Saturday 27 December 2014

బియ్యం వాడుకోకపోతే కార్డు రద్దు

బియ్యం వాడుకోకపోతే కార్డు రద్దు

ఆ విషయాన్ని పరిశీలిస్తున్నాం: మంత్రి ఈటెల
కందిపప్పు, చక్కెర, ఉప్పు, గోధుమలూ పంపిణీ
2 నుంచి హాస్టళ్లు, మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం
1 నుంచే ఆహార భద్రతాకార్డులపై సరఫరా
అవగాహన కల్పించి మరీ కొత్త పథకాలు
అంగన్‌వాడీ గుడ్లపై ముద్ర.. అమ్మితే చర్యలు
ఇక రేషన్‌ దుకాణాల రేషనలైజేషన్‌
అవసరమైన చోట కొత్తవి ఏర్పాటు: మంత్రి 

‘‘జనవరి 1 నుంచి బియ్యం కోటా మనిషికి 6 కిలోలకు పెంచుతాం. అయితే, కొందరు రేషన్‌
బియ్యం వాడుకోవడం లేదనే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అలాంటి వారికి బియ్యం
కార్డులు ఉండవు’’ అని మంత్రి ఈటెల రాజేందర్‌ స్పష్టం చేశారు. 1వ తేదీ నుంచే ఆహార
భద్రతా కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు. 

 1 నుంచే ఆహార భద్రతా కార్డులపై సరఫరా
 కందిపప్పు, చక్కెర, ఉప్పు, గోధుమలూ పంపిణీ
 2 నుంచి హాస్టళ్లు, మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం
 అవగాహన కల్పించి మరీ కొత్త పథకాలకు శ్రీకారం
 అంగన్‌వాడీ గుడ్లు దుకాణాల్లో కనిపిస్తే చర్యలు
 ఇక రేషన్‌ దుకాణాల రేషనలైజేషన్‌
 అవసరమైన చోట కొత్తవి ఏర్పాటు: ఈటెల 

హైదరాబాద్‌ / మహబూబ్‌నగర్‌, డిసెంబర్‌ 27 (ఆంధ్రజ్యోతి): జనవరి 1 నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆరు కిలోల చొప్పున బియ్యం అందజేస్తామని, ఆచరణలో చూసిన తర్వాత అవసరమైతే బియ్యం కోటా పెంచుతామని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. బియ్యం వాడుకోని వారుంటే పరిశీలించి, వారి కార్డుల్ని రద్దు చేస్తామని తేల్చిచెప్పారు. బియ్యం పంపిణీలో అక్రమాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరిస్తూనే, అధికారులు ప్రభుత్వ ఆదేశాలను ఉన్నదున్నట్టు అమలు చేయాలని ఆదేశించారు. బియ్యంతో పాటు కందిపప్పు, చక్కెర, ఉప్పు, గోదుమలు కూడా పంపిణీ చేస్తామన్నారు. పామాయిల్‌ను కేంద్రం నిలిపి వేసిందని, తాము కూడా పంపిణీ చేయడం లేదని స్పష్టం చేశారు. ఆహార భద్రత కార్డుల జారీ ప్రక్రియ జనవరి నెలాఖరుకు పూర్తవుతుందని, అయినా నెల ఆరంభం నుంచే బియ్యం పంపిణీ చేస్తామన్నారు. కార్డుల జాబితా ఆధారంగా ప్రక్రియ చేపడతామన్నారు. సర్పంచ్‌ నుంచి మంత్రి వరకు వారి వారి ప్రాంతాల్లో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. సంక్షేమ వసతి గృహాల్లో సన్న బియ్యం అన్నం పెట్టే కార్యక్రమాన్ని జనవరి 2 నుంచి పంపిణీ చేస్తామని ప్రారంభిస్తామని తెలిపారు. హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్యను జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు గుర్తించాలని కోరారు. విద్యార్థులకు సన్నబియ్యం భోజనం అమలుపై మంత్రి ఈటెల రాజేందర్‌ శనివారం విద్యుత్‌ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు ఎస్‌.నిరంజన్‌రెడ్డి, జడ్పీ చైౖర్మన్‌ బండారి భాస్కర్‌, పార్లమెంటరీ కార్యదర్శి వి.శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్‌ జీడీ ప్రియదర్శిని తదితరులతో కలిసి మహబూబ్‌నగర్‌లో సమీక్షించారు. జనవరి 1 నుంచి ఆహారభద్రత కార్డుల ద్వారా బియ్యం అందించే విషయమై హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధివిధానాలు వివరించారు. రేషన్‌ సరుకులను దుకాణాలకు చేర్చడంలో అవకతవకలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఈటెల రాజేందర్‌కు వివరించారు. సరుకుల పంపిణీలో బయోమెట్రిక్‌ విఽధానాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, బియ్యం నాణ్యత బాగుండాలని, సరఫరా విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని మంత్రి ఆదేశించారు. అనంతరం పార్లమెంటరీ కార్యదర్శి వి.శ్రీనివాస్‌గౌడ్‌, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ పార్థసారథి తదితరులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సంక్షేమ పథకాల అమలులో కోతలు లేవని, పింఛన్ల కోసం మరిన్ని నిధులు కేటాయిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం మాదిరి 19 వేల అంగన్‌వాడీ కేంద్రాలకే పరిమితం కాకుండా, తెలంగాణలోని 35వేల కేంద్రాలకు పౌష్ఠికాహారం అందజేస్తామని వివరించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే గుడ్లపై ముద్ర ఉంటుందని, అవి దుకాణాల్లో కనిపిస్తే బాధ్యులు జైలుకెళ్లక తప్పదని తేల్చిచెప్పారు. క్షేత్రస్థాయిలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించి, కొత్త పథకాల అమలుకు శ్రీకారం చుట్టి తమ ప్రభుత్వం నూతన ఒరవడి సృష్టించిందని ఈటెల అన్నారు. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం మిషన్‌ కాకతీయపై మంత్రి హరీశ్‌రావు ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని, హాస్టళ్లు, పాఠశాలలకు సన్నబియ్యం పంపిణీపై తాను కూడా జిల్లాలవారీగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు మంత్రి వివరించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కల్పించేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం యిస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలోని రేషన్‌ దుకాణాలను రేషనలైజ్‌ చేస్తామని మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. పల్లె నుంచి మునిసిపాలిటీ వరకు.. ఎక్కడ ఎన్ని ఆహారభద్రత కార్డులకు ఎన్ని దుకాణాలు ఉండాలన్న అంశంపై కసరత్తు చేస్తామన్నారు. అవసరమైన చోట అదనపు దుకాణాలను ప్రారంభిస్తామని తెలిపారు. ఆహార భద్రత కార్డులకు సీఎం రిలీఫ్‌ఫండ్‌కు ఎలాంటి సంబంధం లేదని మంత్రి రాజేందర్‌ స్పష్టం చేశారు. కాగా, తెలంగాణ వ్యాప్తంగా 97.78 లక్షల మంది కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా, 97 లక్షల మందిని అర్హులుగా తేల్చారు. కార్డుల ముద్రణ పూర్తికాకపోవడంతో ప్రస్తుతానికి జాబితా ఆధారంగా బియ్యం పంపిణీ చేయనున్నారు.

No comments:

Post a Comment