Friday, 10 June 2016

Enemy's enemy is my friend: China-Pak ties

Rediff.com  » News » Enemy's enemy is my friend: China-Pak ties thrive to tackle India, says US experts

Enemy's enemy is my friend: China-Pak ties thrive to tackle India, says US experts

ShareComment
To get such articles in your inbox
Text size:  A   A   A

March 15, 2016 17:22 IST
The strategic alliance between China and Pakistan is primarily driven by their rivalry with India, eminent US experts have said, with one of them expressing concern over Sino-India border tensions.
"China's close ties with Pakistan also raise tension in the subcontinent. The China-Pakistan relationship has always been strategic in nature driven by their mutual rivalry with India," Katherine C Tobin, commissioner of the US China Economic and Security Review Commission, said during a hearing on China in South Asia.
Lisa Curtis of the Heritage Foundation -- a top American think-tank -- said that the current policy of the US is "hands-off approach" when it comes to tensions between India and China.
"I think the US has taken a very hands-off approach, but there may be some room for contingency planning back here in the US if the Sino-India border disputes were to ratchet up," Curtis said.
"And certainly we have seen on two occasions in the last two years or three years rather, once in the spring of 2013, once in the fall of 2014, that tensions ratcheted up in terms of unusual troop movements by the Chinese People's Liberation Army forces in the Ladakh region," she said.
"So, it's certainly something that I think we need to pay attention to. I am not saying the US needs to get involved per se, but we should at least have an idea of how the US might react if the tensions were to escalate quickly along the border," Curtis said.
China, she argued, seeks to build strategic and military ties with Pakistan in order to contain Indian power and to prevent India from extending its influence outward and essentially prevent it from focusing its attention and military resources towards China.
China's relations with India are marked by mutual suspicion, said James F Moriarty, senior adviser for South Asia at Bowerr Group Asia.
"China's relations with Pakistan evolved into an extremely close economic and security partnership. And China's relations with the remaining countries of South Asia remained cordial, but largely lacked substance," he said.
An increasingly close US-India relationship will be key to the US success in the Indo-Pacific region, Moriarty said.
The fast growing economies in strategic locations of the other countries of South Asia require that the US also maintains close positive relations with those countries, he said.
When the US interest in those countries do not coincide with India's, the US should pursue its own interest while being as transparent as possible within India over policy differences, he argued.
"Think carefully before punishing Pakistan. The United States cannot afford not to have decent working relations with a nuclear armed nation facing serious terrorism issues, and one that is already a leading source of migrant flows into Europe," Moriarty said.

Vijayawada set to lose ground

DECCAN CHRONICLE.
PublishedMay 23, 2016, 1:19 am IST
UpdatedMay 23, 2016, 1:19 am IST
A high power committee meeting, under the supervision of N. Chandrababu Naidu, has approved the project and designs, made by GICC of China.
 A meeting, under the supervision of the CM  approved the plan to convert Swaraj Maidan into a large commercial building complex
  A meeting, under the supervision of the CM approved the plan to convert Swaraj Maidan into a large commercial building complex
Vijayawada: Swarajya Maidan, popularly known as PWD ground, the only open space in the heart of Vijayawada city for public utility, will soon get confined to memory. The Andhra Pradesh government has decided to construct the biggest city square commercial building complex at the spot in Vijayawada city.
A high power committee meeting, under the supervision of CM N. Chandrababu Naidu, has approved the project and designs, made by GICC of China. Shopping complexes and parking areas would be built in the open space, according to Chief Minister’s Office (CMO).
plan of the proposed complex Plan of the proposed complex
Officials said space could be doubled with the new buildings to be used   for tourism purpose. Construction would be completed phase wise. The government would also get income from this project. The state government also took decision to shift the Rytu Bazar from PWD grounds to the new venue opposite Alankar theatre.

