Friday, 11 November 2016

Jagan has Rs 10K Crore black money: Devineni

Jagan has Rs 10K Crore black money: Devineni
October 10, 2016 Andhra Pradesh 2 Comments

Jagan-Mohan-Reddy-gets-bail-may-move-out-of-jail-tomorrow
Andhra Pradesh Irrigation Minister Devineni Uma Maheshwar Rao today accused YCP Chief and Opposition Leader YS Jaganmohan Reddy of having major share of black money announced nation-wide recently.



Addressing the media here today, the minister alleged that Jagan has a share of Rs 10,000 crore black money in the total  amount of about Rs 65,000 crore disclosed to the Union government. He also said Jaganmohan Reddy made the black money into white by using the legal loopholes. The government can take up many developmental works using Jagan’s black money, he said, adding Jagan earned illegally thousands of acres of land and mines using benami names.

The minister disclosed that the YCP chief illegally got Rs 33,935 crore worth 94,038 acres of land and 1.81 lakh acres of mines. He asked Jagan to stop misinformation campaigning over Pulivendula water project and the State government. “Soon YSRCP role in Tuni incident will see the light and serious action will be taken against those involved”, he warned. He also flayed that the Jagan’s media was resorting to mud-slinging at Nara Lokesh, who knows about giving respect to elders. (NSS)





Rs 650 crore black money declared in Agra region

Deepak Lavania | TNN | Updated: Oct 3, 2016, 07.44 AM IST

(Representative image)
(Representative image)
AGRA: As Union finance minister Arun Jaitley announced on Saturday that the Central Board of Direct Taxes had under the Income Declaration Scheme (IDS), 2016, received a total disclosure of at least Rs 65,250 crore across the country, undisclosed income and assets worth Rs 650 crore were declared in Agra region during the four-month compliance window.

Buy exclusive long-term 2-wheeler insurance!
ICICI Lombard

Holidays with benefits that last a lifetime
Sterling Holidays
Recommended By Colombia
According to a senior officer of the income tax department in the district, the figure of Rs 650 crore could go up once all the declaration filed online and manually are complied. A large number of registrations took place in the last two days of the scheme. Of the total money declared, 45 per cent of it would be accrued to the department as tax and penalty. The people who have declared their black money have the facility to pay up in installments. Their identity will not be disclosed and they will be immune to any sort of legal action.
Anuradha Mishra, principal income tax commissioner of Agra region monitored the scheme. Special arrangements were made on the first floor of the regional office at Sanjay Place for registration for the scheme.
Latest Comment

More in the hiding
Saranathan Lakshminarasimhan
SEE ALL COMMENTSADD COMMENT
After relaxation of the norms related to compulsory submission of PAN card details and amendments in determination of value of old properties, there was a positive response towards the scheme. According to income tax officials, maximum number of businessmen turned up on Thursday and Friday. Suitable assistance and guidance was provided to them. Many also did online registration with help of charter accountants.
After the end of IDS scheme, the income tax department is planning to initiate action against those who have not disclosed illegitimate income under the scheme. The investigation wing of I-T department would conduct raids based to unearth black money. Meanwhile, I-T sleuths are examining the tax returns of city businessmen.
According to I-T officials, raids would focus on businessmen dealing in jewellery, running educational institutions and private hospitals, builders, shoe exporters and hotel owners.
Stay updated on the go with Times of India News App. Click here to download it for your device.

Real reason why Modi govt has carried out surgical strike on your pockets

Real reason why Modi govt has carried out surgical strike on your pockets

By Farhan Rahman - November 11, 20164


The media is hailing Modi’s demonetization of old Rs 500 and Rs 1000 note as a masterstroke policy on curbing the menace of black money.

Really?? Hmmmm.

Let’s have a look into few figures;

What if I told you that total Bad Loans of Indian Banks right now is close to Rs. 6,00,000 crore. What if I told you that PSU Banks are in a miserable condition right now, and need immediate infusion of money to shore up their lending capacities.

black money

What if I also told you that few weeks ago, credit rating agency Moody’s had stated that Indian banks required Rs. 1.25 lakh crore capital infusion? What if I told you that in July 2016 the Centre injected 23,000 crore into 13 public sector banks. What if I told you that Finance Minister Arun Jaitley said it in 2015 that the Centre would pump in more than 70,000 crore in PSU banks in coming four years.

And..What if I told you that this demonetisation is nothing but a measure to infuse money in those ailing banks so as to shore up their lending capacities?

Can’t you see people queuing up banks to deposit their hard earned money, waiting hours for their turn?

What other “Masterstroke” would have made this possible?



Just trigger the panic button by stating that your old Rs 500 and Rs 1000 currency is no longer a valid legal tender, and Voila!!! People are queuing up since morning to deposit their hard earned money.

