Monday, 31 October 2016

మీరు కొంచెం మారాలి బాబూ!

మీరు కొంచెం మారాలి బాబూ!
29-10-2016 23:36:39

సమీక్షకు సమయం ఆసన్నమయ్యింది. తెలుగునాట రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తి కావస్తోంది. ఆయా ప్రభుత్వాల పనితీరుపై ప్రజలు ఒక అంచనాకు రావడానికి ఈ సమయం సరిపోతుంది. మిగిలిన రెండున్నరేళ్లలో ఏమైనా చేయాలనుకున్నా ఏడాదిన్నర కాలమే ఉంటుంది. చివరి సంవత్సరంలో ఎన్నికల వాతావరణం ఏర్పడటమే కాకుండా అధికారంలో ఉన్నవారిపై ప్రజలు ఒక అభిప్రాయానికి కూడా వచ్చేస్తారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప చివరి సంవత్సరంలో పాలకులపై ప్రజల అభిప్రాయంలో మార్పురాదు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అన్నీ కలిసిరావడంతో ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోల్చితే పాలనలో పైచేయిగా ప్రస్తుతానికి ఉన్నారు. అనాథగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో
పరిస్థితులను తట్టుకుని నిలదొక్కుకోవడానికి చంద్రబాబు నాయుడు అహరహం ప్రయత్నిస్తున్నా అక్కడి పరిస్థితులు ఆయనకు కలిసిరావడం లేదు. బహుశా ఈ కారణంగానే కాబోలు వీడీపీ అసోసియేట్స్‌ తాజాగా నిర్వహించిన సర్వేలో తెలంగాణ సీఎం దేశంలోనే ప్రథమస్థానంలో నిలవగా, ఏపీ సీఎం అయిదో స్థానం నుంచి ఏడో స్థానానికి పడిపోయారు. అధికారంలోకి వచ్చిననాటి నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్‌ పక్కా రాజకీయ వ్యూహంతో నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. ముందుగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా శాసనసభలో తన బలాన్ని పెంచుకున్నారు. అదే సమయంలో ప్రజలను ఆకట్టుకోవడానికై మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ వంటి పథకాలతో పాటు పలు భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. పథకాలను ప్రారంభించిన కేసీఆర్‌ అంతటితో ఆగకుండా వాటికి భారీ ప్రచారం కల్పించడం ద్వారా తెలంగాణలో అద్భుతాలు జరగబోతున్నాయన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించారు. దీంతో తెలంగాణ ప్రజలలో ఆయన పాలనా సామర్థ్యంపై నమ్మకం ఏర్పడింది. నిజానికి చంద్రబాబులా కేసీఆర్‌ అంతగా శ్రమించడం లేదు. ఆడుతూపాడుతూ పాలన సాగిస్తున్నారు. అయితే, ప్రజలను తనవైపునకు తిప్పుకోవడానికి ఏమిచేయాలో ఆ పనిని సమర్థంగా చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విషయానికి వస్తే పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.

                  ప్రతిపాదిత అమరావతి నిర్మాణంపై అధిక ఫోకస్‌ చేయడం, చెబుతున్న మాటలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించకపోవడంతో ప్రజల్లో ముఖ్యమంత్రిపై నమ్మకం సన్నగిల్లుతోంది. కేసీఆర్‌ నిర్దేశించుకున్నట్టుగా చంద్రబాబు ప్రభుత్వం ప్రాధాన్యతలు నిర్దేశించుకోవడంలో విఫలమయ్యింది. అధికార యంత్రాంగంలో అలసత్వం, క్రమశిక్షణారాహిత్యం నెలకొనడంతో తలపెట్టిన పనుల్లో అంతగా పురోగతి కనబడటం లేదు. ప్రత్యేకహోదానా? ప్యాకేజీనా? అన్న మీమాంసతోనే ఏడాదికిపైగా గడిచిపోయింది. మధ్యలో కాపుల రిజర్వేషన్‌ ఆందోళన వంటి సమస్యలు చంద్రబాబు ప్రభుత్వానికి ప్రతిబంధకాలుగా తయారయ్యాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ బహిరంగంగాగానీ, విలేకరుల సమావేశంలోగానీ ఎప్పుడో ఒకసారి మాత్రమే మాట్లాడతారు. దీంతో ఆయన ఎప్పుడైనా మాట్లాడితే ఏమి మాట్లాడతారా? అన్న ఆసక్తి ఉంటోంది. తరచుగా ప్రసంగాలు చేయకపోయినా, తనకు ఎటువంటి ప్రచారం కావాలో తెలిసిన కేసీఆర్‌ ఆ దిశగా ప్రతిరోజూ చర్యలు తీసుకుంటూ ఉంటారు. తెలంగాణలో మీడియా కూడా ఆయనకు పూర్తిగా సహకరిస్తున్నది కనుక కోరుకున్న ప్రచారం లభిస్తున్నది. చంద్రబాబు విషయానికి వస్తే, ఆయన రోజూ ఎక్కడో ఒకచోట ఏదో ఒక రూపంలో మాట్లాడుతున్నారు. దీంతో ఆయన ప్రసంగాలు రొటీన్‌ అయిపోయాయి. టీవీలలో చంద్రబాబు ప్రసంగిస్తుంటే ఆసక్తిగా వినే పరిస్థితిలో ఇప్పుడు ఏపీ ప్రజలు లేరు.

                  నిజానికి ఆయన గొప్ప ఉపన్యాసకుడు కూడా కాదు. ఆయన ప్రసంగాలు ప్రజలను ఆకట్టుకునేలా ఉండవు. అయితే, చంద్రబాబు పనితీరుపై నమ్మకంతోనే ప్రజలు ఆయనకు అధికారం అప్పగించారు. ఆయన ఉపన్యాసాలలో కొత్త విషయం ఏమీ ఉండదన్న అభిప్రాయం గతంలో కూడా ఉండేది. ఈ నేపథ్యంలో ఇద్దరు ముఖ్యమంత్రుల రెండున్నరేళ్ల పాలనను సింహావలోకనం చేసుకుంటే కొన్ని విజయాలు, మరికొన్ని వైఫల్యాలు కనిపిస్తాయి. అధికారంలోకి వచ్చిననాటి నుంచీ ఇద్దరు చంద్రులు అడ్డం - పొడవు ప్రకటనలు ఎన్నో చేశారు. ఆకాశానికి నిచ్చెనలు వేశారు. దీనివల్ల ప్రజల్లో అసంతృప్తి త్వరగా ఏర్పడే ప్రమాదం ఉందని గమనించిన కేసీఆర్‌ ఆ తరహా ప్రకటనలకు స్వస్తిచెప్పారు. చంద్రబాబు మాత్రం ఇంకా కొనసాగిస్తున్నారు. ఎవరి పద్ధతి వారిది కనుక ఫలానా వారిలా ఉండాలని సూచించడం సబబు కాదు. తెలంగాణలో కేసీఆర్‌ గత ఎన్నికలతో పోల్చితే బలం పెంచుకున్న విషయం వాస్తవం. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికలే ఇందుకు నిదర్శనంకాగా, వివిధ సంస్థలు జరిపిన సర్వేలలో కూడా కేసీఆర్‌కు జనాదరణ పెరిగిందనే వెల్లడవుతోంది. చంద్రబాబు విషయంలో ప్రజల్లో ఆదరణ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి అక్కడ ఎన్నికలు జరగలేదు. ఏ సంస్థా సర్వేలు నిర్వహించలేదు. మరో రెండు మూడు నెలలలో మునిసిపాలిటీలకు జరగనున్న ఎన్నికల తర్వాతగానీ వాస్తవ పరిస్థితి ఎలా ఉందో తెలియదు. ప్రచారం విషయంలో కేసీఆర్‌తో పోల్చితే చంద్రబాబు బాగా వెనుకబడి ఉన్నారు. అదే సమయంలో చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడేవారి సంఖ్య కూడా అంతగా కనిపించడం లేదు. దీంతో చంద్రబాబుకు జనాదరణ తగ్గిందా? అన్న అనుమానం రాజకీయ పరిశీలకులలో ఏర్పడుతోంది. అయితే చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై పెదవి విరిచేవారు కూడా ప్రతిపక్షనాయకుడు జగన్మోహన్‌రెడ్డి వైపు మొగ్గుచూపడం లేదు. దీనినే గుడ్డికంటే మెల్ల నయం అంటారు కాబోలు. అయినా ఇప్పట్లో ఎన్నికలు రావు కనుక రెండున్నరేళ్ల తర్వాత జరిగే ఎన్నికలలో అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవాలంటే ఇరువురు ముఖ్యమంత్రులు ముఖ్యంగా చంద్రబాబు కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి.

