్యమంత్రి సంజాయిషీ చెప్పుకోవలసింది  ప్రజలకు. తాను కానీ, తన సహచరులు కానీ ఏ తప్పూ చేయలేదని నిరూపించుకొని ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందే అవకాశం ఉంది. లోగడ ఇటువంటి సందర్భాలలో ముఖ్యమంత్రులు కానీ కేంద్ర మంత్రులు కానీ  తమపైన వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించ వలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరేవారు. జైన్ డైరీలో లాల్ కృష్ణ అడ్వానీ పేరు సంకేత మాత్రంగా ఉన్నట్టు ఆరోపణ వచ్చిన వెంటనే ఆయన పార్లమెంటు సభ్యత్వానికి  రాజీనామా చేశారు. కోర్టు నిరోషి అని ప్రకటించిన అనంతరమే లోక్‌సభకు తిరిగి పోటీ చేసి ఎన్నికైనారు.
 
చంద్రబాబు నాయుడి నుంచి అంతటి ఉన్నతమైన నైతిక ప్రమాణాలను ఆశించవచ్చునా? రాజీనామా చేయకపోయినా సరే, తనపైనా, తన మంత్రివర్గ సహచరులపైనా వచ్చిన ఆరోపణలపైన సీబీఐతోనో, న్యాయమూర్తితోనో విచారణ జరిపించవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరతారని భావించవచ్చునా?  అదీ జరగకపోతే కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని విచారణ జరిపిస్తుందా? రాజధాని భూముల వ్యవహారంలో స్పష్టత రావాలంటే, ప్రజల మనస్సులలో బలంగా నాటుకున్న అనుమానాలు తొలగిపోవాలంటే ఆరోపణలపైన తన అధీనంలో లేని కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న సీబీఐ చేత విచారణ జరపడం ఒక్కటే మార్గం.

మీడియాను నిందించడం అంటే తన ప్రతిబింబాన్ని ఉన్నది ఉన్నట్టు చూపించే అద్దాన్ని బద్దలు కొట్టడానికి ప్రయత్నించడమే. ప్రజాస్వామ్య వ్యవస్థలో విశ్వాసం ఉన్నవారు ఎవ్వరూ ఈ ధోరణిని హర్షించరు. ప్రభుత్వాధినేత అవధులు మీరిన అసహనం ప్రదర్శిస్తే ప్రజలే మీడియాను కాచుకుంటారు. ప్రజల తరఫున నిలబడి ప్రభుత్వం పనితీరును నిశితంగా గమనిస్తూ  వాస్తవాలు ప్రజలకు నిర్భయంగా నివేదించే విధి  నిర్వహిస్తున్న మీడియా సంస్థలు పాఠకులకూ, వీక్షకులకు మాత్రమే విధేయంగా ఉంటాయి. రాజ్యాంగాన్ని శిరసావహిస్తాయి. దోచినవారే రాసినవారిని శిక్షిస్తామంటూ బెదిరిస్తే భయపడవు. ఇటువంటి సందర్భాలు స్వతంత్ర భారత చరిత్రలో అనేకం వచ్చాయి. ప్రతిసారీ ప్రజలు మీడియాకే అండగా ఉన్నారు. చరిత్ర తెలుసుకొని అసహనం, అహంకారం తగ్గించుకుంటే పాలకులకే మేలు.
 http://img.sakshi.net/images/cms/2015-03/51427572512_295x200.jpghttp://img.sakshi.net/images/cms/2015-03/51427572512_295x200.jpg









-  కె. రామచంద్రమూర్తి
 

Friday, 4 March 2016

కబ్జా చక్రవర్తి లింగమనేని (సీఎంగారికి వెరీక్లోజ్)

కబ్జా చక్రవర్తి లింగమనేని (సీఎంగారికి వెరీక్లోజ్)

Sakshi | Updated: March 04, 2016 10:59 (IST)
కబ్జా చక్రవర్తి లింగమనేని  (సీఎంగారికి వెరీక్లోజ్)లింగమనేని గెస్ట్ హౌస్ లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
‘సాక్షి’ వద్ద పేదలిచ్చిన డాక్యుమెంట్లు..
ఎస్టేట్‌లో పేదల భూములు స్వాహా..
⇒ 300 ఎకరాల కబ్జా భూములు..
వాటి విలువ రూ. 1,500 కోట్లు పైనే...
సమీకరణ నుంచి ఎస్టేట్‌కు మినహాయింపు
⇒ కొద్ది దూరంలో ఆగిపోయిన రాజధాని సరిహద్దు