చంద్రబాబు చైనా పర్యటన షెడ్యూల్ ఖరారు

చంద్రబాబు చైనా పర్యటన షెడ్యూల్ ఖరారు
10-06-2016 14:53:34

విజయవాడ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చైనా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 26 నుంచి 29 వరకు చైనాలో సీఎం పర్యటించనున్నారు. చైనాలో వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. అలాగే ఏపీలో పెట్టుబడుల కోసం వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అవనున్నారు.

ఏపీ ఉద్యోగుల స్థానికతపై రాష్ట్రపతి ఆమోదముద్ర

ఏపీ ఉద్యోగుల స్థానికతపై రాష్ట్రపతి ఆమోదముద్ర
10-06-2016 10:57:37

న్యూఢిల్లీ : ఏపీ ఉద్యోగుల స్థానికతకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించి నాలుగు పేజీల గెజిట్ నోటిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. స్థానికతపై మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వమే విడుదల చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు తెలంగాణలో స్థిరపడి విభజన నేపథ్యంలో తిరిగి ఏపీకి వెళ్లే వారి స్థానికతపై స్పష్టత లేకుండా పోయింది. తాజా నోటిఫికేషన్‌తో స్పష్టత ఏర్పడింది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే వారికి అక్కడ స్థానికత వర్తించే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి గెజిట్ నోటీఫికేషన్‌ను విడుదల చేశారు.
 
స్థానికతకు సంబంధించి అడ్డంకులను తొలగించాలని కోరుతూ సీఎం చంద్రబాబు గత అక్టోబర్‌లో ఏడు పేజీల లేఖ రాసిన విషయం తెలిసిందే. సుమారు ఎనిమిది నెలల కసరత్తు అనంతరం స్థానికతపై తుది నిర్ణయం తీసుకున్నారు. గత సోమవారమే ఈ ఫైల్‌ను రాష్ట్రపతి భవన్‌కు పంపగా ఈరోజు నోటిఫికేషన్‌ను జారీ అయింది. 2017 జూన్ 2నాటికి ఏపీకి తరలివెళ్లే ఉద్యోగులు, వారి పిల్లలు, సామాన్య ప్రజలకు స్థానికత కల్పించేలా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్‌తో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ఉద్యోగుల స్థానికత అంశానికి ముగింపు పలికినట్లైంది.

Thursday, 9 June 2016

రసాభాసగా రాజధాని తరలింపు!

రసాభాసగా రాజధాని తరలింపు!

Sakshi | Updated: June 10, 2016 00:30 (IST)
రసాభాసగా రాజధాని తరలింపు!
సందర్భం

ఉద్యోగులు తరలి రాకముందే విజయవాడలో రెట్టింపు అయిన ఇంటి అద్దెలను నియంత్రించలేని ప్రభుత్వం ఉద్యోగులను విమర్శిస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాల పరిరక్షణ కోసమే ప్రభుత్వ నిర్ణయాలు మారుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరా వతికి రాష్ట్ర సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాల తర లింపు రసాభాసగా మారింది. ఆంతరంగికంగా పరిష్కరించుకో వలసిన సమస్య రోడ్లమీద రచ్చగా అయింది. జూన్ 27 లోపు ఆఫీసులు తరలిపోవల్సిందేనని ముఖ్యమంత్రి పత్రికల్లో పదేపదే ప్రకటించడం ఉద్యోగులపై చెడు అభిప్రాయం కలిగిస్తోంది. కార్యాలయాలు ఏర్పాటు చేస్తే వస్తామని ఉద్యోగులు చెబు తున్నా ముఖ్యమంత్రి మొండిగా వాదిస్తున్నారు.