బాబు నేర్వని పాఠాలు..
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకోవలసిన దిద్దుబాటు చర్యలు చాలా ఉన్నాయి. అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రికి మధ్య అంతరం ఏర్పడింది. ఈ కారణంగా ముఖ్యమంత్రి వ్యవహారశైలి పట్ల పలువురు సీనియర్‌ అధికారులు విసుగు ప్రదర్శిస్తున్నారు. తరచుగా సుదీర్ఘ సమీక్షలు నిర్వహించడం, ప్రతిరోజూ ఉదయం ఎనిమిదిన్నర నుంచి గంటపాటు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహిస్తూ రావడంతో చంద్రబాబుపై అధికారులే బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు చాలామంది అధికారులు హైదరాబాద్‌లోనే ఉన్నందున సమీక్షలు, సమావేశాల కోసం ఎక్కే విమానం, దిగే విమానం అన్నట్టుగా వారి పరిస్థితి ఉండేది. ఇప్పుడు టెలీకాన్ఫరెన్స్‌ల వల్ల తలపోటు వస్తోందని ఒక సీనియర్‌ అధికారి వ్యాఖ్యానించారు. ఉదయంపూట అందరికీ ఇళ్లల్లో ఏవో పనులు ఉంటాయి. సరిగ్గా అటువంటి సమయంలో గంటపాటు టెలీకాన్ఫరెన్స్‌ ఉండటం వల్ల ఇబ్బందిగా ఉంటోందనీ, అయినా ముఖ్యమంత్రి ఇచ్చే ఆదేశాలు, చేసే సూచనలు అమలు కావాలంటే కనీసం పదిహేను రోజుల వ్యవధి అవసరమనీ, ఆ వ్యవధి ఇవ్వకుండా టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించడం వల్ల మొక్కుబడి తంతుగా మారిందనీ పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు. మంత్రులు, శాసన సభ్యులు కూడా ఈ టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొనవలసి ఉంటోంది. దీంతో తమను కలవడానికి ఉదయంపూట వచ్చే సందర్శకులను కలుసుకోలేకపోతున్నామని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా చేసేది ఏమీలేదు కనుక సెల్‌ఫోన్‌లు ఆన్‌లో ఉంచి ఎవరి పనుల్లో వారు ఉండిపోతున్నారు. టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొనలేకపోయిన అధికారులను సంబోధిస్తూ ముఖ్యమంత్రి కొన్ని సందర్భాలలో సూచనలు చేస్తూ ఉంటారు. మొత్తంమీద ఈ టెలీకాన్ఫరెన్స్‌ల వ్యవహారం చంద్రబాబుకు లాభించకపోగా, నష్టం చేస్తోందన్న అభిప్రాయమే అటు తెలుగుదేశం పార్టీ వర్గాలలో, ఇటు అధికార వర్గాలలో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పరిస్థితిని సమీక్షించుకుని, ప్రభుత్వ ప్రాధాన్యతలను ముందుగా నిర్దేశించుకుని, వాటి అమలు బాధ్యతను ఎంపిక చేసిన అధికారులకు అప్పగించి, పక్షంరోజులకు ఒకసారి ముఖాముఖి మాట్లాడటం మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి, తెలంగాణతో పోల్చితే ఏపీలో కొన్ని వ్యవహారాలు సాఫీగా సాగిపోతున్నాయి. అయినా వాటికి తగిన ప్రచారం లభించడం లేదు. ఉదాహరణకు తెలంగాణలో విద్యార్థుల ఫీజులు చెల్లించాలంటూ ఆందోళనలు చేస్తూ ఉండటాన్ని చూస్తున్నాం. ఆరోగ్యశ్రీ బకాయిల విడుదల కోసం ప్రయివేటు ఆసుపత్రుల యాజమాన్యాలు కూడా అప్పుడప్పుడు ఆందోళన చేస్తున్నాయి. ఏపీలో ఈ పరిస్థితి లేదు.

                  ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ విద్యార్థులకు ఫీజులు, ఎన్టీఆర్‌ ఆరోగ్య బీమా పథకం కింద టంచన్‌గా చెల్లింపులు జరుగుతున్నాయి. అలాగే జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద కేంద్రం నుంచి గరిష్ఠంగా నిధులు పొందుతూ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇలాంటివి హైలైట్‌ కావడం లేదు. అదే సమయంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల అనవసర విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది. ఉదాహరణకు, రాజధాని నిర్మాణం కోసం చేపట్టిన స్విస్‌ ఛాలెంజ్‌ విధానాన్నే తీసుకుందాం! ఈ అంశంపై హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రజలు శంకించే పరిస్థితిని కొనితెచ్చుకున్నారు. స్విస్‌ చాలెంజ్‌లో పాల్గొనే బిడ్డర్లు ఇవ్వజూపిన రెవెన్యూ వాటాను ఇతర బిడ్డర్లకు కూడా తెలియ చేయాలని చట్టంలో పేర్కొన్నారు. ఇక్కడ అధికారులు వాడిన ఒక పొరపాటు పదం వల్ల ప్రభుత్వం ఆత్మరక్షణలో పడవలసి వచ్చింది. అంతేకాకుండా మొత్తం ప్రాసెస్‌ మూడు నెలలు జాప్యం అవుతోంది. ఆసక్తి ఉన్న సంస్థలకు రెవెన్యూ వాటా వివరాలు తెలియ చేయాలని మొదట చట్టంలో పేర్కొన్నారు. ‘ఆసక్తి అంటే’... అర్హత ఉన్నవారే ఆసక్తి చూపుతారన్న ఉద్దేశంతో ఆ పదం చేర్చామని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ పదాన్ని ఉపయోగించుకుని అర్హత లేనివారు కూడా తమకు ఆసక్తి ఉందంటూ ముందుకు వచ్చి, పోటీలో తొలుత పాల్గొన్న బిడ్డర్లు ఇవ్వజూపిన రెవెన్యూ వాటా వివరాలు కావాలని కోరారు. చివరకు వివాదం కోర్టుకు చేరింది. దీంతో తప్పు తెలుసుకున్న అధికారులు చట్టానికి స్వల్ప సవరణ చేస్తూ ‘ఆసక్తి ఉన్న’ అన్న పదం బదులు ‘అర్హత ఉన్న ఇతరులకు’ అని చేర్చడంతో వివాదం ముగిసింది. ఇంతాచేస్తే ఈ స్విస్‌ చాలెంజ్‌లో పాల్గొన్న తొలి బిడ్డర్లు రెండూ సింగపూర్‌ కంపెనీలే కావడం విశేషం. ఈ రెండు కంపెనీలలో ఒకటి పూర్తిగా సింగపూర్‌ ప్రభుత్వానిది కాగా, రెండవ దాంట్లో సింగపూర్‌ ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉంది. సింగపూర్‌ ప్రభుత్వంలో అవినీతి జీరో శాతం అని అందరూ అంగీకరించే విషయమే! ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ కూడా ఆ మేరకు సింగపూర్‌ ప్రభుత్వాన్ని గుర్తించింది. వాస్తవం ఇది కాగా, సింగపూర్‌కు చెందిన ప్రయివేటు కంపెనీలకు రాజధాని భూములను కట్టబెడుతున్నారన్న అపవాదును ప్రభుత్వం మూటగట్టుకోవలసి వచ్చింది. ఇది స్వయంకృతాపరాధమే! రియల్‌ ఎస్టేట్‌ డెవల్‌పమెంట్‌ వేరు- రాజధాని డెవల్‌పమెంట్‌ వేరు అని కూడా ప్రభుత్వం చెప్పుకోలేకపోయింది.