What for? To curb the menace of black money? By bringing in new Rs. 2000 note?

You don’t curb black money by bringing in notes of higher denomination. In fact, you are now simplifying hoarding of black money by bringing in new notes of higher denomination.

Ok. So what would banks do with the fresh infusion of money from public pockets? Lend of course. That’s what their business is. And to whom would these banks then lend their money to?

You? Me?

Indeed, very sweet of you.

You are in the deposit queue dear.

Those in withdrawal queues are these privileged or shall I say chosen ones: (Note: the figures in bracket are their present repayable amount which they owe to various banks)

10. GVK Reddy (GVK Group) (33933 Crores)
9. Venugopal Dhoot (Videocon Group) (45405 Crores)
8. L. Madhusoodan Rao (Lanco Group) (47102 Crores)
7. G M Rao (GMR Group) (47976 Crores)
6. Sajjan Jindal (JSW Group) (58171 Crores)
5. Manoj Gour (Jaypee Group) (75163 Crores)
4. Goutam Adani (Adani Group) (96031 Crores)
3. Shashi Ruia & Ravi Ruia (Essar Group) (1,01000 Crores or Rs 1.01 trillion)
2. Anil Aggarwal (The Vedanta Group) (1,03000 Crores or 1.03 trillion)

And finally
1. Anil Ambani (Reliance Group)(125000 Crores or Rs 1.25 trillion)

The government just carried out a surgical strike on your pockets, and now you are running like chickens. That’s how crony capitalism works.

Now call me whatever you like- Marxist, Communist, Anarchist, Congi agent, conspiracy theorist blah blah blah.

(The views expressed here are solely the author’s own. The facts and opinions appearing in the article do not reflect the views of Janta Ka Reporter and Janta Ka Reporter does not assume any responsibility or liability for the same)


పెద్ద నోట్ల రద్దుతో ఎవరికి మేలు?

పెద్ద నోట్ల రద్దుతో ఎవరికి మేలు?
11-11-2016 00:46:18


ప్రభుత్వం తొలుత పన్నురేట్లను తగ్గించి, ప్రభుత్వ యంత్రాంగంలో కిందిస్థాయిలోని అవినీతిని నియంత్రించి పెద్ద విలువ గల కరెన్సీ నోట్లను రద్దు చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఎంతైనా వున్నది. అదే సమయంలో ప్రభుత్వ వ్యయాలు ఉత్పాదక కార్యకలాపాలకు అయ్యేలా చూడవల్సివున్నది. సానుకూల చర్యలు లేని పక్షంలో పెద్దనోట్ల రద్దు వరం కాకపోగా శాపంగా పరిణమిస్తుంది.

ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేయడంలో మోదీ ప్రభుత్వం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నది. పాకిస్థాన్‌లోని ఫ్యాక్టరీలు నకీలీ భారతీయ కరెన్సీ నోట్లను ముద్రించి, మన దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న మిలిటెంట్‌ గ్రూపులకు సరఫరా చేస్తున్నాయి. రాజకీయపార్టీలు భారీమొత్తంలో ఈ కరెన్సీ నోట్లను రహస్యంగా నిల్వచేసుకున్నాయి. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు తమ లావాదేవీలను నల్ల ధనంతోనే కదా నిర్వహించేది!

                  మోదీ ప్రభుత్వ నిర్ణయం సామాన్య మానవునికి గొప్ప ఊరటనిచ్చిందనడంలో సందేహం లేదు. రియల్‌ఎస్టేట్‌, బంగారు ఆభరణాల రంగాల వారు ఆదాయపు పన్ను చెల్లింపును ఎగవేస్తుండగా సామాన్య ఉద్యోగి నెలసరి వేతనం నుంచి ఆదాయపు పన్నును విధిగా మినహాయిస్తున్నారు. పెద్ద కరెన్సీ నోట్ల ఉపసంహరణ వల్ల సామాన్యులు తమ రోజువారీ అవసరాలకు జరపాల్సిన చెల్లింపుల విషయంలో తప్పక కొన్ని ఇబ్బందులకు గురవుతారు. అయితే ఇవి తాత్కాలికమే.
పెద్ద నోట్ల రద్దు వల్ల, నల్లధనం ఉత్పత్తికి దారితీస్తున్న వ్యవస్థ మాత్రం చెక్కు చెదరబోదు. ఆదాయపు పన్నురేట్లు అధిక స్థాయిలో ఉండడమూ, పన్నుల వసూలు యంత్రాంగంలో అవినీతి మూలంగానే నల్లధనం సృష్టి అవుతోంది. ఒక పారిశ్రామికవేత్త నెలకు కోటిరూపాయల విలువైన ఎయిర్‌ కూలర్లను ఉత్పత్తి చేస్తాడు. వీటిపై అతను ఎక్సైజ్‌ సుంకం, అమ్మకపుపన్ను, ఆదాయపు పన్ను చెల్లించవలసి ఉంటుంది. నెలా నెలా వాటి విక్రయాలపై రూ.35లక్షల మేరకు పన్నులు చెల్లించవలసివుంటుంది.