 రాష్ట్రం విడిపోయి 2 సంవత్సరాలు పూర్తయింది. అమ రావతిని రాజధానిగా ప్రకటించి ఏడాది దాటింది. రాష్ట్ర కార్యాలయాల తరలింపు విషయంలో ప్రభుత్వ వైఖరి తొలి నుంచీ గందరగోళంగా ఉంది. ఉమ్మడి రాజధానిగా హైదరా బాద్‌ను పదేళ్ల కాలానికి ఉంచినప్పుడేమో అది చాలదని వాదించారు. విభజన తర్వాత హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయానికి కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి అనవసర హంగులు చేశారు. కొంతకాలం వరకు ఇక్కడే ఉంటారు కాబట్టి ఈ ఖర్చులు పెడుతున్నారని అందరూ భావించారు. ఫోన్ ట్యాపింగ్ తర్వాతే ప్రభుత్వం మూడ్ మారిపోయింది. హడావుడిగా తాత్కాలిక రాజధానికి కార్యాలయాలు తరలి స్తామని, మంగళగిరిలోని అమరావతి టౌన్‌షిప్‌లో భవ నాలు నిర్మిస్తామన్నారు.


దీనికి సుమారు 150 కోట్లు ఖర్చు అవుతుంది కాబట్టి వృథా అని తర్వాత విరమించుకున్నారు. గన్నవరం విమా నాశ్రయం వద్ద మేధా టవర్స్‌లోకి తరలిస్తామన్నారు. తర్వాత వెలగపూడిలో తాత్కాలిక సచివాలయానికి శంకు స్థాపన చేశారు. 6 బ్లాకులు జి+1 ఫ్లోర్స్‌ని 300 కోట్ల ఖర్చుతో చేపట్టారు. మార్కెట్‌లో నిర్మాణానికి చదరపు అడుగుకు రూ. 1,500 రేటు ఉంటే రూ. 3,300కి ఎల్-టి, షాపూర్‌జీ సంస్థలకు అప్పగించారు. ఆధునిక సాంకేతికత, తక్కువ సమయంలో నిర్మించడానికే ఇంత ఎక్కువ రేటు ఇచ్చామని సమర్థించారు. ఆ తర్వాత హెచ్‌ఓడీ కార్యాలయా లను కూడా ఆ భవనాల పైనే 2,3 ఫ్లోర్‌లుగా కడతామ న్నారు. దీనికి ఉద్యోగులు అంగీకరించారు. అయితే అక స్మాత్తుగా సీఎం తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. వెలగ పూడిలో నిర్మాణాన్ని జీ+1 కే పరిమితం చేస్తూ 2,3 ఫ్లోర్లకు పిలిచిన టెండర్లు రద్దు చేశారు. సచివాలయం మాత్రమే అక్కడ ఉంటుందని, హెచ్‌ఓడీ ఆఫీసులు విజయవాడ, గుంటూరుల్లో అద్దె భవనాల్లోకి జూన్ 27లోపు తరలించా లని ప్రకటించారు. దీనితో ఉద్యోగుల్లో ఆందోళన తలెత్తింది.


వెలగపూడిలో నిర్మిస్తున్న భవనాల్లో జూన్ 27లోపు అన్ని వసతులు సమకూరటం కష్టమని, కనుక పూర్తయితేనే వెళతామని ఉద్యోగులు అంటున్నారు. పైగా అక్కడ ఉండ టానికి నివాస గృహాలు లేవు. ఉండవల్లి, మంగళగిరి, తాడే పల్లి, విజయవాడ, గుంటూరుల నుంచి వెలగపూడికి సరైన రోడ్డు వసతే లేదు. వాస్తవ పరిస్థితులు మాట్లాడుతున్న ఉద్యోగులపై ముఖ్యమంత్రి నిరంకుశంగా వ్యవహరిస్తు న్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రభుత్వ భవనాల్లో ఉంటున్న హెచ్‌ఓడీ ఆఫీసులను విజయ వాడ/గుంటూరు ల్లోని ప్రైవేట్ భవనాల్లోకి తరలిస్తే అద్దె కోసం కోట్లాది రూపాయలు వ్యయం అవుతుంది. ప్రజలపై ఇంత భారం ఎందుకు మోపాలి. పదే పదే నిర్ణయాలు ఎందుకు మార్చు కుంటున్నారన్న ప్రశ్నలకు సమాధానాలు లేవు. పైగా ప్రభుత్వ ఆఫీసుల కోసం చూస్తున్న అద్దె భవనాలు అనుకూ లంగా లేవు. ఎందుకూ పనికిరాని భవంతులకు కూడా చద రపు అడుగుకు రూ. 20-30 అద్దె అడుగుతున్నారు. బిల్డిం గుల్లో వసతుల కల్పనకు లక్షలాది రూపాయలు అడ్వా న్సులు అడుగుతున్నారు. వసతుల కల్పనకు 2-3 నెలల సమయం కోరుతున్నారు. మూడేళ్ల కాలానికి అద్దె అగ్రి మెంటు అడుగుతున్నారు. ఇన్ని షరతులు ఒప్పుకుని, అద్దె కొంపలకు హడావుడిగా కార్యాలయాలు తరలించడం ఎందుకు అనే ప్రశ్నకు ప్రభుత్వమే సమాధానం ఇవ్వాలి.


