Thursday, 4 August 2016

ఆర్థిక సంఘం వద్దనలేదు!

ఆర్థిక సంఘం వద్దనలేదు!
04-08-2016 02:11:47

http://cdn3.andhrajyothy.com/AJNewsImages/2016/Aug/20160804/Hyderabad/636058735078960649.jpg
·         చైర్మనే నాకు చెప్పారు..
·         సభ్యుడూ అవునన్నారు
·         హోదా ఇవ్వొద్దనేది ఈ సర్కారు నిర్ణయమే
·         జైట్లీ పక్కదోవ పట్టించారు: జైరామ్‌
·         సభలో కొనసాగిన వైసీపీ ఆందోళన
·         చీపుర్లు పట్టిన కాంగ్రెస్‌ కార్యకర్తలు
·         కేంద్ర మంత్రుల ఇళ్ల ముందు నిరసన
న్యూఢిల్లీ, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోవడం లేదన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వాదనపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేశ్‌ మండిపడ్డారు. హోదా ఇవ్వవద్దని ఆర్థిక సంఘం ఎక్కడా చెప్పలేదని, సంఘం అధ్యక్షుడు వైవీ రెడ్డే ఈ విషయం తనకు చెప్పారని ఆయన వెల్లడించారు. ప్రత్యేక హోదాను రద్దు చేయాలని సంఘం ఎక్కడా సిఫారసు చేయలేదని తేల్చిచెప్పారు. దీనిపై సంఘం సభ్యుడు అభిజిత్‌ సేన్‌ను తాను సంప్రదించగా, ఆయన సైతం స్పష్టమైన వివరణ ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు నివాసంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రాజ్యాంగం అడ్డువస్తోందని జైట్లీ చెప్పడాన్ని పచ్చి అబద్ధంగా అభివర్ణించారు.

అది తప్పుడు ప్రకటన అని, ఆయన పార్లమెంటును, దేశ ప్రజలను.. ముఖ్యంగా ఆంధ్రులను పక్కదోవ పట్టించారని మండిపడ్డారు. ఆర్థిక సంఘం సిఫారసులను, అభిజిత్‌ సేన్‌ పంపిన ఈమెయిల్‌ వివరణను ఆయన మీడియాకు విడుదల చేశారు. ఇదే అంశంపై తాను ఆర్థిక సంఘం అధ్యక్షుడు వైవీ రెడ్డితో కూడా మాట్లాడానని, ఆయన కూడా ప్రత్యేక హోదా ఇవ్వొద్దని తాము సిఫారసు చేయలేదని స్పష్టంచేశారన్నారు. పన్నుల పంపకాలు, రాషా్ట్రల వాటాలకు సంబంధించి మాత్రమే ఆర్థిక సంఘం సిఫారసులు చేసిందని చెప్పారు. ‘‘సంఘం సిఫారసుల్లో రెండు భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో కేంద్ర పన్నుల్లో రాషా్ట్రలకు ఎంత వాటా ఇవ్వాలి? అనేది ఉంటుంది. రెండో భాగంలో ఏయే రాషా్ట్రలకు ఎంతెంత మేరకు నిధులు ఇవ్వాలి? అనేది ఉంటుంది. ఈ క్రమంలో ప్రత్యేక హోదా ఉన్న రాషా్ట్రలు, లేని రాషా్ట్రల మధ్య పన్నుల పంపకాల్లో భేదం చూపొద్దని మాత్రమే ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది’’ అని జైరామ్‌ వివరించారు.

ఈ సిఫారసులు అందే నాటికి దేశంలో 11 రాషా్ట్రలు ప్రత్యేక హోదాను అనుభవిస్తున్నాయని, అందులో 6 రాషా్ట్రల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక హోదా ఉన్న రాషా్ట్రలకు పన్ను వాటాల కేటాయింపుల్లో భేదం చూపొద్దన్న సిఫారసును ప్రధాని మోదీ ఆమోదించారని ఆరోపించారు. అలాగే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దన్న నిర్ణయం తీసుకున్నది కూడా మోదీ ప్రభుత్వమేనన్నారు. దీనిని ఆర్థిక సంఘంతో ముడిపెట్టడం సరికాదని తేల్చిచెప్పారు. తిరుపతిలో ఐఐటీ, తాడేపల్లిగూడెంలో ఎన్‌ఐటీల ఏర్పాటుకు సంబంధించిన చట్టం చేయటానికి కేంద్రానికి రెండేళ్లు పట్టిందని ఆయన ఎద్దేవా చేశారు.