ఎవరీ లింగమనేని?...
జస్ట్ ఎయిర్ కోస్టా విమానాలకు బాస్ మాత్రమేనా..? కాదు. చట్టాన్ని ఎగతాళి చేస్తూ, కృష్ణా నదిని కూడా కబ్జా చేసి ప్యాలెస్ లాంటి భవంతిhttp://img.sakshi.net/images/cms/2016-03/71457038883_Unknown.jpgకట్టుకున్న ‘పనిమంతుడు’ మాత్రమే కాదు. ఆ భవంతిని తన ఇష్టదైవం లాంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి సమర్పించుకున్న భక్త ‘హనుమంతుడు’ మాత్రమే కాదు.... కోస్తాంధ్రలోని రెండు ప్రధాన పట్టణాలయిన విజయవాడ - గుంటూరుల నట్టనడుమ మూడు వందల ఎకరాల విలువైన భూమిని అవలీలగా చెరబట్టిన కబ్జా కాలకేయుడు కూడా. కబ్జా చేసుకున్న భూమికి సరిహద్దు గోడను కూడా నిర్మించుకున్న సమర్ధుడు. ఎంత సమర్ధుడంటే.. భూ సమీకరణ చట్టం ఆయన సరిహద్దు గోడదాకా వచ్చి వంగి సలామ్ కొట్టి పక్కకు తిరిగి వెళ్లింది...

రాజధాని అమరావతిలో ‘బాబు’ల బినామీ భూ బాగోతాలు కోకొల్లలుగా బైటపడుతున్నాయి. లింగమనేని రమేష్‌కు  ముఖ్యమంత్రి చంద్రబాబుకు మధ్య ఉన్న బంధాన్ని రుజువుచేసే మరో పక్కా ఆధారం గురువారం ‘సాక్షి’కి లభించింది. ఈ ఆధారం ‘సాక్షి’ తవ్వితీసింది కాదు. పేదలు స్వయంగా వచ్చి ‘సాక్షి’ చేతికి అందించింది. పేదల భూములను లింగమనేని కలిపేసుకున్నారని తెలిపే ఆధారాలవి. భూ సమీకరణ విషయంలో బినా మీలైతే ఒకరకంగా.. బడుగు రైతులైతే మరో రకంగా బాబు వ్యవహరించారనేందుకు అనేక ఆధారాలు న్నాయి. మూడు పంటలు పండే పేదల భూములను బలవంతంగా సమీకరించిన చంద్రబాబు ప్రభుత్వం లింగమనేని వంటివారిని మాత్రం ‘దయ’తో వదిలేసింది. నిడమర్రు సమీపంలోని లింగమనేని ఎస్టేట్‌ను రాజధాని భూ సమీకరణనుంచి తప్పిం చడం... ప్రతిఫలంగా లింగమనేనివారు ముఖ్య మంత్రికి కృష్ణానదీ గర్భంలో అక్రమంగా నిర్మించిన గెస్ట్‌హౌస్‌ను నజరానాగా సమర్పించడం మనకు తెలిసిన విషయాలే.  ఈ ఎస్టేట్‌లో 300 ఎకరాల పేదల భూములు కలిపేసుకున్న విషయం తెలిసినా ఎలాంటి చర్యలూ తీసుకోకుండా లింగమనేని విషయంలో చంద్రబాబు ఉదారంగా వ్యవహరిం చారు. ఆ వివరాలు చూద్దామా..

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామంలో సుమారు 300 ఎకరాల్లో సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయి. వీటిని 1937వ సంవత్సరంలో గుర్తించిన బాంబేకు చెందిన అసోసియేట్స్ సిమెంట్స్ కంపెనీ లిమిటెడ్ (ఏసీసీ) యాజమాన్యం ఈ భూములను రైతుల దగ్గర నుంచి 99 ఏళ్ళ లీజు విధానంలో సేకరించింది. అప్పట్లో ఏసీసీ సిమెంట్స్ ఎండీ డబ్ల్యూహెచ్ బెన్నిట్స్ తరఫున కూర్మరాజు గోపాలస్వామి రైతులందరి భూములు కేవలం విక్రయ కాంట్రాక్ట్ మాత్రమే తీసుకుంటున్నట్లు రైతులకు అగ్రిమెంట్ (ఒప్పంద పత్రం) రాసిచ్చారు. సిమెంట్ కంపెనీ యాజమాన్యం సున్నపురాయి నిక్షేపాలు తవ్వడం ఆపివేసిన పక్షంలో..  లీజు కాలం వరకూ ఈ భూముల్లో పంటలు వేసుకునేందుకు రైతులకు హక్కు కల్పించారు. లీజు గడువు ముగిసిన తరువాత ఆ భూములు వాటి యజమానులైన రైతుల స్వాధీనంలోకి వచ్చేలా విక్రయ కాంట్రాక్ట్ ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే అసలు మతలబు ఇక్కడే జరిగింది. లీజు గడువుకు ముందే ఏసీసీ లిమిటెడ్ ఈ భూముల్లో తవ్వకాలు నిలిపివేసి సిమెంట్ కంపెనీని తరలిపోయింది.