                  అయితే అవినీతిపరులైన ఆదాయపు పన్ను శాఖ అధికారులకు రెండులక్షల రూపాయలు లంచంగా ఇవ్వడం ద్వారా పన్ను చెల్లింపును ఎగవేస్తాడు. దీని వల్ల అతనికి రూ.33లక్షలు ఆదా అవుతాయి. ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌, పారిశ్రామికవేత్త తమ అక్రమార్జనను కాపాడుకోవడానికి వేరే చోట మదుపు చేయవలసివుంటుంది. ఇందుకు వారు పెద్దఎత్తున బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఆ ఆభరణాల తయారీకి అవసరమైన బంగారాన్ని దిగుమతి చేసుకోవలసివున్నందున ఆ సొమ్ము విదేశాలకు తరలిపోతుంది. అదనపు ఆర్జనకు అవకాశమున్న పోస్టులలో నియమితులు కావడానికి సహాయపడడం ద్వారా రాజకీయవేత్తలు కూడా అధికారుల నుంచి పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేసుకుంటారు. ఇలా అవినీతికి పాల్పడిన అధికారులు ఫ్యాక్టరీ యజమానుల నుంచి లంచాలు తీసుకుని, వారు పన్ను చెల్లింపును ఎగవేయడానికి తోడ్పడుతారు.

                  పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్ల రద్దు ఈ అవినీతికర వ్యవస్థను నిర్మూలించదు. కనుక ప్రస్తుతం రాజకీయవేత్తలు, రియల్‌ఎస్టేట్‌ యజమానులు, బంగారు ఆభరణాల వర్తకులు మొదలైన వారి వద్ద భారీ మొత్తాల్లో నిల్వవున్న సొమ్ముకు కొంత నష్టం జరిగినప్పటికీ, ఆ వ్యవస్థ యథావిధిగా నల్ల ధనాన్ని కొంచెం తక్కువ స్థాయిలో ఉత్పత్తి చేస్తుంది. పాకిస్థాన్‌లో నకీలీనోట్లను ఉత్పత్తిచేస్తున్న ఫ్యాక్టరీలు కొత్తనోట్ల ఉత్పత్తికి తమ సాంకేతికతలను నవీకరించుకుంటాయి.
పెద్దవిలువ కలిగిన కరెన్సీనోట్ల రద్దు వల్ల ప్రయోజనాలు మరో కారణం వల్ల తకూడా పరిమితంగా వుంటాయి. ఆ చర్య నల్లధనాన్ని తగ్గిస్తుంది. ఇందులో సందేహం లేదు. ఫ్యాక్టరీలు మరిన్ని పన్నులు చెల్లిస్తాయి. అయితే సరుకులను విక్రయానికి పెట్టవు. ప్రభుత్వం వసూలు చేసుకునే పన్నులు తక్కువేమీ కావు. దీంతో ఎయిర్‌ కూలర్ల తయారీదారు తన ఉత్పత్తులను మరింత అధిక ధరకు విక్రయించుకోవలసి ఉంటుంది. ఎందుకంటే అతను పన్నులను పూర్తిగా చెల్లించవలసి వుంటుంది. వినియోగదారులు మరింత అధిక పన్నును చెల్లించవలసివుంటుంది. తత్కారణంగా ఎయిర్‌కూలర్‌కు బదులు టేబుల్‌ ఫ్యాన్‌ను కొనుగోలు చేసుకోవడానికి అతను ఇష్టపడతాడు. దీనివల్ల ఎయిర్‌కూలర్లకు డిమాండ్‌ తగ్గిపోతుంది ఇది ప్రత్యక్ష ప్రభావం మాత్రమే. పెద్ద నోట్ల రద్దు అంతిమ ప్రభావమనేది ప్రభుత్వ వ్యయాల స్వభావం, తీరుతెన్నులపై ఆధారపడివుంటుంది. పెరిగిన ఆదాయంతో ప్రభుత్వం హైవేలను నిర్మించవచ్చు లేదా ఉపాధి హామీ పథకం కింద చెల్లించే వేతనాలను పెంచవచ్చు లేదా దేశంలోనే అత్యాధునిక ఆయుధాల తయారీకి పూనుకోవచ్చు. హైవేల వల్ల రవాణా ఖర్చులు తగ్గుతాయి. వస్తూత్పత్తిదారుల వ్యాపారం అభివృద్ధిచెందుతుంది. ఉపాధి హామీ పథకం కింద వేతనాలు పెరగడం వల్ల సామాన్యుల కొనుగోలు శక్తి మరింతగా పెరుగుతుంది. దీనివల్ల అతను టేబిల్‌ ఫ్యాన్‌కు బదులు ఎయిర్‌కూలర్‌ను కొనుగోలు చేసుకోగలుగుతాడు.