టీడీపీ.. తెలుగు డ్రామా పార్టీ
ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం పార్టీ పోరాటాలు చేయటం నాటకాలు ఆడటమేనని రమేశ్‌ ఆరోపించారు. టీడీపీ అంటే.. తెలుగు డ్రామా పార్టీ అని ఆయన అభివర్ణించారు. బీజేపీయే కనుక ఏపీ పట్ల చిత్తశుద్ధితో ఉంటే తక్షణం ప్రత్యేక హోదాను అమలు చేయవచ్చునని చెప్పారు. ఇందుకు ఎలాంటి సాంకేతిక అడ్డంకులూ లేవన్నారు. రాజ్యసభలో జైట్లీ ప్రసంగించిన రోజున తన మామగారు చనిపోయారని, దీంతో తాను హఠాత్తుగా చెన్నై వెళ్లాల్సి వచ్చిందని ఆయన వివరించారు. ఈ విషయం తెలుసుకోకుండా తెలుగుదేశం పార్టీ ఎంపీలు తనను విమర్శించడం సరికాదన్నారు.

ఇదీ అభిజిత్ మెయిల్‌!
‘‘ప్రత్యేక కేటగిరీ హోదాను రద్దు చేయాలని 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేయలేదు. కేంద్ర పన్నుల్లో వాటాలు పంచేటప్పుడు ప్రత్యేక హోదా ఉన్న రాషా్ట్రలు, ప్రత్యేక హోదా లేని రాషా్ట్రల మధ్య భేదం చూపే సంప్రదాయాన్ని కొనసాగించరాదని మాత్రమే సంఘం నిర్ణయించింది. ప్రణాళిక, ప్రణాళికేతర గ్రాంట్ల విషయంలో వేర్వేరు కేటాయింపులు కొనసాగించేందుకు కేంద్రానికి పూర్తి స్వేచ్ఛ ఉంది’’
-
జైరామ్‌ రమేశ్‌కు పంపిన ఈ మెయిల్‌లో ఆర్థిక సంఘం సభ్యుడు అభిజిత్‌ సేన్‌ 


NITI Aayog

NITI Aayog
The NITI Aayog comprises the following:
1.  Prime Minister of India as the Chairperson
2.  A Governing Council composed of Chief Ministers of all the States and Union territories with Legislatures and lieutenant governors of other Union Territories.
3.  Regional Councils composed of Chief Ministers of States and Lt. Governors of Union Territories in the region to address specific issues and contingencies impacting more than one state or a region.
4.  Full-time organizational framework composed of a Vice-Chairperson, three full-time members, two part-time members (from leading universities, research organizations and other relevant institutions in an ex-officio capacity), four ex-officio members of the Union Council of Ministers, a Chief Executive Officer (with the rank of Secretary to the Government of India) who looks after administration, and a secretariat.
5.  Experts and specialists in various fields [2]
With Prime Minister Narendra Modi as the Chairperson, the committee consists of
1.  Vice Chairperson: Arvind Panagariya [3]
2.  Ex-Officio Members: Rajnath Singh, Arun Jaitley, Suresh Prabhu and Radha Mohan Singh
3.  Special Invitees: Nitin Gadkari, Smriti Zubin Irani and Thawar Chand Gehlot
4.  Full-time Members: Bibek Debroy (Economist),[4] V. K. Saraswat (former DRDOChief) and Ramesh Chand (Agriculture Expert)[5]
5.  Chief Executive Officer:Amitabh Kant[6]
Governing Council: All Chief Ministers and Lieutenant Governors of States and Union Territories



Bihar toppers scam: Intermediate exam board chief quits

Bihar toppers scam: Intermediate exam board chief quits, 5 detained
India Today has discovered that while answer sheets from all other schools in Vaishali district were sent to Kaimur and Ara for evaluation, only the ones from Bishun Rai College were sent to Patna's Boys' High School.