చంద్రబాబు అధికారంలోకి రాగానే..
పేదల భూములను ఆక్రమించిన లింగమనేని.. చంద్రబాబు అధికారంలోకి రావడంతోనే అనేక చర్యలు తీసుకున్నారు. రైతులను మభ్యపెట్టి, మాయచేసి, బెదిరించి ఖాళీ స్టాంప్ పేపర్లపై సంతకాలు చేయించుకున్నారు. అనంతరం ఆ స్టాంప్ పేపర్లలో తమకు నచ్చినట్లు రాసుకుని ముఖ్యమంత్రి అండతో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల సహకారంతో రూ.1500 కోట్ల విలువ చేసే భూముల్ని తన వశం చేసుకున్నారు. రాజధాని ప్రాంతం ప్రకటనకు కొద్ది రోజుల ముందే లింగమనేని  ఈ 300 ఎకరాల విలువైన భూములను

ఓ ఎస్టేట్ మాదిరిగా మార్చారు. భద్రతా సిబ్బంది, సీసీ కెమెరాలు, ఎక్కడికక్కడ చెక్‌పోస్టులతో పటిష్ట నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసింది. ఎస్టేట్ మొత్తాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేసింది.  ఇక్కడ ఎకరం రూ.ఐదు కోట్ల వర కూ పలుకుతోంది. కాజ గ్రామానికి చెందిన కొంత మంది రైతుల వద్ద ఇంకా లీజు అగ్రిమెంట్‌లు ఉండటంతో లింగమనేని కబ్జా భాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ భూముల పక్కనే ‘చినబాబు’ కొట్టేసిన అగ్రిగోల్డ్  హాయ్‌ల్యాండ్ కూడా ఉండటం గమనార్హం. లీజుకు ఇచ్చిన తమ భూములు ఎక్కడు న్నాయో తెలుసుకునేందుకు కాజ గ్రామస్తులు ప్రయత్నించగా, లింగమనేని ఎస్టేట్‌లో ఉన్నట్లు తేలింది.

పేదల వద్ద పక్కా ఆధారాలు...
లింగమనేని ఎస్టేట్స్ యాజమాన్యం అధీనంలో ఉన్న భూముల్లో తమ భూములు కూడా ఉన్నాయని, వాటికి సంబంధించిన పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని బాధిత రైతులు తెలిపారు. అయితే తమ భూములను చూసేందుకు కూడా వీలు లేకుండా ప్రై వేట్ సైన్యాన్ని పెట్టి బెదిరింపులకు దిగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులకు, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోందని వాపోతున్నారు. సీఎం చంద్రబాబు అండదండలు ఉండటం వల్లే లింగమనేని ఎస్టేట్స్ వైపు కన్నెత్తి చూసేందుకు అటు రెవెన్యూ.. ఇటు పోలీసు అధికారులు సాహసించడం లేదు.  సర్వే నెంబరు  191, 192, 226 ఇలా అనేక సర్వే నెంబర్‌లలో ఉన్న 300 ఎకరాల భూమిని లింగమనేని యాజమాన్యం కొట్టేసిందని బాధితుల కథనం. రాజధాని దురాక్రమణపై ‘సాక్షి’లో వరుస కథనాలు రావడంతో బాధితులు తమ వద్ద ఉన్న విక్రయ డాక్యుమెంట్‌ల ఆధారాలతో ‘సాక్షి’ ప్రతినిధులను ఆశ్రయించడంతో లింగమనేని గ‘లీజు’ దందా వెలుగులోకి వచ్చింది.

