Monday, 28 October 2013

హైదరాబాద్‌పై వరవరరావు

హైదరాబాద్‌పై వరవరరావు

"తెలంగాణవాదంలో ముస్లింలు ఎందుకు వెనుకబడి ఉన్నారు?
తెలంగాణవాదం ముసుగులో హిందూయిజాన్ని నెత్తికెత్తుకున్నామా?"
                       - వరవరరావు, విప్లవకవి

"తెలంగాణ ఎజెండాలో ముస్లిం లు, లౌకికవాదం ఉన్నాయా?"
            - వరవరరావు, విప్లవకవి  

"దోపిడీదారుడు ఆంధ్రావాడైనా, తెలంగాణవాడైనా హైదరాబాద్ నుండి పోవాల్సిందేనన్నారు. శ్రమించి చెమట చిందించేవారు ఎవరైనా, ఎక్కడి వారైనా హైదరాబాద్ వారిదే"
                     - వరవరరావు, విప్లవకవి

"హైదరాబాద్‌లో పుట్‌పాత్‌లపై నడిచే, ఇరానీ కేఫ్‌లలో చాయ్ తాగే పరిస్థితి వస్తుందా?.. కనీసం అప్పటి విలువలు, సంస్కారం, ప్రేమ వంటివైనా హైదరాబాద్ తెహజీబ్‌లో తేగలమా?’
                     - వరవరరావు, విప్లవకవి

హైదరాబాద్ ఆస్తికాదు..అస్తిత్వం

హైదరాబాద్ ఆస్తికాదు..అస్తిత్వం

Sakshi | Updated: October 28, 2013 04:18 (IST)
హైదరాబాద్ ఆస్తికాదు..అస్తిత్వం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌పై పాలనాధికారం తెలంగాణకే ఉండాలని మంజీరా రచయితల సంఘం 27వ వార్షికోత్సవ సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. అందుకు భిన్నంగా ఉండే ఎలాంటి నిర్ణయాన్నైనా అంగీకరించబోమని స్పష్టం చేసింది. మంజీరా రచయితల సంఘం 27వ వార్షికోత్సవ సభ ఆదివారం హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో జరిగింది. తెలంగాణ జే‌ఏసీ చైర్మన్ కోదండరాం, ప్రొఫెసర్లు జి.హరగోపాల్, ఎ.శివారెడ్డి, జి.చక్రపాణి, సంపాదకులు కె.రామచంద్రమూర్తి, కె.శ్రీనివాస్, అల్లం నారాయణ, ఎన్.వేణుగోపాల్, ప్రొఫెసర్లు ఎ.శివారెడ్డి, ఎమ్మెల్యే టి.హరీష్‌రావు, వరవరరావు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రామలింగారెడ్డి, టీ‌ఎన్జీవో అధ్యక్ష, కార్యదర్శులు దేవీప్రసాద్, కె.రవీందర్‌రెడ్డి, మంజీరా రచయితల సంఘం నేతలు నందిని సిధారెడ్డి, దేశ్‌పతి శ్రీనివాస్ తదితరులు ఈ సభలో ప్రసంగించారు. హైదరాబాద్‌లో ఉండటానికి అందరిదే అయినా పరిపాలనాధికారం మాత్రం తెలంగాణకే ఉండాలని, అందుకు భిన్నంగా ఉండే ఏ నిర్ణయాన్నైనా అంగీకరించవద్దని సభ తీర్మానించింది.

హైదరాబాద్ సాంస్కృతిక చరిత్రపై లోతుగా పరిశోధన జరగాలని, సాంస్కృతిక పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కోదండరాం మాట్లాడుతూ.. సీమాంధ్ర సంపన్నులకు హైదరాబాద్ ఒక ఆస్తిగానే కనబడుతున్నదని, తెలంగాణ ప్రజలేమో అస్తిత్వం కోసం హైదరాబాద్‌లో దేవులాడుకుంటున్నారని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్‌లో జీవనం, సంస్కృతి, పరిపాలన విధ్వంసమయ్యాయని విమర్శించారు. సీమాంధ్రులకు హైదరాబాద్ అడ్డాగా మారిపోయిందని, కాళ్లకు చెప్పులు లేకుండా నగరానికి వచ్చిన వాళ్లు ఏసీ కార్లలో వెళ్తున్నారని ఆయన ఆరోపించారు.