                  దేశంలో అత్యాధునిక ఆయుధాలను ఉత్పత్తి చేయడం వల్ల నిపుణ కార్మికులకు, ఆధునిక పరికరాలకు డిమాండ్‌ పెరుగుతుంది దీని వల్ల సగటు పౌరుల ఆదాయం మరింతగా పెరుగుతుంది. అలా కాకుండా ప్రభుత్వం పెరిగిన ఆదాయాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులలో మదుపు చేయవచ్చు లేదా ప్రభుత్వ సిబ్బందికి అధిక వేతనాలు చెల్లించడానికి ఉపయోగించవచ్చు. ఈ పెరిగిన ఆదాయంతో ప్రభుత్వోద్యోగులు బంగా రాన్ని మరింతగా కొనుగోలు చేసుకుంటారు. ప్రభుత్వమే అత్యాధునిక ఆయుధాలను దిగుమతి చేసుకోవడానికి ఆ ఆదాయాన్ని ఉపయోగించుకోవచ్చు. వీటిలో ఏది చేసినా నష్టపోయేది దేశ ఆర్థిక వ్యవస్థననడంలో సందేహం లేదు.
                  సంకేతాలు అనుకూలంగా లేవు. అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థలు- స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌, ఫిట్చ్‌- భారతకు మంచి రేటింగ్‌ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులు స్థిరంగా లేకపోవడమే ఇందుకు కారణం. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకుల బలహీన పరిస్థితిని అవి ఎత్తిచూపుతున్నాయి. దీన్ని బట్టి ప్రభుత్వ వ్యయాల నాణ్యత బాగా లేదని స్పష్టమవుతోంది. దీని పర్యవసానమేమిటంటే నల్లధనం తగ్గుదల సామాన్య పౌరుల కొనుగోలు శక్తిని కూడా తగ్గిస్తుంది. ఆయుధాల దిగుమతికి మరింత ధనం విదేశాలకు తరలిపోవడానికి ఇది దారితీస్తుంది. ఆర్థిక వ్యవస్థ బాగా నష్టపోతుంది.
                  ప్రభుత్వం తొలుత పన్నురేట్లను తగ్గించి, ప్రభుత్వ యంత్రాంగంలో కింది స్థాయిలోని అవినీతిని నియంత్రించి పెద్ద విలువగల కరెన్సీనోట్లను రద్దు చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఎంతైనా వున్నది. వినియోగదారులపై పన్ను భారం తగ్గడానికి ఇది దోహదం చేస్తుంది. అదే సమ యంలో ప్రభుత్వ వ్యయాలు ఉత్పాదక కార్యకలాపాలకు అయ్యేలా చూడవల్సివున్నది. అంటే హైవేల నిర్మాణం, ఆయుధాల తయారీకి మున్నగు వాటికి ఖర్చు పెట్టాలి. ఇటువంటి సానుకూల చర్యలు లేని పక్షంలో పెద్దనోట్ల రద్దు వరం కాకపోగా శాపంగా పరిణమిస్తుంది.
  భరత్ ఝన్‌ఝన్‌వాలా
(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగళూరు ఐఐఎం రిటైర్డ్‌ ప్రొఫెసర్‌)