అమరావతి ఇమేజ్‌కు ఆ రాతలతో డామేజ్

అమరావతి ఇమేజ్‌కు ఆ రాతలతో డామేజ్
04-03-2016 02:31:13

  • అక్రమాలు నిరూపించకపోతే జగన్‌ మీడియాపై చర్య
  • ఆ పత్రిక ఆస్తులు అటాచ్‌ అయ్యాయి.. అది ప్రజల ఆస్తి
  • ఎవరి డబ్బుతో వారు భూములు
  • కొనుగోలు చేస్తే తప్పేంటి!
  • కోర్టు అటాచ్‌ చేసిన భూములకు లోకేశ్‌ పేరు పెడతారా?
  • పిచ్చా? రాసేవాడికి బుద్ధుందా?
  • ఇది అభివృద్ధిని అడ్డుకునే అజెండా
  • రెచ్చగొట్టే చర్యలపై కఠినంగా ఉంటాం
  • ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజం
విజయవాడ, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): రాజధాని ప్రాంతంలో ఎవరైనా డబ్బులు పెట్టి భూములు కొంటే తప్పేమిటని ముఖ్యమంత్రి చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం వ్యవహరించారా, లేదా అన్నదే ముఖ్యమని తెలిపారు. గురువారం రాత్రి ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. భూకుంభకోణం జరిగిందని కథనాలు ప్రచురిస్తున్న జగన్‌ పత్రికపైనా, సీబీఐ విచారణ జరపాలన్న వైసీపీ డిమాండ్లపైనా విరుచుకుపడ్డారు. ‘‘ఎందుకయ్యా విచారణ? ఏం జరిగిందని విచారణ? ఎవరి డబ్బులు పెట్టి వారు భూములు కొనుక్కుంటే నాకేం సంబంధం? అగ్రిగోల్డ్‌ భూములు కోర్టు కేసులో అటాచ్‌ అయ్యాయి. వాటికి లోకేశ్‌ పేరుతో ముడిపెడితే ఏమిటి దాని అర్థం? ఎక్కడికి పోతున్నారు. మీకు పిచ్చా? రాసేవాడికి బుద్ధుందా?’’ అంటూ మండిపడ్డారు. పక్కవాళ్లపై బురదజల్లి తుడుచుకోమన్నట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎక్కడైనా అవినీతి ఉంటే చర్యలు తీసుకోవచ్చని, అంతేగానీ భూములు కొనుక్కుంటే కాదని స్పష్టం చేశారు. తన ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా తాట తీస్తానని తెలిపారు. ‘‘ఎవరో భూములు కొనుక్కుంటే అది మాకు అనవసరం. నాకు కావలసింది నిబంధనలు పాటించారా లేదా అన్నదే’’ అని చంద్రబాబు తెలిపారు. రాజధానికి సంబంధించిన 55 వేల ఎకరాలు ఎక్కడికీ పోలేదని, అక్కడే ఉన్నాయని తెలిపారు. రైతుల వాటా భూమిని అభివృద్ధి చేసి ఇవ్వాల్సి ఉందన్నారు. ‘‘రైతులకు భూమి ఎక్కడ ఇస్తామో ఇంకా తెలియదు కదా! నిబంధనలను మార్చారని, అవినీతి జరిగిందని, సీబీఐ విచారణ వేయాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరికీ హద్దులుంటాయి. బురద జల్లి తుడుచుకోమంటారా? ఎందుకంత హజం మీకు?’’ అని వైసీపీని ఉద్దేశించి అన్నారు.
 
