Thursday, 4 August 2016

ఆర్థిక సంఘం వద్దనలేదు!

ఆర్థిక సంఘం వద్దనలేదు!
04-08-2016 02:11:47

http://cdn3.andhrajyothy.com/AJNewsImages/2016/Aug/20160804/Hyderabad/636058735078960649.jpg
·         చైర్మనే నాకు చెప్పారు..
·         సభ్యుడూ అవునన్నారు
·         హోదా ఇవ్వొద్దనేది  సర్కారు నిర్ణయమే
·         జైట్లీ పక్కదోవ పట్టించారు: జైరామ్
·         సభలో కొనసాగిన వైసీపీ ఆందోళన
·         చీపుర్లు పట్టిన కాంగ్రెస్కార్యకర్తలు
·         కేంద్ర మంత్రుల ఇళ్ల ముందు నిరసన
న్యూఢిల్లీ, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు 14 ఆర్థిక సంఘం ఒప్పుకోవడం లేదన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ వాదనపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్సీనియర్నేత జైరామ్రమేశ్మండిపడ్డారు. హోదా ఇవ్వవద్దని ఆర్థిక సంఘం ఎక్కడా చెప్పలేదని, సంఘం అధ్యక్షుడు వైవీ రెడ్డే విషయం తనకు చెప్పారని ఆయన వెల్లడించారు. ప్రత్యేక హోదాను రద్దు చేయాలని సంఘం ఎక్కడా సిఫారసు చేయలేదని తేల్చిచెప్పారు. దీనిపై సంఘం సభ్యుడు అభిజిత్సేన్ను తాను సంప్రదించగా, ఆయన సైతం స్పష్టమైన వివరణ ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ఎంపీ కేవీపీ రామచంద్రరావు నివాసంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రాజ్యాంగం అడ్డువస్తోందని జైట్లీ చెప్పడాన్ని పచ్చి అబద్ధంగా అభివర్ణించారు.

అది తప్పుడు ప్రకటన అని, ఆయన పార్లమెంటును, దేశ ప్రజలను.. ముఖ్యంగా ఆంధ్రులను పక్కదోవ పట్టించారని మండిపడ్డారు. ఆర్థిక సంఘం సిఫారసులను, అభిజిత్సేన్పంపిన ఈమెయిల్వివరణను ఆయన మీడియాకు విడుదల చేశారు. ఇదే అంశంపై తాను ఆర్థిక సంఘం అధ్యక్షుడు వైవీ రెడ్డితో కూడా మాట్లాడానని, ఆయన కూడా ప్రత్యేక హోదా ఇవ్వొద్దని తాము సిఫారసు చేయలేదని స్పష్టంచేశారన్నారు. పన్నుల పంపకాలు, రాషా్ట్రల వాటాలకు సంబంధించి మాత్రమే ఆర్థిక సంఘం సిఫారసులు చేసిందని చెప్పారు. ‘‘సంఘం సిఫారసుల్లో రెండు భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో కేంద్ర పన్నుల్లో రాషా్ట్రలకు ఎంత వాటా ఇవ్వాలి? అనేది ఉంటుంది. రెండో భాగంలో ఏయే రాషా్ట్రలకు ఎంతెంత మేరకు నిధులు ఇవ్వాలి? అనేది ఉంటుంది. క్రమంలో ప్రత్యేక హోదా ఉన్న రాషా్ట్రలు, లేని రాషా్ట్రల మధ్య పన్నుల పంపకాల్లో భేదం చూపొద్దని మాత్రమే ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది’’ అని జైరామ్వివరించారు.

సిఫారసులు అందే నాటికి దేశంలో 11 రాషా్ట్రలు ప్రత్యేక హోదాను అనుభవిస్తున్నాయని, అందులో 6 రాషా్ట్రల్లో కాంగ్రెస్ప్రభుత్వాలు ఉన్నాయని పేర్కొన్నారు. నేపథ్యంలోనే ప్రత్యేక హోదా ఉన్న రాషా్ట్రలకు పన్ను వాటాల కేటాయింపుల్లో భేదం చూపొద్దన్న సిఫారసును ప్రధాని మోదీ ఆమోదించారని ఆరోపించారు. అలాగే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దన్న నిర్ణయం తీసుకున్నది కూడా మోదీ ప్రభుత్వమేనన్నారు. దీనిని ఆర్థిక సంఘంతో ముడిపెట్టడం సరికాదని తేల్చిచెప్పారు. తిరుపతిలో ఐఐటీ, తాడేపల్లిగూడెంలో ఎన్ఐటీల ఏర్పాటుకు సంబంధించిన చట్టం చేయటానికి కేంద్రానికి రెండేళ్లు పట్టిందని ఆయన ఎద్దేవా చేశారు.

టీడీపీ.. తెలుగు డ్రామా పార్టీ
ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం పార్టీ పోరాటాలు చేయటం నాటకాలు ఆడటమేనని రమేశ్ఆరోపించారు. టీడీపీ అంటే.. తెలుగు డ్రామా పార్టీ అని ఆయన అభివర్ణించారు. బీజేపీయే కనుక ఏపీ పట్ల చిత్తశుద్ధితో ఉంటే తక్షణం ప్రత్యేక హోదాను అమలు చేయవచ్చునని చెప్పారు. ఇందుకు ఎలాంటి సాంకేతిక అడ్డంకులూ లేవన్నారు. రాజ్యసభలో జైట్లీ ప్రసంగించిన రోజున తన మామగారు చనిపోయారని, దీంతో తాను హఠాత్తుగా చెన్నై వెళ్లాల్సి వచ్చిందని ఆయన వివరించారు. విషయం తెలుసుకోకుండా తెలుగుదేశం పార్టీ ఎంపీలు తనను విమర్శించడం సరికాదన్నారు.

ఇదీ అభిజిత్ మెయిల్‌!
‘‘ప్రత్యేక కేటగిరీ హోదాను రద్దు చేయాలని 14 ఆర్థిక సంఘం సిఫారసు చేయలేదు. కేంద్ర పన్నుల్లో వాటాలు పంచేటప్పుడు ప్రత్యేక హోదా ఉన్న రాషా్ట్రలు, ప్రత్యేక హోదా లేని రాషా్ట్రల మధ్య భేదం చూపే సంప్రదాయాన్ని కొనసాగించరాదని మాత్రమే సంఘం నిర్ణయించింది. ప్రణాళిక, ప్రణాళికేతర గ్రాంట్ల విషయంలో వేర్వేరు కేటాయింపులు కొనసాగించేందుకు కేంద్రానికి పూర్తి స్వేచ్ఛ ఉంది’’
-
జైరామ్రమేశ్కు పంపిన మెయిల్లో ఆర్థిక సంఘం సభ్యుడు అభిజిత్సేన్‌ 


No comments:

Post a Comment