విశాఖ సదస్సుకు తేదీల ఖరారు

విశాఖ సదస్సుకు తేదీల ఖరారు
11-11-2016 01:32:12

న్యూఢిల్లీ, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర వరుసగా రెండో ఏడాది సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది. ప్రపంచ ఆర్థికాభివృద్ధికి భారతదేశాన్ని ఇంజన్‌గా ముందు పెట్టేందుకు, ప్రపంచ వ్యూహంతో భారతను అనుసంధానించేందుకు అవసరమైన కార్యాచరణను రచించేందుకు, ప్రపంచ శక్తిగా అవతరిస్తున్న దేశ గొప్పదనాన్ని చాటేందుకు ఈ సదస్సు వేదిక అవుతుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జనవరి 27, 28 తేదీల్లో విశాఖపట్నంలో ఈ సదస్సు జరుగనుంది. అంతర్జాతీయ, భారత పారిశ్రామిక కంపెనీలు అన్నీ ఈ కార్యక్రమంలో పాల్గొంటాయని, చరిత్రాత్మక వ్యూహాలను రచిస్తాయని ఆమె వివరించారు. ఏపీ సీఎం చంద్రబాబు, సీఐఐ ఉపాధ్యక్షుడు రాకేశ్ భారతి మిట్టల్‌ల సమక్షంలో ఉద్యోగ్‌ భవన్‌లోని తన కార్యాలయంలో గురువారం ఆమె ఈ ప్రకటన చేశారు. గతేడాది కూడా ఈ సదస్సుకు విశాఖపట్నమే ఆతిథ్యం ఇచ్చిందని, తర్వాతి సంవత్సర సదస్సును కూడా ఇక్కడే నిర్వహిస్తామని అప్పుడు చంద్రబాబు చెప్పారని, దీనికి తాను అంగీకరించానని తెలిపారు. చంద్రబాబు మాట్లాడుతూ.. గతేడాది సదస్సులో రూ.4,67,577 కోట్ల పెట్టుబడులు, 9,58,896 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా 328 అవగాహన ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. ఇందులో 93 పరిశ్రమల్ని స్థాపించామని, మరో 41 పరిశ్రమలకు భూములు కేటాయించామని, వాటి ఏర్పాటు జరుగుతోందని తెలిపారు. 1.60 లక్షల మందికి ఉపాధి లభించిందన్నారు. మొత్తంగా ఎంవోయూల్లో ఇప్పటికి 41 శాతం అమలు చేశామని, మరో రెండు నెలల సమయం ఉన్నందున 55-60 శాతం అమలు చేసి రికార్డు నెలకొల్పుతామన్నారు. రాష్ట్రంలో ఏయే ప్రాంతంలో ఏయే పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయో, క్షేత్రస్థాయిలో నిర్మాణం పురోగతి ఎలా ఉందో విశాఖపట్నం నుంచే అంతా వీక్షించేలా ఆనలైన వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పెట్టుబడులు పెట్టిన వారంతా భాగస్వామ్య సదస్సులో కూర్చుని.. తమ తమ ప్రాజెక్టుల పురోగతిని ప్రత్యక్షంగా చూడొచ్చన్నారు. విశాఖ సదస్సుకు దేశాధినేతల్ని, మంత్రుల్ని తీసుకురావాలని నిర్మలా సీతారామన్‌ను బాబు కోరారు. గణతంత్ర దినోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యే విదేశీ ముఖ్యుడిని ఏపీలో జరిగే సదస్సుకు రప్పించాలన్నారు. 2 నెలల సమయం ఉన్నందున ఈ దిశగా చర్యలు చేపడతామని నిర్మల హామీ ఇచ్చారు. కాగా, సీఐఐ ఇప్పటికి 22సార్లు భాగస్వామ్య సదస్సును నిర్వహించింది. జనవరిలో జరిగేది 23వ సదస్సు. ఇందులో ఐదు చంద్రబాబు హయాంలో జరగడం విశేషం. 2001, 2003, 2004ల్లో చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో భాగస్వామ్య సదస్సు జరిగింది. గతేడాది విశాఖలో జరిగింది. వచ్చే ఏడాది వరుసగా అక్కడే జరుగనుంది

Sunday, 6 November 2016

జగన్ కాలుమోప జాగా లేని అమరావతి

జగన్ కాలుమోప జాగా లేని అమరావతి
By jinka nagaraju | 08:48 AM Thursday, 03 November 2016
http://telugu.asianetnews.tv/andhra-pradesh/jagan-finds-no-space-to-set-up-office-in-amaravati
   
Quick Summary
అమరావతి జగన్ దూర లేని కారడవి అయిపోయింది. అక్కడ అఫీసు కట్టుకోవడానికి జాగా దొరకరడం లేదు. అభద్రత కూడా వెంటాడుతూ ఉంది.

మొత్తానికి రాజధాని అమరావతి  ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం అనుకూలంగా లేని ప్రదేశంగా తయారయింది. రాష్ట్రం కాని రాష్ట్రం కర్నాటకలో బ్రహ్మాండమయిన ఇల్లు సులభంగా కట్టుకుని వుండవచ్చు.  హైదరాబాద్ లో లోటస్ పాండ్ ని అంతకంటే సలభంగా ఎంపిక చేసుకోని ఉండవచ్చు. అయితే, వరల్డ్ క్లాస్ అమరావతిలో ఆ పప్పు లుడకడం లేదు.