ఆ పత్రిక ప్రజల ఆస్తి...
జగన్‌ పత్రిక ఆస్తులు పలు కేసుల్లో అటాచ్‌ అయ్యాయని... ఆ పత్రిక ప్రజల ఆస్తి అని చంద్రబాబు అన్నారు. అలాంటి పత్రిక అమరావతి నగరంపై 24 గంటలూ విషం చిమ్ముతోందని ఆక్రోశించారు. ‘‘గుడ్డ కాల్చి మొఖం వేసినట్లుగా ఉన్నాయా రాతలు. ఇష్టానుసారం రాసి ఇమేజీని డామేజీ చేయడమే వారి ధ్యేయం. వాటిని నిరూపించే పరిస్థితి ఉందా?’’ అని ప్రశ్నించారు. జగన్‌ పత్రిక రాసిన రాతలు నిరూపించలేకపోతే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కేసు వేయాలా లేక మరేం చేయాలన్న అంశంపై ఆలోచిస్తున్నామన్నారు. ‘‘రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండాలా, లేదా? కావాలనుకుంటే మా ఇంటిముందే పెట్టుకోవచ్చు కదా? ఎందుకు మీకింత అక్కసు? ఎంత విషం కక్కారు? నేను కాబట్టి తట్టుకోగలిగాను. ఇంకెవరైనా అయితే పారిపోయేవారు. ఒక్క పిలుపు ఇస్తే రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారు. రాష్ట్ర పరిస్థితి వివరిస్తే సింగపూర్‌ వాళ్లు నా మీద నమ్మకంతో ఆరు నెలల్లో మాస్టర్‌ ప్లాన్‌ అందించారు. ఓవైపు నేను ఇలా ప్రయత్నిస్తుంటే... రాజధానిని అడ్డుకోవడానికి రైతుల్ని రెచ్చగొట్టారు. కోర్టులలో కేసులు వేయించారు’’ అని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షానికి రహస్య ఎజెండా ఉందని, దాంతోనే ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తిస్తోందని విమర్శించారు. అభివృద్ధి ఆగాలనేదే ప్రతిపక్షం లక్ష్యమన్నారు. ఇబ్బందులున్నా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, వాటి విషయంలో ఏమీ చేయలేక కుల, మత, ప్రాంతీయ రాజకీయాలు నడిపి ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 16 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తూ 24 వేల కోట్లతో రైతు రుణ మాఫీ, 10 వేల కోట్లతో డ్వాక్రా రుణ సదుపాయం కల్పించడం తమకు మాత్రమే సాధ్యమైందన్నారు. ‘‘43 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. కూలీ రేట్లు పెంచుతున్నాం. ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీ, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్ల ద్వారా నిధులిస్తున్నాం. సబ్‌ ప్లాన్లు అమలు చేస్తున్నాం. కరెంటు, రోడ్లు బాగున్నాయి. అందరికీ గ్యాస్‌ కనెక్షన్లు ఇస్తున్నాం. ఇంటింటికీ టాయిలెట్లు కట్టిస్తున్నాం. అన్ని పనులు చేసేటప్పుడు ప్రభుత్వాన్ని ఏమీ చేయలేక కులాలు, ప్రాంతాల వారీగా రెచ్చగొడుతున్నారు. ఈ విషయంలో చాలా గట్టిగా ఉంటాం. రెచ్చగొట్టేవారిపై చర్యలు తీసుకుంటాం’’ అని చంద్రబాబు హెచ్చరించారు. ‘‘స్వాతంత్రం వచ్చాక ఎవరికీ ఇవ్వని అవకాశాన్ని ప్రజలు నాకు ఇచ్చారు. తొమ్మిదేళ్లు సీఎంగా... ఆ తర్వాత పదేళ్లు ప్రతిపక్ష నేతగా... మళ్లీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా సుదీర్ఘ రాజకీయం నడిపినవారు ఎవరూ లేరు. నిన్న మొన్న వచ్చినవారు కూడా తనను అసెంబ్లీలో అమర్యాదగా మాట్లాడుతుంటే... ప్రజలకోసం భరిస్తున్నాను. నేను మరికొద్ది రోజుల్లో లండన్‌ వెళ్తున్నాను. దేశాలు తిరిగి నేను ఎందుకు పెట్టుబడులు అడుక్కోవాలి?’’ అని ప్రశ్నించారు. ప్రతిపక్షాల తీరుపై ప్రజలే ఆలోచించుకోవాలన్నారు.
 
పసుపు చొక్కాల వారికి ఇస్తే తప్పేంటి?
కాపు కార్పొరేషన్‌ సాయం పసుపు చొక్కాలకే పరిమితమైందన్న ఆరోపణలకు సీఎం ఘాటుగా సమాధానమిచ్చారు. పసుపు చొక్కాలవారికి ఇవ్వకూడదా? వారు సమాజంలో భాగం కాదా? అని ప్రశ్నించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 30 మంది టీడీపీ ఎమ్మెల్యేలను గెలిపించిన ప్రజలకు ఏమీ ఇవ్వకూడదా అని ప్రశ్నించారు. ‘‘పశ్చిమ గోదావరి జిల్లాలో సర్పంచ్‌ నుంచి ఎంపీవరకు మావారినే గెలిపించారు. అలాంటి ప్రజలకు ఏమీ ఇవ్వకూడదా?’’ అని నిలదీశారు.
 