                  రాజధానికి పెట్టుబడులు రావాలంటే రియల్‌ ఎస్టేట్‌ సంస్థల వల్ల జరగదు. అంతర్జాతీయంగా పేరు ప్రతిష్ఠలు ఉండి పెట్టుబడిదారులలో నమ్మకం కలిగించవలసిన సంస్థలకే అది సాధ్యం. ఈ విషయం అలా ఉంచితే, అధికారంలోకి వచ్చిన తర్వాత చాలాకాలంపాటు తెలుగుదేశం పార్టీ వ్యవహారాలను చంద్రబాబు గాలికి వదిలేశారు. ఒక్కరోజు కూడా పార్టీ కార్యాలయానికి వెళ్లలేదు. దీంతో పార్టీకీ ఆయనకూ మధ్య అంతరం పెరిగింది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా అనధికార పదవుల భర్తీ పూర్తిగా జరగలేదు. ఫలితంగా పార్టీ యంత్రాంగంలో నిరాశా నిస్పృహలు చోటుచేసుకున్నాయి. పాలనా వ్యవహారాలకే పరిమితమై రాజకీయ వ్యవహారాలను పట్టించుకోకపోవడం చంద్రబాబుకు నష్టం చేసింది. ప్రజాప్రతినిధుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవడానికి కూడా ముఖ్యమంత్రి సుముఖత చూపడం లేదన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. దీంతో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను చెప్పడానికి మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు అందరూ వెనుకాడుతున్నారు. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించవలసి ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కాపులకు ఏటా వెయ్యికోట్ల రూపాయల రుణాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించుకున్నారు. రుణాల పంపిణీ కూడా మొదలయ్యింది. అయితే రుణాలు పొందినవారు ఆటోలు వగైరా కొనుక్కుని వాటిపై చంద్రబాబు ఫోటో కూడా ప్రదర్శించడం లేదనీ, పవన్‌కల్యాణ్‌ లేదా ముద్రగడ పద్మనాభం ఫొటోలు పెట్టుకుంటున్నారని గోదావరి జిల్లాలకు చెందిన ఒక ఎమ్మెల్యే చెప్పారు. చేస్తున్న పనికి రాజకీయ ప్రయోజనం పొందడంపై చంద్రబాబు దృష్టి కేంద్రీకరించకపోవడం వల్లనే ఇలా జరుగుతోందని ఆ ఎమ్మెల్యే విశ్లేషించారు. కాపులను సంతృప్తిపరిచే క్రమంలో బీసీలలో పార్టీపట్ల వ్యతిరేకత ఏర్పడే ప్రమాదం ఉందనీ, ఇప్పటికే ఈ ఛాయలు కనిపిస్తున్నాయని మరో ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. బీసీలు అధికంగా ఉండే గ్రామాలలో కూడా కాపులు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ ఎక్కువమందికి రుణాలు మంజూరు చేస్తున్నారనీ, బీసీలు అధికంగా ఉన్నా తక్కువ సంఖ్యలో రుణాలు ఇస్తున్నారనీ, దీనిపై బీసీలు ఆగ్రహంగా ఉన్నారని ఆ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి అవకాశం ఇస్తే ఇవన్నీ ఆయన వద్ద చెప్పుకోవాలని తమకు ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతిపాదించిన మెగా ఆక్వాపార్క్‌ వివాదాస్పదం కావడం కూడా స్వయంకృతాపరాధమేనని చెప్పాలి. అధికార యంత్రాంగంతోపాటు పార్టీ యంత్రాంగంలో నిర్లిప్తత లేదా నిర్లక్ష్యం వల్ల గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నట్టు అయ్యింది.

                  టెక్నాలజీ విషయంలో కూడా ముఖ్యమంత్రి తన వైఖరిని సమీక్షించుకోవలసిన అవసరం ఉంది. సర్వరోగ నివారణి జిందా తిలస్మాత్‌ అన్నట్టుగా అన్నిచోట్లా టెక్నాలజీ గురించే చెప్పడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉమ్మడి రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఎక్కువగా ఐటీ జపం చేసేవారు. గ్రామాలు, లంబాడి తండాలకు వెళ్లినప్పుడు అక్కడ వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఏంచేసేదీ చెప్పకుండా, అప్పట్లో ఓ వెలుగు వెలుగుతూ ఉన్న సత్యం కంప్యూటర్స్‌ అధినేత రామలింగరాజువలె మీరు కూడా డబ్బు సంపాదించుకునే ఆలోచనలు చేయాలని చెప్పేవారు. దీంతో గ్రామీణులకు అప్పట్లో దూరం అయ్యారు. ఇప్పుడు మళ్లీ ఆ పరిస్థితి రాకుండా ముఖ్యమంత్రి తన వైఖరిని సమీక్షించుకోవాలి. ఇటువంటి లోపాలు మరెన్నో ఉన్నప్పటికీ, ఇప్పుడున్న పరిస్థితులలో ఏపీని నిలబెట్టగలిగేది చంద్రబాబు ఒక్కరేనన్న అభిప్రాయం ఇప్పటికీ చాలామందిలో ఉంది. అయితే 1995-1999 మధ్యకాలంలోవలె చంద్రబాబు తరఫున వకాల్తా పుచ్చుకుని ఆయన పనితీరును బహిరంగంగా శ్లాఘించేవారు ఇప్పుడు కరువయ్యారు. తెలంగాణ ప్రజలతో పోల్చితే ఏపీ ప్రజల ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. వారిని సంతృప్తిపర్చడం అంత తేలిక కాదు. అదే సమయంలో, ఆ సమాజం కులమతాల ప్రాతిపదికన విడిపోయి ఉంది. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎదురుకాని ఎన్నో సమస్యలు చంద్రబాబు ముందున్నాయి. అక్కడ ప్రతిపక్షం కూడా బలంగా ఉంది. ఈ నేపథ్యంలో తనకున్న పరిమితులను దృష్టిలో పెట్టుకుని లక్ష్యాలను నిర్దేశించుకోవలసిన అవసరం చంద్రబాబుకు ఎంతైనా ఉంది. ఆకాశానికి నిచ్చెనలు వేయడం మానుకోవాలి. మిగిలిన రెండున్నరేళ్లలో ఎంత చేయగలరో, ఏమిచేయగలరో అంతే చెప్పడం మంచిది.

                  ప్రపంచంలోకెల్లా అద్భుతమైన రాజధానిని నిర్మించాలని అక్కడి ప్రజలు ఇప్పుడు కోరుకోవడం లేదు. సౌకర్యవంతమైన రాజధాని నిర్మాణం జరిగితే చాలని మాత్రమే కోరుకుంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా పోలవరం నిర్మాణం వేగంగా సాగాలి. ప్రస్తుత కాంట్రాక్టర్‌ వల్ల అది సాధ్యంకాదన్న అభిప్రాయం విస్తృతంగా ఉన్నందున ప్రత్యామ్నాయ కాంట్రాక్టర్‌కు బాధ్యతలు అప్పగించడం మంచిది. ప్రభుత్వం పట్ల ప్రజలలో ఫీల్‌గుడ్‌ భావన పెంపొందించడానికి రాజకీయంగా ఆలోచించి చర్యలు తీసుకోవాలి. అంతా నాకు తెలుసు అని కాకుండా, మీకు తెలిసింది కూడా చెప్పండి అని చెప్పుకునే అవకాశం కల్పిస్తే దానివల్ల ప్రయోజనం పొందేది ముఖ్యమంత్రే!

 కేసీఆర్‌కు భావి సవాళ్లు
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విషయానికి వద్దాం! ప్రస్తుతానికి తెలంగాణలో ఆయనకు తిరుగులేదు. ఆయనను ఎదుర్కోగల ప్రతిపక్ష నాయకుడు కూడా లేడు. అయితే, రాజకీయాలలో ఇప్పుడున్నట్టు రేపు ఉండదు. వచ్చే ఎన్నికల వరకు ఇదే పరిస్థితి కొనసాగాలంటే కేసీఆర్‌ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరు నెలల క్రితంవరకు కేసీఆర్‌ భారీ ప్రకటనలు చేస్తూ ఉండేవారు. ఇప్పుడు వాటి ఊసే లేకుండాపోయింది. ప్రభుత్వ ఆదాయం పెరుగుతున్నప్పటికీ పలు పథకాలను ఒకేసారి భారీగా చేపట్టడం వల్ల నిధుల కొరత ఏర్పడుతోంది. తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు అంత సాఫీగా లేదు. దీంతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం వంటి సమస్యలు కేసీఆర్‌ను చుట్టుముట్టడానికి కాచుకుని ఉన్నాయి. మాటలకు చేతలకు పొంతన లేనప్పుడు ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుంటుంది. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పథకంపై పేదలు గంపెడాశలు పెట్టుకుని ఉన్నారు. వచ్చే ఎన్నికలనాటికి ఈ పథకాన్ని అమలుచేయడం మొదలు పెట్టకపోతే రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. మిషన్‌ భగీరథ వంటి పథకాలు ప్రస్తుతానికి ఆకర్షణీయంగా కనిపిస్తున్నప్పటికీ మున్ముందు వాటివల్ల ఓట్లు రావు. ఈ పథకం కింద సరఫరా చేసే నీటికి బిల్లులు చెల్లించవలసి ఉంటుంది. దీనివల్ల గ్రామీణులలో వ్యతిరేకత ఏర్పడే ప్రమాదం ఉంది. ఇబ్బడిముబ్బడిగా జిల్లాలు పెంచడం వల్ల ప్రజల్లో సానుకూలత ఏర్పడి ఉండవచ్చుగానీ ప్రభుత్వ వ్యయం కూడా పెరుగుతుంది. 1680 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త జిల్లాలలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలు నిర్మించాలనుకోవడం ఇప్పుడున్న పరిస్థితులలో వాంఛనీయం కాదు. నిధుల కొరత వల్ల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాన్ని మొదలుపెట్టలేని స్థితిలో... ప్రభుత్వ భవనాలకు ఇప్పుడు అంత డబ్బు అవసరమా? అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ఇప్పుడున్న సచివాలయాన్ని కూలగొట్టి నూతన భవన సముదాయాన్ని నిర్మించాలన్న నిర్ణయంపై ఒకరు స్పందిస్తూ, ఆ డబ్బుతో పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టవచ్చుగా సార్‌? అని ప్రశ్నించారు.