పైగా 120 హెచ్‌ఓడీ ఆఫీసులను ఎక్కడెక్కడో ఏర్పాటు చేస్తే గందరగోళం ఏర్పడుతుంది. ప్రజలకు అసౌకర్యం కూడా. హైదరాబాద్ నుంచి విజయవాడకు, తర్వాత వెలగ పూడికి రెండు పర్యాయాలు ఆఫీసులు మార్చడం ఎంతో శ్రమ, ఖర్చుతో కూడుకున్నది. మూడేళ్లపాటు అద్దెకొంపల్లో హెచ్‌ఓడీ ఆఫీసులు ఉంటే అమరావతి ఏవిధంగా అభివృద్ధి అవుతుంది. అక్కడ భూములిచ్చిన వారి నోట్లో మట్టికొట్టి నట్లు అవుతుంది. రాజధానిలోని సచివాలయానికి వెళ్లడా నికి హెచ్‌ఓడీ అధికార్లకు రోజూ గంటల సమయం వృథా అవుతుంది.
 తమ పిల్లల స్థానికత విషయమై ఉద్యోగులు లేవనెత్తిన సందేహాలను పరిష్కరించకుండా వారిపై బెదిరింపులకు పాల్పడుతోంది. ప్రశ్నిస్తున్న వారిపై రాష్ట్రాభిమానం లేదని, ప్రజలకు సేవ చేసే చిత్తశుద్ధి లేదని నిందలు వేస్తున్నారు. ఉద్యోగులు తరలి రాకముందే విజయవాడలో రెట్టింపు అయిన ఇంటి అద్దెలను నియంత్రించలేని ప్రభుత్వం ఉద్యో గులను విమర్శిస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయో జనాల పరిరక్షణ కోసమే ప్రభుత్వ నిర్ణయాలు మారుతు న్నాయి. ప్రజల పేరు చెప్పి, పరిపాలన వంకతో తన మద్ద తుదారులకు లాభాలను చేకూర్చడానికి కార్యాలయాల తరలింపును ప్రభుత్వం హడావుడిగా చేపట్టింది.


 చదరపు అడుగుకు రూ. 10 ఉన్న అద్దెలను రూ. 20 నుంచి 30 వరకు చెల్లించడానికి ప్రభుత్వం అనుమతిం చింది. దీనివల్ల భవన యజమానులకే లాభం. ప్రజల వద్దకు పాలన పేరుతో ప్రతిదాన్ని వ్యాపారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం. అద్దె కొంపల్లోకి వచ్చి ప్రభుత్వ నిధులను రియల్ ఎస్టేట్ వాళ్లకు అప్పజెప్పడాన్ని ఉద్యోగులు ప్రశ్నిం చాలి. స్వంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేయాలి. వెలగ పూడిలోనే అన్ని ప్రభుత్వ భవనాలూ నిర్మించాలని కోరాలి. ఈ విషయంలో ప్రభుత్వానికి వంతపాడుతున్న ఉద్యోగ సంఘ నాయకులు ఉద్యోగుల ఆగ్రహాన్ని చవి చూస్తారు. రాజధానికి ప్రభుత్వ కార్యాలయాల తరలింపు కూడా పెద్ద కుంభకోణంగా మారడమే అసలు విషాదం.
 
