Thursday, 3 November 2016

టమాట... ఇక పండగే!

టమాట... ఇక పండగే!
04-11-2016 02:19:39

ధరల పతనంపై భయమక్కర్లేదు..
రైతులను ఆదుకోనున్న ప్రభుత్వం
టమాట పల్ప్‌ తయారీలో శిక్షణ..
పరిశ్రమ ఏర్పాటుకు క్రెడిట్‌ గ్యారెంటీ
అన్ని రైతుబజార్లలో ఉప ఉత్పత్తుల అమ్మకాలు
రుణం ఇవ్వటానికి ముందుకొచ్చిన ‘ఆంధ్రప్రగతి’
అనంతపురంలో ప్రయోగాత్మకంగా అమలు
అమరావతి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): మార్కెటింగ్‌ మాయాజాలం... నిలకడ లేని ధరలు... నిల్వ చేసుకోడానికి సదుపాయాల కొరత... టమాటా రైతులను వెక్కిరిస్తుంటాయి! రాష్ట్రంలో, ముఖ్యంగా రాయలసీమలో భారీగా సాగు చేస్తున్నా... కనీస మద్దతు ధర కూడా దక్కక రోడ్లపై గుట్టలుగుట్టలుగా పొరపోస్తున్న ఉదంతాలు ఏటా సర్వసాధారణమై పో యాయి. కానీ, ఆ పరిస్థితి మారనుంది! టమాట సాగు ఇక ఏ మాత్రమూ దండక కాదని, రై తులకు పండగ తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ దిశగా మార్కెటింగ్‌ శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఉద్యానశాఖ సహకారంతో టమాట పండించే సన్నకారు, కౌలు రైతులను సంఘాలుగా ఏర్పాటు చేసి వారికి టమాటా పల్ప్‌(గుజ్జు) తయారీలో శిక్షణ ఇవ్వటానికి సన్నాహాలు చేస్తోంది. అంతేకాదూ వారికి బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించి చిన్న పరిశ్రమ లు ఏర్పాటు చేసుకునేందుకు కృషి చేస్తుంది. పరిశ్రమ ద్వారా వచ్చిన ఉత్పత్తులను అన్ని రైతుబజార్లలో అమ్మడంతోపాటు జాతీయస్థాయిలో వాటిని మార్కెటింగ్‌ చేయనుంది.

అనంతపురంతోనే ఆరంభం
దేశంలో ఉత్పత్తి అవుతున్న టమాటలో 35 శాతం తెలుగు రాషా్ట్రల నుంచే వస్తున్నాయి. రెండు రాషా్ట్రల్లోనూ కలిపి మూడు లక్షల హెక్టార్లలో రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారు. హెక్టార్‌కు 30 టన్నుల చొప్పున దాదాపు ఏడాదికి 90 లక్షల టన్నులు ఉత్పత్తిచేస్తున్నారు. అ యితే, వ్యాపారులు, మధ్యవర్తులు లాభపడుతుండగా ఆరుగాలం కష్టపడిన రైతన్న మాత్రం నష్టాలను చవిచూస్తూనే ఉన్నాడు. టమాటను దీర్ఘకాలంపాటు నిల్వ చేసే సౌకర్యం లేకపోవటం వల్ల రైతులు త మ ఉత్పత్తులను నామమాత్రపు ధరకు తెగనమ్ముకుంటున్నారు. లేకపోతే... వృథాగా వదిలేస్తున్నారు. కానీ, టమా ట ధర తక్కువ ఉన్నప్పుడు వాటిని ధీర్ఘకాలం నిల్వ ఉండేలా ప్రాసెసింగ్‌ చేస్తే రైతుకు మం చి గిట్టుబాటు ధర వస్తుంది. టమాట నుంచి ఉప ఉత్పత్తులైన పల్ప్‌, కెచప్‌, సాస్‌లాంటి వా టిని తయారుచేయవచ్చు. వీటిని ఆరునెలల నుంచి ఏడాది వరకూ నిల్వ చేసుకోవచ్చు. అనేక ఆహార ఉత్పత్తుల తయారీలో వాడుతున్న టమాట ఉత్పత్తులకు మార్కెట్‌లో చాలా డి మాండ్‌ ఉంది. ఈ దృష్ట్యా... టమాట ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయటం వల్ల రైతులకు ఆదాయాన్ని పెంచడంతో పాటు యువతకు ఉపాధి కూడా కల్పించవచ్చు. ప్రభుత్వం ఈ కోణంలోనే ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా తొలుత అనంతపురంలో ప్రయోగాత్మకంగా చిన్న యూనిట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. టమాట పల్ప్‌ ఇండసీ్ట్రని చిన్న పరిశ్రమగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ పరిశ్రమ ఏర్పాటుకు కావాల్సిన క్రెడిట్‌ గ్యారెంటీ రైతుబజార్‌ అందిస్తుంది. సహకార సంఘాలుగా ఏర్పడ్డ రైతులకు రుణాలు అందించటానికి అనంతపురంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ముందుకొచ్చినట్లు తెలిసింది. తయారైన ఉత్పత్తులను 80 రైతుబజార్లలో పెట్టి అమ్మకాలు చేయడంతోపాటు దేశవ్యాప్తంగా ఈ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ శాఖ డిమాండ్‌ కల్పిస్తుంది.

అరుదైన కూరగాయలకు జీఐ గుర్తింపు!
రాష్ట్రంలోని ఒక ప్రాంతానికి పరిమితమై పెరిగే కూరగాయలను గుర్తించి వాటిని జియోగ్రాఫికల్‌ ఐడెంటిఫికేషన్‌(జీఐ)కు పంపించాలని మార్కెటింగ్‌ శాఖ కసరత్తు చేస్తోంది. ‘రాష్ట్రంలో విశాఖలో వేలంగి వంకాయలు బాగా ఫేమస్‌. అనంతపురంలో ముళ్ల వంకాయల కు మంచి ప్రాచుర్యం ఉంది. అలాగే గుంటూరులో మాత్రమే పండే నక్షత్రపు కాకరకాయలు, కృష్ణా జిల్లాలో పండే బుంగ మిర్చి... ఇలాంటి కూరగాయలు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యాయి. రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన కూరగాయలను గుర్తించి భౌగోళిక గుర్తింపునకు పంపిస్తాం. జీఐకు పంపించటంవల్ల ఆ కూరగాయలకు రాష్ట్రంలోనే కాకుండా అంతర్జాతీయంగా డిమాండ్‌ వస్తుంది. దీనివల్ల ఆ కూరలు పండించే రైతులకు గిట్టుబాటుధర లభిస్తుంది. త్వరలోనే ఈ కూరగాయలను జీఐకి పంపించటానికి కార్యాచరణ రూపొందిస్తున్నాం’’ అని రైతుబజార్‌ సీఈవో వి.భాస్కర రమణమూర్తి చెప్పారు.

No comments:

Post a Comment