వెలగపూడికి ఆరేడు కిలో మీటర్ల వ్యాసార్థంలో జగన్ కాలుమోపేందుకు వీలులేకుండా ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడి  ప్లాన్ కట్టుదిట్టంగా తయారయింది.   కోర్ క్యాపిటల్ కు దరిదాపుల్లో ఎక్కడా ప్రతిపక్ష నాయకుడు గుడారం వేసే పరిస్థితి  లేదు. అందుకే  దాదాపు 15 కిమీ దూరంలో,ఎక్కడో విసిరేసినట్టుగా మంగళగిరిలో కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు. అక్కడ కూడా  వైఎస్ఆర్ సి కార్యాలయానికి భూమి లీజుకు దొరకడం లేదు. ఫలితంగా సాక్షి భూమిలో స్థిరపడే పరిస్థితి వస్తున్నదని పార్టీ వర్గాలు ’ ఏషియా నెట్’ కు చెప్పాయి.

వెలగపూడికి, అంటే అసెంబ్లీకి, సెక్రటేరియట్ కు అయిదారు కిలో మీటర్లు దూరంలో పార్టీ కార్యాలయం ఉంటే బాగుంటుందని జగన్ భావించారట.  ఎందుకంటే, ఎమర్జీన్సీలో అసెంబ్లీకి వెళ్లడం, లేదా పనుల మీద చకాచకా సెక్రటేకరియట్ కు వెళ్లడం సుళువవుతంది. హైదరాబాద్ లో  గాంధీ భవన్, ఎన్టీ ఆర్ ట్రస్టు భవన్ ,సిపిఐ, సిపిఎం కార్యాలయాలు ఆరేడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి.  టిఆర్ ఆఫీస్ కూడా ఇంతే దూరంలో ఉంటుంది.  ఈ ఉద్దేశంతోనే   కోర్ క్యాపిటల్ కు అయిదారు కిలోమీటర్ల దూరంలో పార్టీ కార్యాలయానికి జాగా వెదకాలనుకున్నారు. ఈ కోర్ క్యాపిటల్ వచ్చేది చచ్చేది లేదనుకుని  స్థల సేకరణ జాప్యం చేశారు. వెలగపూడి తాత్కాలి-శాశ్వత రాజధాని అయి కూర్చోవడం అక్కడే అసెంబ్లీ కూడా రావడంతో ఇపుడు  అర్జంటుగా పార్టీ ఆఫీస్ ను ఏర్పాటుచేయాలనే నిర్ణయానికి వచ్చారు.
ప్రభుత్వ విధానం, అమరావతిలో ఉన్న రాజకీయాలు, భూముల స్థితిగతులు ఏవీ జగన్ కాలుమోపేందుకు అనుకూలంగా లేవు. ఆయన హైదరాబాద్ లోటస్ పాండ్ లాగా విశాలంగా కార్యాలయం కట్టుకోవడం అమరావతిలో కుదరదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్ప నాలుగెకరాల ప్రభుత్వ స్థలం ఆ పార్టీకి  దొరకదు. అంతవరకు మంగళగిరిలో సర్దుకు పోవలసిందే.

మొదట తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు కోసం అన్వేషణ ప్రారంభమయింది. విజయవాడ వద్దనుకున్నారు. గుంటూరు దగ్గిర రెడ్డి పాళెం ను పరిశీలించారు. అనవుగాని చోట భద్రత కూడా ఒక సమస్య అయింది. జగన్ ప్రభుత్వ భద్రత మీద పూర్తిగా ఆదార పడదల్చుకోలేదు. ఆయన కట్టదిట్టమయిన ప్రయివేటు బందోబస్తుతోనే యాత్రలు చేస్తున్నారు. అంతేకాదు, సాధ్యమయినంతవరకు ఎక్కడా రాత్రి బసచేయరు, హైదరాబాద్ కు వచ్చే ప్రయత్నం చేస్తారు. ఒక బస చేయాల్సివచ్చినా, ఒక రహస్య ప్రదేశానికి  వెళతారు.  ఇపుడున్న రాజకీయ వాతావరణంలో అమరావతి ప్రాంతంలో భద్రత  కూడా ఒక సమస్య అయిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  దీనికోసం కూడా ఎక్కడో దూరాన ఉండకుండా, అమరావతి గరిమనాభి అయిన వెలగపూడికి అయిదారు కిలో మీటర్ల దూరంలో పార్టీ హెడ్ క్వార్ట ర్స్ ఉండాలని నిర్ణయించారు.