                  హైదరాబాద్‌లో పౌర సౌకర్యాలు అధ్వాన్న స్థితికి చేరుకున్నాయి. ఆయా సంస్థల సర్వేలలో కూడా జిల్లాలతో పోల్చితే హైదరాబాద్‌లో ప్రభుత్వం పట్ల ఆదరణ తక్కువగా ఉంది. అయితే, రాజకీయ వ్యూహరచనలో ప్రస్తుతానికి కేసీఆర్‌ను మించినవారు తెలంగాణలో ఎవరూ లేరు కనుక ప్రకటిత పథకాలు అమలుకు నోచుకోకపోయినా ప్రజలను తనవైపునకు తిప్పుకోవడం ఎలాగో ఆయనకు బాగా తెలుసు. అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవన్న సూత్రం కేసీఆర్‌కు తెలియంది కాదు.
యూట్యూబ్‌లో ‘కొత్త పలుకు’ కోసం
http://www.youtube.com/abntelugutv

Thursday, 27 October 2016

ట్రైబ్యునల్‌ తీర్పు నష్టదాయకమే

ట్రైబ్యునల్‌ తీర్పు నష్టదాయకమే
28-10-2016 01:10:13
 న్యాయపోరే శరణ్యం: సలహా కమిటీ
హైదరాబాద్‌, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): బ్రిజేష్ కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పు తెలంగాణ ప్రయోజనాలకు నష్టదాయకమని అంతరాష్ట్ర జలవనరుల శాఖ సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ) అంచనాకు వచ్చింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లడమే మార్గమని అభిప్రాయపడింది. దీనిపై ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ట్రైబ్యునల్‌ తీర్పుపై టీఏసీ గురువారం జలసౌధలో సమావేశమైంది. అంతరాష్ట్ర జల వనరుల విభాగం సీఈ నరసింహరావు ఆధ్వర్యంలో జరిగిన భేటీలో టీఏసీ సభ్యులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. ఎగువరాష్ర్టాల్లో లేని విధంగా తెలంగాణ, ఏపీలను మాత్రమే ప్రాజెక్టుల వారీగా నీటిని పంచుకోవాలనే తీర్పు రెండు రాష్ర్టాలకు, ముఖ్యంగా తెలంగాణకు నష్టం జరిగేదిగా ఉందని కమిటీ అభిప్రాయపడింది. తీర్పు ప్రకారం ట్రైబ్యునల్‌ రెండు రాష్ర్టాలకే పరిమితమైతే మనకు ఇబ్బందేనని టీఏసీ సభ్యులు అభిప్రాయపడ్డారు. తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లడమే మంచిదని, దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని కమిటీ అభిప్రాయపడింది. ట్రైబ్యునల్‌ తీర్పుపై వైఖరి ఖరారు కోసం ప్రభుత్వం కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేయడం తెలిసిందే. ఇరిగేషన శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆధ్వర్యంలోని ఈ కమిటీ ఇప్పటికే ఒకసారి సమావేశమై చర్చించింది. మళ్లీ ఈ నెల 29న సమావేశం కానుంది. ఈ కమిటీ నివేదిక ఇచ్చాక ప్రభుత్వం వైఖరిని ప్రకటించనుంది. ఆ లోపు అవసరమైతే అఖిలపక్ష భేటీ ఏర్పాటుచేసి, అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకోనుంది.

Tuesday, 25 October 2016

‘ఏపీ, తెలంగాణ మధ్యే పంపిణీ జరగాలి’

‘ఏపీ, తెలంగాణ మధ్యే పంపిణీ జరగాలి’
Sakshi | Updated: October 19, 2016 12:52 (IST)
‘ఏపీ, తెలంగాణ మధ్యే పంపిణీ జరగాలి’
న్యూఢిల్లీ : కృష్ణా జలాల పున: పంపిణీపై నెలకొన్న వివాదంపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు రెండు తెలుగు రాష్ట్రాలకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఉమ్మడి రాష్ట్రానికి చెందిన కృష్ణా జలాలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్యే పంపిణీ జరగాలని ట్రిబ్యునల్ బుధవారం స్పష్టం చేసింది. మిగతా రాష్ట్రాలకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటూ తదుపరి విచారణను డిసెంబర్ 14వ తేదీకి వాయిదా వేసింది.
దీనిపై నాలుగు వారాల్లోగా అభ్యంతరాలు తెలపాలని రెండు రాష్ట్రాలకు ట్రిబ్యునల్ సూచించింది. కాగా ప్రస్తుతం అమల్లో ఉన్న బచావత్ అవార్డు మేరకు కృష్ణాలో కర్ణాటక, మహారాష్ట్రలు 1,319 టీఎంసీల నీటిని వాడుకుంటున్నాయి. అయితే బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ మాత్రం మిగులు జలాలను కూడా పంపిణీ చేసింది. మొత్తం 285 టీఎంసీల మిగులు జలాలు ఉన్నట్టు గుర్తించి వాటిలో కర్ణాటకకు 105 టీఎంసీలు, మహారాష్ట్రకు 35 టీఎంసీలను కేటాయించిన విషయం తెలిసిందే.

అయితే కృష్ణా నదీ బేసిన్ నీటి కేటాయింపుల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తెలంగాణ ప్రభుత్వం మరోమారు బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించింది. కృష్ణా పరీవాహకాన్ని వాడుకుంటున్న నాలుగు రాష్ట్రాలకు తిరిగి పునఃకేటాయింపులు జరపాలని, గతంలో జరిగిన అన్యాయాన్ని సవరించాలని ట్రిబ్యునల్‌ ను ఆశ్రయించింది.  కాగా, కొత్తగా ఏర్పడిన రెండు తెలుగు రాష్ట్రాలు వాటికి ఇంతకు ముందు ఇచ్చిన వాటాలోనే పంచుకోవాలని కర్ణాటక, మహారాష్ట్ర ట్రైబ్యునల్‌లో వాదనలు కొనసాగించాయి. ఈమేరకు తీర్పు వెలువడింది.

రెండు తెలుగు రాష్ట్రాలకు తీవ్ర నిరాశే..

రెండు తెలుగు రాష్ట్రాలకు తీవ్ర నిరాశే..
Sakshi | Updated: October 19, 2016 12:41 (IST)
రెండు తెలుగు రాష్ట్రాలకు తీవ్ర నిరాశే..
హైదరాబాద్ :  కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు రెండు తెలుగు రాష్ట్రాలకు నిరాశే మిగిల్చిందని తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారుడు విద్యాసాగర్ రావు అన్నారు. ట్రిబ్యునల్ తీర్పు వెల్లడించిన అనంతరం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
ట్రిబ్యునల్ తీర్పును పూర్తిగా పరిశీలించాకే భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. నికర జలాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాటలెంతో భవిష్యత్ లో తేలుతుందన్నారు. కాగా ఏపీ పునర్విభజన చట్టం మేరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు జలాల పంపిణీ చేయాలని బ్రిజేష్ ట్రైబ్యునల్ ఇవాళ తీర్పులో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

చంద్రబాబు వైఖరి వల్లే
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి వల్లే ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందని వైఎస్ఆర్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. కృష్ణా జలాలను మూడు రాష్ట్రాల మధ్యే పంచాలని కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసినా ఎన్డీయేలోని భాగస్వామి అయిన చంద్రబాబు నాయుడు ఏమాత్రం స్పందించలేదన్నారు. చంద్రబాబు స్పందించకపోవడం వల్లే తీర్పు రెండు తెలుగు రాష్ట్రాలకు వ్యతిరేకంగా వచ్చిందని మండిపడ్డారు.

కేంద్రం జోక్యం చేసుకోవాలి
కృష్ణా జలాల పంపీణిపై ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలతో మాట్లాడి న్యాయం చేయాలని అన్నారు. కేంద్రం జోక్యం చేసుకుంటేనే ఏపీ, తెలంగాణకు న్యాయం జరుగుతుందని నారాయణ అభిప్రాయపడ్డారు.

కేసీఆర్ తో చర్చించాకే...
బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించిన తర్వాత స్పందిస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు.

బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు - రెండు రాష్ట్రాలకే

రెండు రాష్ట్రాలకే
Posted On: Thursday,October 20,2016

http://www.prajasakti.com/WEBCONTENT/1855423

- కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యూనల్‌ తీర్పు
- అభ్యంతరాలు, వాదనలకు నాలుగు వారాలు గడువు
- తదుపరి విచారణ డిసెంబర్‌14కు వాయిదా
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో
            ఉమ్మడి రాష్ట్రానికి చెందిన కష్ణా జలాలను రెండు తెలుగు రాష్ట్రాల మధ్యే పంపిణీ చేయాలని బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు చెప్పింది. కర్ణాటక, మహారాష్ట్రకు వీటితో సంబంధం లేదని స్పష్టం చేసింది. దీనిపై ఇరు రాష్ట్రాలు తమ అభ్యంతరాలు, వాదనలను నాలుగు వారాల్లోగా ట్రిబ్యునల్‌ ముందు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్‌ 14కు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం మేరకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్యే కష్ణా జలాల పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. విభజన చట్టంలోని సెక్షన్‌ 89 ప్రకారం ఉమ్మడి ఏపికి కేటాయించిన నీటినే రెండు రాష్ట్రాలు పంచుకోవాలని ట్రిబ్యునల్‌ తేల్చిచెప్పింది. ట్రిబ్యునల్‌ తీర్పుతో 2010లో కష్ణా ట్రిబ్యునల్‌ ఇచ్చిన 1001 టిఎంసిలు మాత్రమే ఏపి, తెలంగాణ రాష్ట్రాలు ప్రాజెక్టుల వారీగా పంచుకోవాల్సి ఉంటుంది. జలాల పంపిణీ రెండు రాష్ట్రాల మధ్యే జరగాలని కేంద్ర జలవనరుల శాఖ కూడా ట్రిబ్యునల్‌ దష్టికి గతంలోనే తీసుకెళ్లింది. కష్ణా జల వివాదంపై ఏర్పడిన బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ 2013 నవంబరు 29న తుది తీర్పు చెప్పింది. బచావత్‌ ట్రిబ్యునల్‌ చేసిన కేటాయింపులను కొనసాగిస్తూనే 65 శాతం నీటి లభ్యత, సరాసరి నీటి లభ్యత కింద మిగులు జలాలను కూడా కేటాయించింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 2014 జనవరిలో సుప్రీం కోర్టును ఆశ్రయించింది. మధ్యంతర ఉత్తర్వులో చేసిన కేటాయింపులో నాలుగు టిఎంసిలను తగ్గించి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తూ తుది తీర్పు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటక, బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ తీర్పును గెజిట్‌లో నోటిఫై చేయాలని కోరుతూ మహారాష్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన తర్వాత తెలంగాణ కూడా ఈ కేసులో భాగస్వామి అయింది. కేసు సుప్రీం కోర్టు విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో మొదట రెండు రాష్ట్రాలకా? నాలుగు రాష్ట్రాలకా? అన్నది నిర్ణయించడానికి ట్రిబ్యునల్‌ తొమ్మిది అంశాలను పరిగణనలోకి తీసుకుంది.. దీని ఆధారంగా నాలుగు రాష్ట్రాలు తమ వాదనలు వినిపించాయి. గతేడాది ట్రిబ్యునల్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరగడంతో మరమ్మతు చేయడానికే ఏడాది పట్టింది. ట్రిబ్యునల్‌కు నిర్ణయించిన రెండేళ్ల గడువులో ప్రాథమిక అంశంపై కూడా విచారణ పూర్తి కాలేదు. ఆగస్టుతో గడువు ముగియగా, కేంద్రం ఆర్నెల్లు పొడిగించింది.

తెలుగు రాష్ట్రాలకు నిరాశ
బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు రెండు తెలుగు రాష్ట్రాలకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ప్రస్తుతం అమల్లో ఉన్న బచావత్‌ అవార్డు మేరకు కష్ణా జలాల్లో కర్ణాటక, మహారాష్ట్రలు 1,319 మిగతా టిఎంసిల నీటిని వాడుకుంటున్నాయి. బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ మాత్రం మిగులు జలాలను కూడా పంపిణీ చేసింది. మొత్తం 285 టిఎంసిల మిగులు జలాలు ఉన్నట్టు గుర్తించి వాటిలో కర్ణాటకకు 105 టిఎంసిలు, మహారాష్ట్రకు 35 టిఎంసిలను కేటాయించింది. అయితే కష్ణా నదీ బేసిన్‌ నీటి కేటాయింపుల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తెలంగాణ ప్రభుత్వం మరోమారు బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ముందు వాదనలు వినిపించింది. కష్ణా పరీవాహకాన్ని వాడుకుంటున్న నాలుగు రాష్ట్రాలకు పున్ణకేటాయింపులు జరపాలని, గతంలో జరిగిన అన్యాయాన్ని సవరించాలని ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం: దుమ్మలపాటి శ్రీనివాసరావు, ఏపి అడ్వకేట్‌ జనరల్‌ తీర్పు పూర్తి పాఠం వచ్చిన తర్వాతే దీనిపై ప్రభుత్వంతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఏపి అడ్వకేట్‌ జనరల్‌ దమ్మలపాటి శ్రీనివాసరావు చెప్పారు. ఈ తీర్పు దురదష్టకరమన్నారు. ఇది రెండు రాష్ట్రాలకు శరాఘాతం వంటిందన్నారు.

తీవ్ర నిరాశే : విద్యాసాగర్‌ రావు
బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు తెలుగు రాష్ట్రాలకు నిరాశే మిగిల్చిందని తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారు విద్యాసాగర్‌ రావు అన్నారు. ట్రిబ్యునల్‌ తీర్పును పూర్తిగా పరిశీలించాకే భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. నికర జలాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల వాటలెంతో భవిష్యత్‌లో తేలుతుందన్నారు.

Saturday, 22 October 2016

Brand Vizag gets a big boost with partnership summit

Brand Vizag gets a big boost with partnership summit

TV-5
https://www.youtube.com/watch?v=kIbmFnYN7JU

CH R S SARMA
  ·   PRINT   ·   T+  

inShare
Share1
Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu addressing the
valedictory of the three-day CII Partnership Summit KR DEEPAK
Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu addressing the valedictory of the three-day CII Partnership Summit KR DEEPAK
MoUs signed for investments worth ₹4.78 lakh crore

VISAKHAPATNAM, JAN 14:  
The success of the Partnership Summit of the Confederation of Indian Industry held here earlier this week in association with the Andhra Pradesh Government has given a tremendous fillip to the industrial growth of Visakhapatnam city and district and it has also vastly improved the image of the city in the country and abroad, setting the stage for the flow of future investments.

Buoyed by the success of the summit, Chief Minister N. Chandrababu Naidu has also announced that the next summit of the CII would also be held in the city to sustain the momentum.

As many as 1,500 delegates, 350 them from abroad, participated in the summit. At the end of the summit, it was announced that MoUs entailing an investment of Rs. 4.78 lakh crore were signed during the three days.

Reliance shipyard

On the opening day on Sunday, Anil Ambani made the announcement that a naval ship-building unit would be set up at Rambilli in Visakhapatnam district with an investment of Rs. 5,000 crore, setting the pace. On the subsequent two days also, MoUs were signed on projects relating to Visakhapatnam.

The Rashtriya Ispat Nigam Ltd - Visakhapatnam steel plant committed an investment of more than Rs. 38,000 crore on its future projects - mainly capacity expansion. Many of these projects were announced earlier, but fresh MoUs were signed obviously to boost the figure.

Trina solar project

Trina Solar (India) Pvt Ltd signed a MoU for setting up a Rs. 3,000-crore solar panel manufacturing unit in the multi-product AP Special Economic Zone at Atchyuthapuram in Visakhapatnam district.

×
Unlike the other companies, Trina Solar laid the foundation stone for the project on Tuesday itself, the last day of the summit, at the site. The company representatives said the unit would start production by the end of the year and it would provide jobs to 3,500 people. The unit was allotted 90 acres in the SEZ.

NIPER to be set up

On the last day, the Union Minister for Petroleum, Chemicals and Petro-chemicals made an announcement that the National Institute for Pharmaceutical Education and Research (NIPER) would be set up here at an investment of Rs. 600 crore and it would stimulate the growth of pharma industry in the region surrounding Vizag.

Some of the Visakhapatnam-based private companies such as Vizag Profiles, Sravan Shipping, the CMR group and others signed pacts with the Government promising hundreds of crores of investment. Many of the projects would be in Visakhapatnam and the surrounding areas.

Apart from these, agreements have been signed for several food processing units, tourism projects, and projects in the retail sector in Visakhapatnam district in particular and the north-coastal districts in general.

If these projects fructify and take shape, there is no doubt that Visakhapatnam will become one of the major industrialised districts in the country.