IndiaToday.in  | Posted by Nivedita Dash
Patna, June 8, 2016 | UPDATED 15:55 IST
A +A -
Arts topper Ruby RaiRuby Rai, the Arts topper who skipped the re-examination, has been given another chance to appear for the re-examination on June 11.
BRIEFCASE
1Police summons parents of tainted Bihar toppers.
2India Today has discovered that while answer sheets from all other schools
3Lalu Prasad has distanced himself from Baccha Rai.
The chairman of the Bihar Secondary Examination Board Lalkeshwar Singh today resigned from his post shortly after the Nitish Kumar government issued a show cause notice against him over the controversy surrounding the state's dubious Intermediate examination toppers, who have been found to be clueless about their subjects.

Here are the latest developments:
The Bihar government had sought Singh's resignation yesterday, but he refused to do so initially.
A show cause notice was then issued against Singh this morning, forcing him to quit his post.
Meanwhile, India Today has discovered that while answer sheets from all other schools in Vaishali district were sent to Kaimur and Ara for evaluation, only the ones from Bishun Rai College were sent to Patna's Boys' High School.
The Arts and Science toppers in the Plus Two exam - Ruby Rai and Saurav Shrestha respectively - had taken their examination at Bishun Rai College.
The Special Investigation Team probing the topper scam yesterday raided the school where the answersheets of the candidates from Bishun Rai College are kept.
The prinicipal of the school, according to sources, has claimed that seal of the envelope in which answersheets of Bishun Rai College was sent to him was already broken.
Five people, including the principal of the GA Inter College, which was the examination center for Bishun Rai College students, have been detained and being interrogated.
The centre superintendent of Patna Boys' High school Viseshwar Yadav has also deen detained by the SIT.
An FIR has been filed against Science toppers Saurabh Sreshtha, third topper Rahul Kumar and Arts topper Ruby Rai - all students of Bishun Rai College.
The BSEB last week cancelled the results of the first and third toppers in the Science stream as both failed in their re-test, but decided to give another chance to the Arts topper to appear for a re-test on June 11.
 Day after raid on Bihar Board, police summon 'tainted' toppers




ఇంటర్ టాపర్స్ స్కామ్‌లో.. మరో ర్యాంకర్ అరెస్ట్
04-08-2016 17:14:28
http://cdn3.andhrajyothy.com/AJNewsImages/2016/Aug/20160804/Hyderabad/636059276682530441.jpg
పాట్నా: బీహార్‌లో సంచలనం రేపిన ఇంటర్ టాపర్స్ స్కామ్‌లో మరో విద్యార్థిని ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది. సైన్స్‌లో మూడో ర్యాంకు సాధించిన రాహుల్ కుమార్‌ను అతడి బంధువుల ఇంట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీకి తరలించారు.  ఇంటర్ పరీక్షల్లో సైన్స్ విభాగంలో మూడో ర్యాంకు సాధించిన రాహుల్ కుమార్‌ను ఓ టీవీ ఛానల్ ఇంటర్వూ చేయగా అతడి ప్రతిభ ఏంటో బయటపడింది.

పలువురు టాపర్స్ కూడా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఈ కుంభకోణం వెలుగుచూసింది. బిషున్ రాయ్ కాలేజీకి చెందిన విద్యార్థులు పలు విభాగాల్లో టాపర్స్‌గా రాణించడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం రాహుల్‌ను ప్రశ్నించగా ర్యాంకు కోసం 5 లక్షల డబ్బులు లంచంగా ఇచ్చినట్లు అంగీకరించాడు. ఈ కేసులో బీహార్ ఇంటర్ బోర్డు అధికారి, ఆయన భార్య, కాలేజీ నిర్వాహకులతో పాటు పలువురు అరెస్ట్ అయ్యారు.