అయితే, అక్కడెక్కడ కొనేందుకు ప్రయివేటు  భూములే  లేవు. ఉన్నా కొనడం, అమ్మడం మీద నిషేధం ఉంది. ఏదో ఒక విధంగా సేకరించాలనుకుంటే ధరలు విపరీతంగా  ఉన్నాయి.  పార్టీ రెండు మూడెకరాల స్థలం  కావాలనుకుంది. అయితే అక్కడ ఎకరా పది, పదిహేనుకోట్ల కంటే తక్కువగా లభించేట్లుగా లేదట. అందుకే, సెక్రటేరియట్ కు రాయేస్తే పడేంత దూరంలో పార్టీ కార్యాలయం కట్టుకోవడం చంద్రన్నరాజ్యంలో జరిగే పని కాదనే నిర్ణయానికి వచ్చేశారు.  అలాకాదంటే  ప్రభుత్వం కేటాయించే భూమే చాలనుకుంటే అది ’గూడు మిద్దె’ కు కూడా పనికిరాదు. పుట్టిన ప్పటి నుంచి వైభవం వెలగబెట్టిన పార్టీకిపుడు అమరావతి ఎడారయింది.

ఏ పార్టీకి ఎంత భూమి ఇవ్వాలో ఒక ఫార్ములా కూడా ప్రభుత్వం  తయారుచేసింది. దీని ప్రకారం  ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే అమరావతిలో భారీ భవంతి కట్టుకునేంత స్థలం వస్తుంది. 2016 జూలైలో ప్రకటించిన ఈ నూతన విధానం ప్రకారం, వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు అమరావతిలో  అరెకరా,  జిల్లాలలో 1000 చ.అ జాగాయే దొరుకుతుంది. అది కూడా ఎక్కడ ఇస్తారో చెప్పలేం. కాబట్టి  అమరావతిలో కాలుమోపడం జగన్ కు కష్టమే.

 ఈ స్థలాన్ని అసెంబ్లీలో పార్టీలకు ఉన్న సభ్యత్వం  ప్రకారం నిర్ణయించారు. ఈ లెక్క ప్రకారం టిడిపికి నాలుగెకరాలు వస్తాయి. జిల్లాలలో  రెండెకరాలు వస్తాయి.

ప్రభుత్వ విధానం, అమరావతిలో ఉన్న రాజకీయాలు, భూముల స్థితిగతులు ఏవీ జగన్ కాలుమోపేందుకు అనుకూలంగా లేవు. ఆయన హైదరాబాద్ లోటస్ పాండ్ లాగా విశాలంగా కార్యాలయం కట్టుకోవడం అమరావతిలో కుదరదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్ప నాలుగెకరాల ప్రభుత్వం స్థలం ఆ పార్టీకి  దొరకదు. అంతవరకు మంగళగిరిలో సర్దుకు పోవలసిందే.

Thursday, 3 November 2016

టమాట... ఇక పండగే!

టమాట... ఇక పండగే!
04-11-2016 02:19:39

ధరల పతనంపై భయమక్కర్లేదు..
రైతులను ఆదుకోనున్న ప్రభుత్వం
టమాట పల్ప్‌ తయారీలో శిక్షణ..
పరిశ్రమ ఏర్పాటుకు క్రెడిట్‌ గ్యారెంటీ
అన్ని రైతుబజార్లలో ఉప ఉత్పత్తుల అమ్మకాలు
రుణం ఇవ్వటానికి ముందుకొచ్చిన ‘ఆంధ్రప్రగతి’
అనంతపురంలో ప్రయోగాత్మకంగా అమలు
అమరావతి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): మార్కెటింగ్‌ మాయాజాలం... నిలకడ లేని ధరలు... నిల్వ చేసుకోడానికి సదుపాయాల కొరత... టమాటా రైతులను వెక్కిరిస్తుంటాయి! రాష్ట్రంలో, ముఖ్యంగా రాయలసీమలో భారీగా సాగు చేస్తున్నా... కనీస మద్దతు ధర కూడా దక్కక రోడ్లపై గుట్టలుగుట్టలుగా పొరపోస్తున్న ఉదంతాలు ఏటా సర్వసాధారణమై పో యాయి. కానీ, ఆ పరిస్థితి మారనుంది! టమాట సాగు ఇక ఏ మాత్రమూ దండక కాదని, రై తులకు పండగ తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ దిశగా మార్కెటింగ్‌ శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఉద్యానశాఖ సహకారంతో టమాట పండించే సన్నకారు, కౌలు రైతులను సంఘాలుగా ఏర్పాటు చేసి వారికి టమాటా పల్ప్‌(గుజ్జు) తయారీలో శిక్షణ ఇవ్వటానికి సన్నాహాలు చేస్తోంది. అంతేకాదూ వారికి బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించి చిన్న పరిశ్రమ లు ఏర్పాటు చేసుకునేందుకు కృషి చేస్తుంది. పరిశ్రమ ద్వారా వచ్చిన ఉత్పత్తులను అన్ని రైతుబజార్లలో అమ్మడంతోపాటు జాతీయస్థాయిలో వాటిని మార్కెటింగ్‌ చేయనుంది.