"The State Government will make all efforts to get the projects grounded and get them completed as early as possible. We will pursue them in right earnest and we will review the progress in the next summit of the CII to be held here," said the Chief Minister.

sarma.rs@thehindu.co.in

(This article was published on January 14, 2016)

భాగస్వామ్య సదస్సుకు విశాఖ ముస్తాబు

భాగస్వామ్య సదస్సుకు విశాఖ ముస్తాబు
02-01-2016 22:46:50

హైదరాబాద్‌ ( ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ), కేంద్ర ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖ కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సు కోసం తూర్పు తీరంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన విశాఖపట్నం ముస్తాబవుతోంది. ఈ సదస్సు కోసం హార్బర్‌ పార్క్‌లోని ఎపిఐఐసికి చెందిన విశాలమైన స్థలంలో సకల హంగులతో వేదికను ఏర్పాటుచేస్తున్నారు. ఏసీ హాంగర్స్‌తో ప్రత్యేకంగా కన్వెన్షన్‌ సెంటర్‌ను తీర్చిదిద్దుతున్నారు. ప్రత్యేక లాంజ్‌లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. విశాఖలో మెగా ఈవెంట్స్‌ను హోస్ట్‌ చేసేందుకు వీలైన అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్‌ సెంటర్‌ ఏదీ లేకపోవడంతో భారీ ఖర్చుతో ఈ ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. హార్బర్‌ పార్క్‌లో జరుగుతున్న ఏర్పాట్లు అబ్బురపరిచే విధంగా ఉన్నాయని వైజాగ్‌ పారిశ్రామికవేత్త ఒకరు వ్యాఖ్యానించారు. ఇవి, నవ్యాంధ్రప్రదేశ్‌ నిర్మాణం కోసం పెట్టుబడుల ఆకర్షణ మహాయాగానికి ఏర్పాట్లని, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు అయుత చండీయాగం కోసం తన ఫామ్‌ హౌజ్‌లో సకల హంగులతో చేపట్టిన తాత్కాలిక నిర్మాణాలతో పోల్చుతూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ నెల 10 నుంచి 12 తేదీల మధ్య మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు దేశ, విదేశాలకు చెందిన సుమారు 1,000 మంది ప్రతినిధులు హాజరు కానున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మంత్రులు, అధికారులు, విధాన నిర్ణేతలతో సహా కేంద్ర, రాషా్ట్రలకు చెందిన వివిఐపిలు అనేకమంది హాజరవుతున్నారు. పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో (విభజన తర్వాత) జరుగుతున్న తొలి మెగా ఈవెంట్‌ కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధపెట్టారు. గడువు సమీపిస్తుండటంతో పరిశ్రమల శాఖ అధికారులు ఏర్పాట్లలో తలమునకలుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార, పారిశ్రామిక అవకాశాలను షోకస్‌ చేయడం ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. సాధారణంగా భాగస్వామ్య సదస్సుల్లో లక్షల కోట్ల విలువైన ప్రతిపాదనలు రావడం ఆచరణలోకి వచ్చేసరికి అందులో 20-30 శాతం కూడా కార్యరూపం దాల్చకపోవడం రివాజుగా వస్తోంది. గతంలో ఉమ్మడి ఆంఽధ్రప్రదేశ్‌లోనూ ఇలాంటి అనుభవాలున్నాయి. అయితే, ఈ సారి పకడ్బందీగా కార్యాచరణను ముందుకు తీసుకుపోవాలని ప్రభుత్వం భావిస్తోంది. సదస్సులో వచ్చే పెట్టుబడి ప్రతిపాదనల్లో కనీసం 60-70 శాతమైనా కార్యాచరణలోకి రావాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ‘ పార్ట్‌నర్‌షిప్‌ ఫర్‌ ఎ షేర్డ్‌ అండ్‌ సస్టేనబుల్‌ వరల్డ్‌ ఎకానమి - టు ప్రమోట్‌ సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌’ సదస్సు ఇతివృత్తంగా ఉంటుంది. నిజానికి ఈ భాగస్వామ్య సదస్సును వేలాది మంది డెలిగేట్స్‌తో అంతర్జాతీయ స్థాయి ఈవెంట్‌గా నిర్వహించాలని భావించినా వైజాగ్‌లో వసతి సౌకర్యాల పరిమితి దృష్ట్యా ప్రభుత్వం కొంత సంయమనం పాటించిందని అంటున్నారు. విశాఖలో ఫైవ్‌ స్టార్‌ హోటల్స్‌ కేటగిరిలో 650 గదులు, త్రీస్టార్‌, ఫోర్‌స్టార్‌ విభాగంలో సుమారు 475 గదులున్నాయి. టుస్టార్‌ విభాగంలో 400 గదులు, సింగిల్‌ స్టార్‌ విభాగంలో మరో 400 గదులున్నాయి. అయితే విదేశీ అతిథులను ఫైవ్‌స్టార్‌ కేటగిరిలోనే ఉంచాల్సి వస్తుంది. భాగస్వామ్య సదస్సు సందర్భగా పలు కీలక అంశాలపై చర్చలు కూడా నిర్వహిస్తున్నారు.

ప్రపంచ ఆర్థిక సదస్సు తరహాలో .. విశాఖ భాగస్వామ్య సదస్సు
03-12-2015 23:19:36
 హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ఆర్థిక సదస్సు తరహాలో విశాఖలో అంతర్జాతీయ సిఐఐ-పారిశామ్రిక భాగస్వామ్య సదస్సును నిర్వహించాలని ఆంధ్రప్రదేశ ప్రభుత్వం భావిస్తోంది. జనరవి 10-12వ తేదీ వరకు విశాఖలో ఈ సదస్సును నిర్వహించనున్నారు. ఈసదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీని ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖలో జరిగే పారిశ్రామిక భాగస్వామ్య సదస్సునకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షత వహిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానించాలని, కేంద్ర మంత్రులను కూడా పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

భద్రతాలోపం: విశాఖ సిఐఐ సదస్సులోకి నకిలీ ఐఎఎస్ ప్రవేశం
By: Pratap Published: Monday, January 11, 2016, 20:01 [IST]
http://telugu.oneindia.com/news/andhra-pradesh/fake-ias-enters-into-cii-partnership-summit-170982.html

విశాఖపట్నం: దేశ, విదేశీ ప్రముఖులు పాల్గొంటున్న సిఐఐ భాగస్వామ్య సదస్సులో భద్రతాలోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆదివారం పోలీసు యూనిఫాంలో ఓ ఆగంతకుడు ప్రవేశించగా, సోమవారంనాడు ఓ నకిలీ ఐఎఎస్ అధికారి ప్రవేశించాడు. తాను ఐఎఎస్ అధికారనంటూ ఆ ఆగంతకుడు సదస్సులోకి ప్రవేశించాడు.
అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని రమేష్ నాయుడిగా గుర్తించారు. ఓ సీనియర్ ఐఎఎస్ అధికారి కారులో వచ్చిన అతను ఆయన వెంటనే లోనికి ప్రవేశించినట్లు చెబుతున్నారు. తీరా అనుమానం వచ్చి ఐడి కార్డు అడగ్గా దాన్ని చూపించలేకపోయాడని సమాచారం. దాంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. అతనిపై చీటింగ్ కేసులు కూడా నమోదై ఉన్నట్లు గుర్తించారు.

ఆదివారంనాడు పోలీసు యూనిఫాంలో ఓ వ్యక్తి ప్రవేశించి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అతి సన్నిహితంగా సంచరించినట్లు చెబుతున్నారు. అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

సన్‌రైజ్ ఏపీకి రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు

https://telugu.yourstory.com/read/a3299b3f31/sunrise-epiki-rs-5-lakh-crore-investment-proposals
CHANUKYA
JANUARY 12, 2016

331 అవగానా ఒప్పందాలు, 4.8 లక్షల కోట్ల పెట్టబడులు, 10 లక్షల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు.. ఇదీ మూడు రోజుల పాటు విశాఖ వేదికగా సాగిన సిఐఐ భాగస్వామ్య సదస్సు సారాంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 'సన్ రైజ్ స్టేట్'గా ప్రమోట్ చేసి.. పెట్టుబడులను ఆకర్షించడమే ఏకైక టార్గెట్‌గా పెట్టుకున్న ఏపి సిఎం చంద్రబాబు ఇందులో సక్సెస్‌ సాధించారు. దేశవిదేశాల నుంచి కార్పొరేట్ ప్రముఖులను ఆకర్షించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా స్పష్టమైన పెట్టుబడి హామీలనే పొందారు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ సారి ఐటి హంగామా తగ్గి మ్యానుఫ్యాక్చరింగ్, రిటైల్, అగ్రి, ఫుడ్ ప్రాసెసింగ్, డిఫెన్స్ రంగాల జోరే ఎక్కువగా కనిపించింది. శ్రీకాళహస్తి నుంచి శ్రీకాకుళం వరకూ అన్ని ప్రాంతాలూ కవర్ అయ్యేలా పెట్టుబడి ప్రతిపాదనలు రావడం కూడా ప్రోత్సాహకర విషయమే.


పార్ట్‌నర్షిప్ సమ్మిట్... పెట్టుబడులను ఆకర్షించడంలో బంపర్ హిట్ అయింది. మూడు రోజుల పాటు ఉత్సాహంగా సాగిన ఈ సమావేశాలు ప్రోత్సాహకర వాతావరణంలో మగిశాయి. భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు కార్పొరేట్ కంపెనీలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా తమ సంసిద్ధతను వ్యక్తం చేసింది. మొదటి రోజు డిఫెన్స్, ఆటోమొబైల్ రంగాలకు పరిమితమైన అవగాహనా ఒప్పందాలు రెండో రోజు రిటైల్, అగ్రి, ఫుడ్ ప్రాసెసింగ్‌ రంగాలకు విస్తరించింది. ఈ సందర్భంగా రిటైల్ పాలసీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చివరి రోజున పర్యాటక రంగానికి సంబంధించిన అవగాహనా ఒప్పందాలు ఎక్కువగా కుదిరాయి. అంతే కాకుండా కేంద్రం నుంచి కూడా పెద్ద ఎత్తున హామీల వర్షం కురిసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు పెట్టుబడులు విస్తరించేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి జాగ్రత్త పడింది. ఐటి రంగానికి మాత్రమే పరిమితం కాకుండా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు పెద్ద పీట వేశారు. పోర్టులను అభివృద్ధి చేసి గుజరాత్‌తో పోటీపడేందుకు ఏపి సర్కార్ సిద్ధమవుతోంది.


కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, జయంత్ సిన్హా, అనంత కుమార్ సహా.. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నుంచి ఉన్నతాధికారులు హాజరయ్యారు. కార్పొరేట్ దిగ్గజాల్లో అనిల్ అంబానీ, ఆది గోద్రెజ్, గ్రంధి మల్లికార్జున రావు, బాబా కళ్యాణి, కిషోర్ బియానీ వంటి వాళ్లు ఈ సదస్సులో పాల్గొన్నారు. నలభైకి పైగా దేశాల నుంచి ప్రతినిధులు వచ్చి రాష్ట్రంలోని అవకాశాలను పరిశీలించి, పెట్టుబడులకు ఆసక్తి కనబరిచారు. ఫార్మా, విద్యుత్ కంపెనీలకు పరిమితమైన విశాఖ ప్రాంతం.. భవిష్యత్తులో డిఫెన్స్ రంగానికి కూడా వేదిక కాబోతోందని అనిల్ అంబానీ వెల్లడించారు. రాంబిల్లిలో నేవల్ బేస్‌ ఏర్పాటుకు రూ.5 వేల కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నట్టు ప్రకటించారు. నెల్లూరులో రూ.1200 కోట్లతో ఆటోమోటివ్ హబ్ ఏర్పాటు చేయబోతున్నట్టు భారత్ ఫోర్జ్ అధినేత బాబా కళ్యాణి ప్రకటించారు. గుంటూరు, విజయవాడ, అమరావతి నగరాలకు పైప్డ్ గ్యాస్ అందించాలనే లక్ష్యంతో కృష్ణపట్నం పోర్టులో రూ.3 వేల కోట్లతో గ్యాస్ గ్రిడ్ ఏర్పాటు చేయబోతున్నట్టు పెట్రోగ్యాస్ సంస్థ వెల్లడించింది. 11 సంస్థలో చిత్తూరు శ్రీసిటీ అవగాహన కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల విలువ దాదాపు రూ.12 వేల కోట్లు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కుదిరిన 65 ఎంఓయూల విలువ దాదాపు రూ.6 వేల కోట్లు. స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని రెట్టింపు చేస్తామని ఫాక్స్‌కాన్ సంస్థ తెలిపింది. వచ్చే మూడేళ్లలో రూ.5 వేల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌ చేయబోతున్నట్టు అమరరాజా సంస్థ కూడా ప్రకటించింది.



'' బలమైన నాయకులు ఇంపాజిబుల్‌ను పాజిబుల్ చేసి చూపిస్తారు. వాళ్ల ఆలోచనా ధోరణే వేరుగా ఉంటుంది '' - అనిల్ అంబానీ, అడాగ్ గ్రూప్ ఛైర్మన్

విశాఖ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌ నిర్మాణానికి 840 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రకటించింది. రాజధాని నిర్మాణం కోసం హడ్కో రూ.7500 కోట్లు, ఆంధ్రా బ్యాంక్ రూ.5 వేల కోట్ల రుణాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని స్పష్టమైన ప్రకటనలు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తన మద్దతు తెలిపింది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ రూ.38500 కోట్ల పెట్టుబడితో విస్తరణ, కొత్త ప్రాజెక్టుల అభివృద్ధి చేపడ్తామని స్పష్టం చేసింది. పుట్టపర్తిలో 4 వేల మెగావాట్లతో విద్యుత్ ప్లాంట్, ఆంధ్రలో మరో ప్రాంతంలో 2250 మెగావాట్లతో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్టు కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. 20 వేల కోట్లతో మెడికల్ డివైజ్ పార్క్ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ తెలిపారు. 100 ఎకరాల్లో విశాఖలో నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఫార్మా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ - (నైపర్) నెలకొల్పుతామని కూడా హామీనిచ్చారు. విజయవాడలో సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కూడా ఏర్పాటు చేస్తామి ప్రకటించారు. హెచ్‌పిసిఎల్ - గెయిల్‌ భాగస్వామ్యంతో రూ.30 వేల కోట్లతో పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ నిర్మిస్తామని కూడా కేంద్రం నుంచి స్పష్టమైన హామీవచ్చింది. విశాఖలో హెచ్‌పిసిఎల్ పెట్రోకెమికల్ రీజియన్‌ను విస్తరించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది.



'' పెట్టుబడులకు ఏపి అనువైన రాష్ట్రం. ఇక్కడ ప్రస్థానం ప్రారంభించిన నేను దేశ, విదేశాలకు విస్తరించాను'' - జిఎంఆర్

పర్యాటక రంగంలో కూడా 7840 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు కుదిరాయి. విజయవాడలో ఏడున్నర ఎకరాల్లో ఎనిమిది వేల సీటింగ్ కెపాసిటీ గల అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్, ఫోర్ స్టార్ హోటల్ ఏర్పాటు చేయబోతున్నట్టు మురళీ ఫార్చ్యూన్ సంస్థ ప్రకటించింది. 10 వేల ఎకరాల్లో 73 వేల కోట్లతో ఇండస్ట్రియల్ పార్క్ సిద్ధం చేస్తామని ఎస్సెల్ గ్రూప్ స్పష్టం చేసింది.

'' ఒక్క ఐటి వెంటపడకుండా అభివృద్ధిలో వివిధ రంగాల భాగస్వామ్యం ఉండేలా జాగ్రత్త పడ్డాం. ఆశ్చర్యంగా ఈ సారి చిన్న, మధ్య తరహా కంపెనీలు ఎన్నో పెట్టుబడులకు ముందుకు వచ్చాయి'' - సురేష్ చిట్టూరి, సిఐఐ ఏపి ఛైర్మన్
మూడు రోజుల పాటు సాగిన విశాఖ పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు ఏపి సిఎం చంద్రబాబులో విశ్వాసాన్ని రెట్టింపు చేసింది. రాష్ట్ర రాజధాని నిర్మాణం సహా.. కొత్త ఉద్యోగాల రూపకల్పనకు మార్గం సుగమమైనట్టు కనిపిస్తోంది. వచ్చే ఏడాది కూడా ఈ సదస్సు విశాఖలో జరుగుతుందని సిఐఐ స్పష్టం చేసింది. దావోస్‌లా ప్రతీ ఏడాదీ పారిశ్రామికవేత్తలతో ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసే అంశాన్ని చంద్రబాబు పరిశీలిస్తున్నారు.


భాగస్వామ్య సదస్సు - 2016 పేర రాష్ట్ర సంపద లూఠీ - సిపియం పార్టీ
http://cpimap.org/content/%E0%B0%AD%E0%B0%BE%E0%B0%97%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%B8%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B8%E0%B1%81-2016-%E0%B0%AA%E0%B1%87%E0%B0%B0-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0-%E0%B0%B8%E0%B0%82%E0%B0%AA%E0%B0%A6-%E0%B0%B2%E0%B1%82%E0%B0%A0%E0%B1%80-%E0%B0%B8%E0%B0%BF%E0%B0%AA%E0%B0%BF%E0%B0%AF%E0%B0%82-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9F%E0%B1%80

* ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం- భారత పారిశ్రామిక సమఖ్య (సిఐఐ)లు సంయుక్తంగా కలిసి మూడు రోజులపాటు పెట్టుబడుల సదస్సు విశాఖపట్నంలో ఆర్భాటంగా జరిపారు. ఈ సదస్సులో మొత్తం 328 ఒప్పందాలు జరిగాయని వీటివల్ల 4.67క్ష కోట్లు పెట్టుబడి రాష్ట్రానికి వస్తుందని, 9.58 లక్ష మందికి ఉపాధి కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

                ఈ భాగస్వామ్య సదస్సు ద్వారా రాష్ట్రం దేశంలో కెల్లా అభివృద్ధిలో మొదటి స్థానంలోకి వెళుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రచారం హారెత్తిస్తున్నారు. వాస్తవంగా ఈ పెట్టుబడుల సదస్సు వల్ల రాష్ట్ర ప్రజలకు వచ్చే ప్రయోజనంకన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందని భావిస్తున్నాం.