ఓనర్లకే ప్యాకేజీ
అసైన్డ్‌ భూముల విషయంలో సీఎం ఓ విషయాన్ని స్పష్టం చేశారు. రాజధాని ప్రకటన వచ్చేనాటికి ఎవరు ఓనర్లుగా ఉంటే వారికే ప్యాకేజీ వర్తిస్తుందని తేల్చి చెప్పారు. ఆ తర్వాత కొనుగోలు చేసిన వారికి కాకుండా ఒరిజినల్‌ యజమానులకే ప్యాకేజీ చెందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంపై శుక్రవారం సమీక్ష చేస్తానని, తర్వాత ప్రకటన చేస్తామని చెప్పారు.

చంద్రబాబు మీ పనయిపోయింది: బొత్స

మీరు ఇక్కడ ఉన్నారు: హోం హైదరాబాద్కథ

చంద్రబాబు మీ పనయిపోయింది: బొత్స

Sakshi | Updated: March 04, 2016 14:16 (IST)
చంద్రబాబు మీ పనయిపోయింది: బొత్సవీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని భూ దోపిడీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పలేకపోతున్నారని  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తేలు కుట్టిన దొంగలా సీఎం బేలగా మాట్లాడుతున్నారని బొత్స వ్యాఖ్యానించారు. ఈ భూ దందా సమాధానం చెప్పకపోగా, పై పెచ్చు భూములు కొంటే తప్పేంటని ప్రశ్నించడం దారుణమని ఆయన అన్నారు. రాజధాని ప్రాంతంలో భూములు కొన్న మంత్రులు, ఎమ్మెల్యేలపై ప్రభుత్వపరంగా ఏం చర్యలు తీసుకుంటారని బొత్స ప్రశ్నించారు.

 'చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎన్టీఆర్ అల్లుడో, నారా లోకేశో తండ్రో కాదు...  రాష్ట్ర ముఖ్యమంత్రి. సీఎంగా రాజ్యాగంపై ప్రమాణం చేసిన విషయం గుర్తు తెచ్చుకోండి. అలాంటి మీరు రాజధాని కడతానని రైతులను బెదిరించి మీ తాబేదార్లుకు, మంత్రులకు, మీ వాళ్లకు భూములు ఇప్పించుకున్నారు. ఆ భూముల ద్వారా కొన్ని లక్షల కోట్ల రూపాయిలు లూటీ చేయడానికి ప్రయత్నిస్తున్నారే. దాని గురించి సమాధానం చెప్పాలని అడుగుతున్నాం. సీబీఐ విచారణ జరిపి న్యాయం జరగాలని కోరుతున్నాం. న్యాయబద్ధంగా వ్యాపారం చేసుకుంటున్నవారి గురించి మేం మాట్లాడటం లేదు. డబ్బుంటే భూములు కొని వ్యాపారాలు చేసుకుంటే తప్పా అంటున్నారు. మీరు చేస్తున్న లూటీపై మాత్రమే మేం ప్రశ్నిస్తున్నాం.

ఆ వ్యాపారాల గురించి అడుగుతున్నాం. సమాధానం చెప్పండి. రాజధాని ప్రాంతంలో భూ దందా వాస్తవం అవునా?...కాదా?. రాజధాని ప్రకటన 3 నెలలకు ముందే ఎలా భూములు కొన్నారు. మీరు నంగనాచిలా మాట్లాడే రోజులు ఎప్పుడో పోయాయి.  అనంతపురం నుంచో నెల్లూరు నుంచో వెళ్లి రాజధాని ప్రాతంలో భూములు కొంటున్న వ్యక్తులు  13 జిల్లాల్లో ఎక్కడా కొనకుండా అక్కడే ఎందుకు కొనాల్సి వచ్చింది. అమాయక రైతులను భయపెట్టి భూములు లాక్కున్నారు.

భూములు లూటీపై న్యాయవిచారణకు మీరు సిద్ధమైనా? అసైన్డ్ భూములు కొనడం చట్ట విరుద్ధమని మీకు తెలియదా?. మీ ఆస్తుల ప్రకటన వెనుక ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. మీ ఆస్తులు, మీ బినామీల గురించి అన్ని బయటకు వస్తున్నాయి. ఒక మంత్రి తన భార్య పేరు మీద భూములు కొనడం మరీ తప్పు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో సమాధానం చెప్పాలి. చంద్రబాబు మీ పనయిపోయింది. భూ లూటీ వెనక వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలియాలి'....అని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.