- జి. హనుమంతరావు
 వ్యాసకర్త అధ్యక్షులు, ఎంప్లాయీస్ కో-ఆర్డినేషన్ కమిటీ, ఉద్యోగక్రాంతి  మొబైల్ : 94902 34250   

మిషన్ కాకతీయ, భగీరథకు 24,200 కోట్లు

మిషన్ కాకతీయ, భగీరథకు 24,200 కోట్లు

Sakshi | Updated: June 10, 2016 07:41 (IST)
మిషన్ కాకతీయ, భగీరథకు 24,200 కోట్లువీడియోకి క్లిక్ చేయండి
  •  ఆర్థిక సాయం అందించాలని కేంద్రానికి నీతి ఆయోగ్ సిఫార్సు
  •  భగీరథకు రూ.19,200 కోట్లు, కాకతీయకు రూ.5,000 కోట్లు..
  •  వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.450 కోట్లు ఇవ్వండి
  •    ఈ ప్రాజెక్టులతో ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి
  •      చెరువుల పునరుద్ధరణతో సాగు విస్తీర్ణం, భూగర్భ జలాల పెంపు
  •      కరువును అధిగమించొచ్చు.. ఇంటింటికీ తాగునీరు మంచి నిర్ణయం
  •      ఈ పథకాలకు ఆర్థిక సాయం అందించడం సహేతుకమని సూచన
  •      ఫలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు
  •      త్వరలోనే కేంద్రం ఆర్థిక సాయం ప్రకటించే అవకాశం
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పట్టు వదలకుండా చేసిన ప్రయత్నం ఫలించనుంది. కొత్త రాష్ట్రంలో అమలవుతున్న బృహత్తర పథకాలకు రూ.24,200 కోట్లు ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేసేందుకు చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి రూ.19,200 కోట్లు, చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయకు రూ.5,000 కోట్లు ఇవ్వాలని సూచించింది. వీటితోపాటు రాష్ట్రంలోని తొమ్మిది వెనుకబడిన జిల్లాలకు గత ఏడాది తరహాలో రూ.450 కోట్ల సాయం అందించాలని ప్రతిపాదించింది. అంతేకాదు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలతో ఎన్నో ప్రయోజనాలున్నాయని, వాటికి ఆర్థిక సాయం అందించడం సహేతుకమని స్పష్టం చేసింది. నీతి ఆయోగ్ సిఫార్సుల నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందే అవకాశముందని.. సిఫార్సు చేసిన స్థాయిలో కాకపోయినా ఒక మోస్తరుగానైనా నిధులు రావొచ్చని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
 
రెండేళ్లుగా విజ్ఞప్తులు..
భారీ వ్యయ అంచనాతో చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు ఆర్థిక సాయం అందించాలని కేంద్రానికి రాష్ట్రం రెండేళ్లుగా విజ్ఞప్తులు చేస్తోంది. కొత్త రాష్ట్రం కావడంతో ప్రత్యేక అభివృద్ధి (స్పెషల్ డెవలప్‌మెంట్) ప్యాకేజీ కింద ఈ సాయం చేయాలని కోరింది. 2015-19 సంవత్సరాలకు రూ.30,571 కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని ఈ ఏడాది ఫిబ్రవరి 11న సీఎం కేసీఆర్  ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఢిల్లీకి వెళ్లినప్పుడూ సీఎం ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా రాష్ట్రానికి వచ్చిన సందర్భం లోనూ విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 12న రాష్ట్రానికి వచ్చిన నీతి ఆయోగ్ బృందం... మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలపై ప్రత్యేకంగా ఉన్నతాధికారులతో సమీక్షిం చింది.

