Thursday, 9 June 2016

నటుడి కిడ్నాప్ కేసులో ఛానల్ సీఈవో అరెస్ట్

నటుడి కిడ్నాప్ కేసులో ఛానల్ సీఈవో అరెస్ట్

Sakshi | Updated: June 09, 2016 13:45 (IST)
నటుడి కిడ్నాప్ కేసులో   ఛానల్ సీఈవో అరెస్ట్వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : సినీనటుడు  కాలెపు శ్రీనివాసరావు కిడ్నాప్ కేసులో మొత్తం11మందిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఛానల్ సీఈవో  శివకుమార్ సహా సీఐడీ హోంగార్డును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 74వేల నగదు, హ్యాండీ క్యామ్సదరు ఛానల్మైక్, కారు, గోల్డ్ చైన్, 13 సెల్ ఫోన్లు, బంగ్లాదేశ్ కు చెందిన పాస్పోర్టును స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళితే సీఐడీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న హోంగార్డు ఎస్ అవతారం ఎత్తాడు. ఛానెల్లో పనిచేస్తున్న డ్రైవర్ కానిస్టేబుల్ అవతారం ఎత్తాడు. ఇద్దరు వ్యభిచారిణులలో ఒకరు మహిళా రిపోర్టర్ అవతారం ఎత్తారు. అంతా కలిసి సినీ నటుడి ఇంట్లోకి ప్రవేశించి వ్యభిచారం గృహం నిర్వహిస్తున్నావంటూ బెదిరించి డబ్బులు లాక్కున్నారు. అంతేకాకుండా ఇంకా డబ్బు కావాలంటూ కిడ్నాప్కు పాల్పడి పోలీసులకు చిక్కారు.

వివరాల్లోకి వెళితే శ్రీకృష్ణానగర్లో నివసించే సినీ నటుడు కాలెపు శ్రీనివాసరావు(48) నివాసంలోకి గత నెల 31 తేదీన ఉదయం 10.30 గంటలకు అయిదుగురు యువకులు, ఇద్దరు యువతులు ప్రవేశించారు. తమను తాము పోలీసులమని, న్యూస్ఛానెల్ ప్రతినిధులమంటూ లాఠీతో పాటు డమ్మీ పిస్టల్, ఛానెల్ లోగోతో లోనికి ప్రవేశించి శ్రీనివాసరావును వ్యభిచారగృహం నిర్వహిస్తున్నావంటూ కెమెరా ఆన్చేసి బెదిరించారు. బీరువాలో ఉన్న డబ్బు దొంగిలించారు. బలవంతంగా కారులో తీసుకుని వెళ్లి ఏటీఎం కార్డు ద్వారా మరింత డబ్బును డ్రా చేయించారు. రూ. 2 లక్షలు ఇస్తే టీవీ ఛానెల్లో రాకుండా చేస్తామంటూ నగరమంతా తిప్పారు. వారి బారినుంచి తప్పించుకొని బయటపడ్డ శ్రీనివాసరావు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసుల విచారించగా.. సీఐడీ విభాగంలో హోంగార్డుగా పని చేస్తున్న రాజు ఎస్ఐగా బిల్డప్ ఇచ్చాడు. టీవీ ఛానెల్ డ్రైవర్గా పని చేస్తున్న మధు కానిస్టేబుల్గా పరిచయం చేసుకున్నాడు. ఇద్దరు వ్యభిచారిణులలో ఒకరు ఛానెల్ విలేకరినంటూ అదరగొట్టారు. ఛానెల్ యజమానే మీ జీతాలు మీరే సంపాదించుకోండి నాక్కూడా నెలకు ఒక్కొకరు రూ.25 వేలు తెచ్చివ్వండి అని చెప్పడంతో తామంతా రోడ్డు కెక్కామని నిందితులు తెలిపారు. ఛానెల్ ప్రతినిధులమంటూ చెప్పుకున్న జలీల్, జగదీష్, మధు, సంజయ్రెడ్డి, లక్ష్మి, దుర్గ, హోంగార్డు రాజులను అదుపులోకి తీసుకున్నారు.


రెండేళ్లలో ఏ వర్గానికీ సంతృప్తి కలగలేదు: బొత్స

రెండేళ్లలో వర్గానికీ సంతృప్తి కలగలేదు: బొత్స 
08-06-2016 23:24:11
http://cdn3.andhrajyothy.com/AJNewsImages/2016/Jun/20160608/Hyderabad/636010250517140802.jpg