                 * పెట్టుబడుల ఒప్పందాల పేర రాష్ట్రంలో రైతుల భూములు, ప్రభుత్వ భూములు  పెద్దఎత్తున పెట్టుబడి దారులకు కట్టుబెడతారు. ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం 10 లక్ష ఎకరాల భూములు సేకరించాని నిర్ణయించింది. వెంటనే 5లక్ష ఎకరాలు సిద్ధం చేయాలని సదస్సులో అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

                 * విశాఖ జిల్లాలోని ప్రభుత్వ భూములు, రైతుల భూములు, కొండలు, సహజ వనరులు, విశాఖ స్టీల్‌ప్లాంట్‌, బి.హెచ్‌.పి.వి, రైల్వే, పోర్టు, జివిఎంసి, ఆంధ్రాయూనివర్సిటీ తదితర సంస్థల భూములు పారిశ్రామిక వేత్తకు ధారాదత్తం చేయబడతాయి.

                * రాష్ట్ర తీర ప్రాంతం మొత్తం కొద్ది మంది బడా సంస్థల ఆధిపత్యానికి కట్టబెట్టబడుతుంది. లక్షలాది మత్య్సకారులను, ప్రజలను బలవంతంగా నిర్వాసితులను చేయబోతున్నారు.

                * రాష్ట్రంలో గనులు, నీరు, భూమి అటవీ సంపద వంటివి వనరులు కొల్లగొట్టబడతాయి.

                * రాష్ట్రంలోని పట్టణ, నగర ప్రాంతాల్లోని స్థానిక మున్సిపల్‌ సంస్థ కార్యకలాపాల  ప్రైవేట్‌పరమవుతాయి. పౌర సేవలు మరింత ప్రైవేటీకరణకు దారితీస్తాయి. వీటి ఆధీనంలోని భూములు, స్థలాల విభాగాలు ప్రైవేట్‌ సంస్థ సొంత ఆస్తులుగా మార్చబోతున్నారు.

                * రిటైల్‌ రంగంలోకి భారీ ప్రైవేట్‌ పెట్టుబడులకు అనుమతించడం వల్ల లక్షలాది చిరువ్యాపారులు దివాళా తీస్తారు. లక్షలాది మంది నిరుద్యోగులౌతారు. రిటైల్‌ వ్యాపారం కొన్ని సంస్థల చేతుల్లో కేంద్రీకృతమౌతుంది. ఇది రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టం.

                * పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం పెట్టుబడిదారులకు కొమ్ముకాసేదిగా తన నిజస్వరూపాన్ని బహిర్గత పరుచుకున్నది.

                * రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు చాలా వరకు కార్యరూపం దాల్చవు. 2012లో కూడా పెట్టుబడుల భాగస్వామ్యం సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించారు. అప్పుడు కూడా 6 లక్ష కోట్లు పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. వాటిల్లో ఎన్ని ఆచరణలోకి వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయాలి.

                * సిఐఐ భాగస్వామ్య సదస్సు ప్రతి సం॥రం ఏదో ఒక రాష్ట్రంలో 1995 నుండి జరుగుచున్నది. సర్కస్‌ కంపెనీ వలే ఈ సంస్థలు అన్ని చోట్ల పాల్గొంటాయి. ఏ రాష్ట్ర ప్రభుత్వమైతే విచ్చతవిడిగా దోపిడి చేసుకోవటానికి సకత సదుపాయాలు కల్పిస్తుందో అక్కడ పెట్టుబడులు పెట్టటానికి సిద్ధపడతాయి. ఇందులో చంద్రబాబు నాయుడు ప్రధమస్థానంలో నిలిచాడు.

                * ఈ ఒప్పందా ద్వారా పారిశ్రామిక చట్టాలు, కార్మికచట్టాలు, పర్యావరణ చట్టాలు అన్ని మార్చివేసి పెట్టుబడిదారుల అరాచకాలకు నియంత్రణ లేకుండా చేస్తారు. కార్మికులకు ఉపాధి, వేతన భద్రత ఇతర చట్టబద్ద హక్కు తొలగించడతాయి. నిర్వాశితులకు, స్థానికులకు ఉపాధి లేకుండా చేస్తాయి.

                * రిలయన్స్‌ సంస్థ విశాఖపట్నం రాంబిల్లి వద్ద 5వేల కోట్ల పెట్టుబడిలతో షిప్‌యార్డులను నిర్మిస్తానని రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఇప్పటివరకు ప్రభుత్వ సంస్థలు అయిన గార్డెన్‌ రీచ్‌ షిప్‌యార్డు (జి.ఆర్‌.ఎస్‌) రాంబిల్లి ప్రాంతంలో షిప్‌యార్డు నిర్మిస్తుందని ప్రచారం చేసిన రాష్ట్రప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుందో తెలపాలి. ఇందులో పెద్ద కుట్ర ఉందని భావిస్తున్నాం. రియన్స్‌ వల్ల విశాఖనగరంలో ఉన్న హిందూస్థాన్‌ షిప్‌యార్డుకు తీవ్ర ప్రమాదం వాట్లిలుతుంది. గత 8 ఏళ్ళ నుండి కేంద్ర ప్రభుత్వాలు దీనికి ఎటువంటి ఆర్డర్స్‌ ఇవ్వకుండా నష్టాల్లోకి నెడుతున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్‌ఎస్‌ఎల్‌కు ఆర్డర్స్‌ కొరకు నేటికి ఎలాంటి ప్రయత్నం కూడా చేయలేదు.

                రాబోయే 15 ఏళ్ళలో భారత నౌకాదళంలో 90శాతం నౌకను ఆధునీకరించి రీఫిట్‌ చేయాల్సి ఉంది. దీనికి కనీసం ఏడాదికి 20 వేల కోట్ల రూపాయల చొప్పున సుమారు 15 ఏళ్ళలో 3లక్ష కోట్లు కేంద్ర రక్షణ శాఖ వెచ్చించనుంది. ఈ ఆర్డర్స్‌ ఎట్లాగైన దక్కించుకోవడానికి రిలయన్స్‌ సంస్థ విశాఖలో షిప్‌యార్డును నిర్మించడానికి పూనుకుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడం విశాఖకు తీవ్ర నష్టం.

                 రిలయన్స్‌ సంస్థ గుజరాత్‌లోని పిపవాషిప్‌యార్డును ఇటీవల కొనుగోలు చేసింది. రక్షణ రంగ పరికరాల తయారీ కొరకు 13 రకాల లైసెక్స్‌ కొరకు అంబానీ కేంద్ర ప్రభుత్వానికి ధరఖాస్తు చేశారు. ఇవన్నీ పరిశీలిస్తే రక్షణరంగ ఆర్డర్స్‌ అన్ని అంబానీ వశం చేసుకోవటానికి పెద్ద కుట్రగా ఉంది. ఇది బిజెపి, టిడిపి సహకారంతోనే జరుగుతున్నదనిపిస్తున్నది.

                * ఇప్పటికే ప్రమాదకర పరిశ్రముగా పరిగణించబడిన వాటికి తిరిగి ఈ సదస్సులో వాటి కార్యకలాపాలు విస్తరించుకోవడానికి ఒప్పందాలు చేసుకోవడం అన్యాయం. ఉదా: శ్రీకాకుళంలో ఉన్న ట్రైమాక్స్‌ బీచ్‌ శాండ్‌ సంస్థ 2500 కోట్లుతో విస్తరణకు రాష్ట్రప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఇప్పటికే  అనేక ఆంధోళనలు జరుగుచున్నాయి. బీచ్‌శాండ్‌ తీయడం వల్ల సముద్రపు నీరు సుదూర ప్రాంతాలకి చొచ్చుకెళ్ళి గ్రామాల  భూగర్భ నీరు ఉప్పు నీరుగా మారుతున్నాయి. పర్యావరణం కలుషితం అవుతున్నది. తాజా ఒప్పందం అక్కడి ప్రజలకు, మత్య్సకారులకు తీవ్ర నష్టం.

                * ఖాయిలాపడిన పరిశ్రమల పునరుద్దరణ కొరకు చంద్రబాబు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో 28 ఫెర్రొఎల్లాయిస్‌ పరిశ్రమలు మూతపడ్డాయి. 12జ్యూట్‌ పరిశ్రమలు మూతపడ్డాయి. చక్కెర పరిశ్రమలు కునారిల్లుతున్నాయి. షిప్‌యార్డు, బిహెచ్‌పివిలకు ఆర్డర్స్‌ లేవు. స్టీల్‌ప్లాంట్‌కి సొంత గనులు కేటాయించకపోవడం వల్ల తీవ్ర ఒడిదడుకులు ఎదుర్కొంటున్నది.

                * విశాఖ నగరంలో ఉన్న ఐటి పరిశ్రమలు అగమ్యగోచరంలో ఉన్నాయి. ఐటి దిగ్గజాలైన విప్రో, సత్యం మహేంద్ర  వంటివి పూర్తయి 6 ఏళ్ళయిన ప్రారంభించలేదు. అనేక సంస్థలు రుషికొండ మీద నిర్మాణమైన ప్రారంభంకాలేదు. ప్రారంభమైనవి మూసివేస్తామని ప్రకటిస్తున్నారు.