అనంతపురంతోనే ఆరంభం
దేశంలో ఉత్పత్తి అవుతున్న టమాటలో 35 శాతం తెలుగు రాషా్ట్రల నుంచే వస్తున్నాయి. రెండు రాషా్ట్రల్లోనూ కలిపి మూడు లక్షల హెక్టార్లలో రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారు. హెక్టార్‌కు 30 టన్నుల చొప్పున దాదాపు ఏడాదికి 90 లక్షల టన్నులు ఉత్పత్తిచేస్తున్నారు. అ యితే, వ్యాపారులు, మధ్యవర్తులు లాభపడుతుండగా ఆరుగాలం కష్టపడిన రైతన్న మాత్రం నష్టాలను చవిచూస్తూనే ఉన్నాడు. టమాటను దీర్ఘకాలంపాటు నిల్వ చేసే సౌకర్యం లేకపోవటం వల్ల రైతులు త మ ఉత్పత్తులను నామమాత్రపు ధరకు తెగనమ్ముకుంటున్నారు. లేకపోతే... వృథాగా వదిలేస్తున్నారు. కానీ, టమా ట ధర తక్కువ ఉన్నప్పుడు వాటిని ధీర్ఘకాలం నిల్వ ఉండేలా ప్రాసెసింగ్‌ చేస్తే రైతుకు మం చి గిట్టుబాటు ధర వస్తుంది. టమాట నుంచి ఉప ఉత్పత్తులైన పల్ప్‌, కెచప్‌, సాస్‌లాంటి వా టిని తయారుచేయవచ్చు. వీటిని ఆరునెలల నుంచి ఏడాది వరకూ నిల్వ చేసుకోవచ్చు. అనేక ఆహార ఉత్పత్తుల తయారీలో వాడుతున్న టమాట ఉత్పత్తులకు మార్కెట్‌లో చాలా డి మాండ్‌ ఉంది. ఈ దృష్ట్యా... టమాట ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయటం వల్ల రైతులకు ఆదాయాన్ని పెంచడంతో పాటు యువతకు ఉపాధి కూడా కల్పించవచ్చు. ప్రభుత్వం ఈ కోణంలోనే ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా తొలుత అనంతపురంలో ప్రయోగాత్మకంగా చిన్న యూనిట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. టమాట పల్ప్‌ ఇండసీ్ట్రని చిన్న పరిశ్రమగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ పరిశ్రమ ఏర్పాటుకు కావాల్సిన క్రెడిట్‌ గ్యారెంటీ రైతుబజార్‌ అందిస్తుంది. సహకార సంఘాలుగా ఏర్పడ్డ రైతులకు రుణాలు అందించటానికి అనంతపురంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ముందుకొచ్చినట్లు తెలిసింది. తయారైన ఉత్పత్తులను 80 రైతుబజార్లలో పెట్టి అమ్మకాలు చేయడంతోపాటు దేశవ్యాప్తంగా ఈ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ శాఖ డిమాండ్‌ కల్పిస్తుంది.

అరుదైన కూరగాయలకు జీఐ గుర్తింపు!
రాష్ట్రంలోని ఒక ప్రాంతానికి పరిమితమై పెరిగే కూరగాయలను గుర్తించి వాటిని జియోగ్రాఫికల్‌ ఐడెంటిఫికేషన్‌(జీఐ)కు పంపించాలని మార్కెటింగ్‌ శాఖ కసరత్తు చేస్తోంది. ‘రాష్ట్రంలో విశాఖలో వేలంగి వంకాయలు బాగా ఫేమస్‌. అనంతపురంలో ముళ్ల వంకాయల కు మంచి ప్రాచుర్యం ఉంది. అలాగే గుంటూరులో మాత్రమే పండే నక్షత్రపు కాకరకాయలు, కృష్ణా జిల్లాలో పండే బుంగ మిర్చి... ఇలాంటి కూరగాయలు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యాయి. రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన కూరగాయలను గుర్తించి భౌగోళిక గుర్తింపునకు పంపిస్తాం. జీఐకు పంపించటంవల్ల ఆ కూరగాయలకు రాష్ట్రంలోనే కాకుండా అంతర్జాతీయంగా డిమాండ్‌ వస్తుంది. దీనివల్ల ఆ కూరలు పండించే రైతులకు గిట్టుబాటుధర లభిస్తుంది. త్వరలోనే ఈ కూరగాయలను జీఐకి పంపించటానికి కార్యాచరణ రూపొందిస్తున్నాం’’ అని రైతుబజార్‌ సీఈవో వి.భాస్కర రమణమూర్తి చెప్పారు.