ఆ బృందానికి రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెం టేషన్ ద్వారా ఈ పథకాల పురోగతిని వివరించింది. మిషన్ కాకతీయ ద్వారా ఐదేళ్లలో రూ.20 వేల కోట్లతో 46,351 చెరువులను పునరుద్ధరించాలని లక్ష్యంగా ఎంచుకున్నామని... రూ.5,000 కోట్లు ఆర్థిక సాయం అందించాలని కోరింది. ఇక రూ.42 వేల కోట్ల అంచనాతో చేపట్టిన మిషన్ భగీరథతో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికీ మంచి నీటిని అందించే ప్రణాళికను పంచాయతీరాజ్ విభాగం విశ్లేషించింది. ఈ పథకానికి రూ.19 వేల కోట్ల సాయం కోరింది. ఈ విజ్ఞప్తులను పరిశీలించిన నీతి ఆయోగ్ బృందం తెలంగాణకు ఆర్థిక సాయం అందించాలని కేంద్రానికి సిఫార్సు చేసింది.
 సాయం అందించాల్సిందే..: మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు ఆర్థిక సాయం అందించాల్సిన అవసరముందని, ఇది సహేతుకమైన కారణమని నీతి ఆయోగ్ తమ సిఫార్సులో ప్రస్తావించింది. చెరువుల పునరుద్ధరణతో సాగు విస్తీర్ణం, భూగర్భ జలమట్టాలు పెరుగుతాయని.. వేసవి, కరువు పరిస్థితుల్లో నీటి ఎద్దడిని అధిగమించే వీలుందని ప్రస్తావించింది. రాష్ట్రంలోని అన్ని ఆవాస ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు తలపెట్టిన మిషన్ భగీరథకు నిధులివ్వడం సహేతుకమని, ఈ వివరాలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖకు సూచించింది. అయితే కేంద్రం నీతి ఆయోగ్ సూచించినన్ని నిధులు ఇవ్వకపోయినా.. కొంతమేరకైనా సాయం విడుదల చేసే అవకాశాలు మెరుగుపడ్డాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
 వెనుకబడిన జిల్లాలకు..
రాష్ట్రంలోని 9 వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి గత ఏడాది కేంద్రం ప్రత్యేక సహాయం (స్పెషల్ అసిస్టెన్స్ గ్రాంట్) కింద రూ.450 కోట్లు ఇచ్చింది. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని ఒక్కో జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున కేటాయించింది. ఈ జిల్లాలకు 2016-17 ఆర్థిక సంవత్సరానికి కూడా నిధులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ, నీతి ఆయోగ్‌లకు లేఖ రాసింది. ఆ ప్రతిపాదనలను పరిశీలించిన నీతి ఆయోగ్ ఈసారి కూడా నిధులు ఇవ్వాల్సిన అవసరముందని ఆర్థిక శాఖకు సిఫార్సు చేసింది. తొలి ఏడాది వన్‌టైం అసిస్టెన్స్‌గా ఈ గ్రాంటును విడుదల చేసినా.. నీతి ఆయోగ్ సిఫార్సుతో ఈ ఏడాది కూడా ఈ నిధుల మంజూరుకు మార్గం సుగమమైంది.

సిటీపై డ్రోన్ కన్ను

సిటీపై డ్రోన్ కన్ను

Sakshi | Updated: June 10, 2016 02:06 (IST)

http://www.sakshi.com/news/hyderabad/drone-surveillance-in-hyderabad-350266
సిటీపై డ్రోన్ కన్ను
  • బందోబస్తులు, భద్రతా విధుల్లో వినియోగం
  •  రూ.7 లక్షలతో కొనుగోలు చేసిన సైబరాబాద్ పోలీసులు
ప్రముఖుల భద్రత, బందోబస్తు అంశాలతో పాటు కీలక సమయాల్లో ట్రాఫిక్ స్థితిగతుల్ని ఇకపై డ్రోన్ కెమెరాల ద్వారా  అధ్యయనం చేయనున్నారు. ఇందుకోసం సైబరాబాద్ పోలీసులు డ్రోన్ కెమెరా కొనుగోలు చేశారు. రూ.7 లక్షలు వెచ్చించి సమీకరించుకున్న దీనిని బుధవారం కమిషనరేట్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ‘త్రీజీ’ పరిజ్ఞానంతో పని చేసే ఈ కెమెరా ఇటీవల ప్రారంభించిన సైబరాబాద్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)తో అనుసంధానమై ఉండేలా చర్యలు తీసుకున్నారు.   - సాక్షి, హైదరాబాద్