హైదరాబాద్ వనరులన్నీ హైదరాబాదీలకే చెందాలన్నారు. హైదరాబాద్‌లో రకరకాల వృత్తులు ఉన్నాయని, ఆ వృత్తులను సీమాంధ్రులు పాతరేశారని ధ్వజమెత్తారు. హైటెక్ సిటీ పేరుతో చంద్రబాబు నగరాన్ని వ్యాపారకేంద్రంగా మార్చేశారని మండిపడ్డారు. ఎంతో విశాలమైన హుస్సేన్‌సాగర్‌ను చుట్టూ మట్టి నింపి సినిమా థియేటర్లకు ఇచ్చేశారని.. బ్యూటిఫికేషన్ పేరిట గుడిసెలను తొలగించారని మండిపడ్డారు. భూములను ఆక్రమించుకోవడానికి శివార్లలోని మునిసిపాలిటీలను, గ్రామ పంచాయతీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసుకున్నారని ఆరోపిం చారు. దానివల్ల అధికార కేంద్రీకరణ జరిగి, సామాన్య ప్రజలకు పరిపాలనాపరమైన ఇబ్బందులు వచ్చాయని కోదండరాం పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ పునరుజ్జీవానికి కృషి చేసుకుంటామని, జీహెచ్‌ఎంసీతో విధ్వంసాన్ని నిరోధించేందుకు.. మునిసిపాలిటీలుగా విభజించి పాత హైదరాబాద్‌ను పునర్నిర్మించుకుంటామని చెప్పారు. అనంతరం ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడారు. నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ తెలంగాణ ప్రజలకు ఆత్మ వంటిదన్నారు. చుట్టూ ఉన్న జిల్లాల ప్రజల శ్రమతో హైదరాబాద్ ఇప్పటి రూపును సంతరించుకున్నదని పేర్కొన్నారు.

 పరిపాలనా అధికారం తెలంగాణకే ఉన్నా ఎవరూ ఇక్కడి నుండి వెళ్లిపోవాల్సిన అవసరం లేదని కె.రామచంద్రమూర్తి చెప్పారు. భౌగోళికంగా పూర్తిగా తెలంగాణలో అంతర్భాగంగా ఉన్న హైదరాబాద్ తెలంగాణదేనని, దీనిపై మరో ప్రస్తావన, చర్చ అవసరం లేదని కె.శ్రీనివాస్ పేర్కొన్నారు. విప్లవకవి వరవరరావు మాట్లాడుతూ.. తెలంగాణవాదంలో ముస్లింలు ఎందుకు వెనుకబడి ఉన్నారని, తెలంగాణవాదం ముసుగులో హిందూయిజాన్ని నెత్తికెత్తుకున్నామా? అని ప్రశ్నించారు.

 తెలంగాణ ఎజెండాలో ముస్లిం లు, లౌకికవాదం ఉన్నాయా? అని నిలదీశారు. దోపిడీదారుడు ఆంధ్రావాడైనా, తెలంగాణవాడైనా హైదరాబాద్ నుండి పోవాల్సిందేనన్నారు. శ్రమించి చెమట చిందించేవారు ఎవరైనా, ఎక్కడి వారైనా హైదరాబాద్ వారిదేనని పేర్కొన్నారు. ‘హైదరాబాద్‌లో పుట్‌పాత్‌లై పె నడిచే, ఇరానీ కేఫ్‌లలో చాయ్ తాగే పరిస్థితి వస్తుందా?.. కనీసం అప్పటి విలువలు, సంస్కారం, ప్రేమ వంటివైనా హైదరాబాద్ తెహజీబ్‌లో తేగలమా?’ అని వరవరరావు ప్రశ్నించారు. ఎమ్మెల్యే టి.హరీష్‌రావు మాట్లాడుతూ.. ఢిల్లీ నుండి సీల్డు కవరులో వచ్చిన సీ‌ఎం కిరణ్‌కు నైతిక విలువల గురించి మాట్లాడే అర్హత లేదని, తెలంగాణను ఆపడం ఆయ న తరం కాదని వ్యాఖ్యానించారు. ఎన్.వేణుగోపాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమి తెలంగాణలో ఎక్కువగా ఉండటం వల్లనే కేంద్ర పరిశ్రమలు హైదరాబాద్‌కు వచ్చాయన్నారు.  సీమాంధ్ర పాలకుల కన్నా నిజాం పాలకులే అభివృద్ధి చేశారని ప్రొఫెసర్ చక్రపాణి వ్యాఖ్యానించారు.

వారసత్వ రాజకీయాలు వదిలేస్తే.... రాకుమారుడనను

వారసత్వ రాజకీయాలు వదిలేస్తే.... రాకుమారుడనను

Published at: 28-10-2013 06:41 AM
 New  0  0 
 
 