హైదరాబాద్‌, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండేళ్ల పాలనలో ఒక్క వర్గానికీ సంతృప్తి కలగలేదని వైసీపీ సీనియర్నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి సత్తిబాబు పది ప్రశ్నలు సంధించారు. వ్యవసాయ రుణాలన్నీ మాఫీ అయ్యాయా? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాంకుల నుంచి కొత్తగా రైతులకు అందిన రుణాలెంత? మీ వాగ్దానాల్ని నమ్మి రుణాలు చెల్లించని రైతులు అపరాధ వడ్డీగా ఏకంగా రూ.30000 కోట్లు మేర చెల్లించాల్సిన పరిస్థితి రావడం నిజం కాదా?. డ్వాక్రా రుణాల్లో ఒక్క రూపాయైునా మాఫీ చేశారా?. ఇంటికో ఉద్యోగం లేదా రూ.2000 నిరుద్యోగ భృతి అన్నారు? ఎన్ని ఉద్యోగాలిచ్చారు? ఎవరికైనా నిరుద్యోగ భృతి ఇచ్చారా?. ప్రత్యేక హోదా సంకల్పం ఏమైంది? హోదాను విభజన చట్టంలో పెట్టలేదంటూ సాకులు వెతుకుతున్నారు. మరి మీ మేనిఫెస్టోలో పెట్టిన వందల కొద్దీ వాగ్దానాలకు పట్టిన గతి ఏమిటి?. పోలవరం ప్రాజెక్టును అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో పూర్తి చేస్తాం అన్నారు? ఇప్పటికి రెండేళ్లయింది. ఎప్పటికి పూర్తి చేస్తారు? మీరు చెబుతున్న ఏపీ ఆర్థిక వృద్ధి రేటు బోగస్అని కేంద్ర ప్రభుత్వం చెప్పడం నిజం కాదా?. సీబీఐ విచారణ అంటే భయమెందుకు? రాజధాని భూములు, అమరేశ్వరుడి భూములు, పట్టిసీమ, పారిశ్రామిక రాయితీలు, భూ కేటాయింపులు తదితర అంశాల్లో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు వైసీపీ డిమాండ్చేస్తుంటే ఎందుకు భయపడుతున్నారు? మీ తనయుడు లోకేశ్అవినీతి, పర్సంటేజీలపై విచారణకు సిద్ధపడతారా?. శాసనసభా గౌరవాన్ని దిగజార్చడం నిజం కాదా? పార్టీ కండువా మార్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. వారిని డిస్క్వాలిఫై చేయకుండా.. విప్జారీకి అవకాశం ప్రతిపక్షాలకు ఇవ్వకుండా.. ద్రవ్య వినిమయ బిల్లుపై ఓటింగ్రాజ్యాంగబద్ధమని తెలిసీ దానిని కాదనడం ద్వారా శాసనసభా గౌరవాన్ని దిగజార్చలేదా?. తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలులో రేవంత కోట్లు ఇస్తూ దొరికిపోయినప్పుడు ఆడియోలో వాయిస్మీది కాదా? దొరికిపోయిన మిమ్మల్ని ముఖ్యమంత్రిగా భరించాల్సిన పరిస్థితి తెలుగు ప్రజలకు శిక్ష కాదా? మీరు దొరికి ఏడాదైనా కేసీఆర్ప్రభుత్వం చార్జిషీట్దాఖలు చేయలేదంటే.. రాష్ట్ర ప్రయోజనాలతోపాటు, కృష్ణా, గోదావరి జలాలనూ తెలంగాణ సర్కారుకు తాకట్టు పెట్టారా.. లేదా? అంటూ ప్రశ్నలు సంధించారు.

Wednesday, 8 June 2016

‘అ,ఆ’లకు కొత్త అర్థం చెప్పిన సీఎం చంద్రబాబు

‘అ,ఆ’లకు కొత్త అర్థం చెప్పిన సీఎం చంద్రబాబు
08-06-2016 19:13:45

కడప: అ అంటే అమరావతి... ఆ అంటే ఆంధ్రప్రదేశ్‌ గుర్తుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కడపలో చేపట్టిన మహాసంకల్ప కార్యక్రమంలోజిల్లా అభివృద్ధి గురించి చంద్రబాబు మాట్లాడుతూ క అంటే కడప, ప అంటే పట్టిసీమ గుర్తుకువచ్చేలా తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. 13 జిల్లాల సమగ్ర అభివృద్ధి కోసం, పేదరికంపై గెలుపు కోసం మహా సంకల్ప దీక్ష చేస్తున్నామని.. ఈ కార్యక్రమాన్ని కడపలో నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచానికి తలమానికంగా అమరావతిని నిర్మాస్తామని చంద్రబాబు చెప్పారు. నదుల అనుసంధానంతో రాయలసీమ, ఉత్తరాంధ్రలో కరువును తరిమికొడతామని బాబు అన్నారు. కడపలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. పట్టిసీమతో రాయలసీమకు ఎలాంటి నష్టం జరగబోదని, అన్ని హామీలను తప్పకుండా నెరవేరుస్తామని చంద్రబాబు పునరుద్ఘాటించారు.