అక్కడ నిత్యం ‘రద్దీ’నే..
ప్రతిష్టాత్మక సంస్థలు, అనేక కీలక కేంద్రాలు ఉన్న సైబరాబాద్‌కు నిత్యం వీఐపీలు, వీవీఐపీల తాకిడి ఉంటుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా వీరికి భద్రతా చర్యలు తీసుకోవాలి. దీంతో పాటు ఇతర ఉత్సవాలు తదితరాలు జరిగే సందర్భంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం ఈ బందోబస్తు, భద్రత ఏర్పాట్లలో భాగంగా సైబరాబాద్ పోలీసులు సీసీ కెమెరాలను వినియోగిస్తున్నారు. ప్రభుత్వం, కమ్యూనిటీలు ఏర్పాటు చేసిన వాటితో పాటు అవసరానికి తగ్గట్టు తాత్కాలిక ప్రాతిపదికన సీసీ కెమెరాలు వినియోగిస్తున్నారు.
రియల్ టైమ్ సమాచారం..
సైబరాబాద్ పోలీసులు ప్రస్తుతం కొనుగోలు చేసిన డ్రోన్ కెమెరా ఖరీదు రూ.7 లక్షలు. ‘త్రీజీ’ పరిజ్ఞానంతో పని చేసే దీనిని రిమోట్ కంట్రోల్ సాయంతో భూమి నుంచి గరిష్టంగా 800 మీటర్ల ఎత్తులో తిప్పే అవకాశం ఉంది. దాదాపు కిలోమీటరు పరిధిలో ఉన్న ప్రాంతంలోని అంశాలను ఇది చిత్రీకరిస్తుంది. ఆ దృశ్యాలను ఎప్పటికప్పుడు(రియల్ టైమ్) సీసీసీలోని కంప్యూటర్లకు అందిస్తుంది. అక్కడ ఉండే సిబ్బంది, అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటికి అనుగుణంగా చర్యలు తీసుకునే ఆస్కారం ఏర్పడుతుంది. సీసీసీకి అనుసంధానించి ఉన్న ఇతర కెమెరాలు అందించే సమాచారం కంటే డ్రోన్ కెమెరా ద్వారా లభించే విజువల్స్ మరింత మెరుగైన ఫలితాలు ఇస్తాయని అధికారులు చెప్తున్నారు.
డ్రోన్ ప్రయోగం సక్సెస్..
ఈ అత్యాధునిక డ్రోన్ కెమెరా పనితీరును సైబరాబాద్ అధికారులు బుధవారం ప్రయోగాత్మకంగా పరీక్షించారు. గచ్చిబౌలిలోని కమిషనరేట్ ప్రాంగణంలో ఉన్న సువిశాలమైన మైదానం లో దీన్ని వినియోగించారు. అందులో ని ప్రతి ప్రాంతాన్నీ సీసీసీలోని సిబ్బం ది ఎలాంటి అంతరాయం లేకుండా చూడగలిగారు. ప్రస్తుతం సీసీసీలో మాత్రమే కనిపిస్తున్న ఈ దృశ్యాలను భవిష్యత్తులో ఉన్నతాధికారులు తమ స్మార్ట్‌ఫోన్లలోనూ ఎప్పటికప్పుడు చూసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ డ్రోన్ కెమెరా నిర్వహణపైనా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని ఉన్నతాధికారులు