అమ్మాకొడుకులే కాంగ్రెస్ సారథులు
వాళ్లవి కుటుంబ ప్రాధాన్య రాజకీయాలు
నితీశ్ కపటి.. వంచకుడు
అలాంటి వాడ్ని ఏమి చేసినా పాపం లేదు
పాట్నా గాంధీ మైదానంలో చెలరేగిన మోదీ
పాట్నా, అక్టోబర్ 27: కాంగ్రెస్ పార్టీ వంశపారంపర్య రాజకీయాలను వదిలేస్తే తాను రాహుల్ గాంధీని రాకుమారుడు (షెహజాదా) అని సంబోధించడం మానివేస్తానని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ అన్నారు. ఎన్నికల నిబంధనావళి కారణంగా ఆగుతున్నామని, లేదంటే రాహుల్‌ని ఎద్దేవా చేస్తున్న మోదీ నోరు రెండు నిమిషాల్లో మూయించేవాళ్లమని కాంగ్రెస్ నేతలు హెచ్చరించిన నేపథ్యంలో.. మోదీ దీటుగా స్పందించారు. కుటుంబ రాజకీయాలకు తెర పడనంతకాలమూ పదే పదే అదే మాట అని తీరతానని తేల్చి చెప్పారు. 'మొదట కుటుంబం' అనే సిద్ధాంతంతో కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నదని దుయ్యబట్టారు. ఆ పార్టీలో నంబర్ - 1 సోనియా అయితే, నంబర్-2 రాహుల్ అని ఎద్దేవా చేశారు. వంశపారంపర్య రాజకీయాలు, అవకాశవాద రాజకీయాలే దేశ ప్రజాస్వామ్యానికి శత్రువులంటూ.. కాంగ్రెస్ పార్టీతో పాటు బద్ధ ప్రత్యర్థిగా మారిన నిన్నటి స్నేహితుడు నితీశ్‌కుమార్‌నూ తూర్పారబట్టారు. బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదానం వేదికగా నిప్పులు చెరిగారు. జేడీయూతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం నడిపినంత కాలం, ముఖ్యంగా గత మూడేళ్లలో ఒక్కసారి కూడా మోదీ బీహార్‌కు రాలేదు. ముఖ్యంగా నితీశ్ అభ్యంతరాలే దీనికి కారణం. నితీశ్‌తో బంధం పటాపంచలైన దరిమిలా రాష్ట్ర బీజేపీ నేతల ఆహ్వానం మేరకు ఆదివారం 'హూంకార్ సదస్సు'లో మోదీ పాల్గొన్నారు. రాహుల్‌గాంధీ, నితీశ్‌లే లక్ష్యంగా మోదీ చెలరేగిపోయారు.
" ఆయన (నితీశ్) నిన్న జయప్రకాశ్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియాలకు, ఇప్పుడు బీజేపీకీ వెన్నుపోటు పొడిచారు. బీహార్ ప్రజలను వంచించారు'' అని మండిపడ్డారు. కపట రాజకీయ నేతగా నితీశ్‌ను ఆయన వర్ణించారు. "ప్రధానమంత్రి ఏడాదికి రెండుసార్లు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విందు ఇస్తుంటారు. అలాంటి ఒక విందు సమయంలో నేను, నితీశ్ ఒక దగ్గరే కూర్చున్నాం. అందరం తింటున్నా నితీశ్ ముద్ద ముట్టలేదు. నేను మొదట కొంత కలవరపడ్డాను. ఆ తరువాత కారణం తెలిసిపోయింది. ' ఇక్కడ కెమేరాలు లేవు. నిరభ్యంతరంగా మీరు భోజనం చేయొచ్చు' అని నితీశ్‌కు చెప్పాను. ఇలాంటి వంచన నేతలను సహించరాదు'' అని తూర్పారబట్టారు. హిందూ-ముస్లింలు పరస్పర ఘర్షణలు వీడి, దారిద్య్రానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. భోజ్‌పూరీ,మైథేలి భాషల్లో మోదీ తన ప్రసంగం ఆరంభించారు. ప్రసంగం ఆసాంతం బీహార్ చరిత్రను, ప్రజల సంప్రదాయాలను కొనియాడారు. బీహారీ యాదవులకు, గుజరాత్‌లోని ద్వారకతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు.
ఇంకా ఆయన ఏమి అన్నారంటే..
- కొద్ది మందిని (నితీశ్)ని మినహాయిస్తే బీహారీలు అవకాశవాదులు కానేకాదు. దేశానికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా బీహార్ వైపు చూస్తుంది. మా పార్టీ సిద్ధాంతాలను బీహారీలు గ్రహించాలని కోరుతున్నాను. బీహార్ ముఖ్యమంత్రి మా రాష్ట్రం వస్తే గొప్పగా ఆదరిస్తాం. అతిథులను గౌరవించే సంస్కృతి నాది.
- బీహార్‌లో రెండు పర్యాయాలు జేడీయూకి వచ్చినన్ని సీట్లే మా పార్టీకీ వచ్చాయి. ముఖ్యమంత్రి పదవిని తీసుకునే అవకాశం ఉన్నా ఆ అవకాశాన్ని మా భాగస్వాములకే వదిలేశాం. జేడీయూ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం హయాంలో ప్రజలకు ఏమైనా మేలు జరిగినట్టయితే.. ప్రభుత్వంలోని మా పార్టీ మంత్రుల ఘనత అది.
- నన్ను బీహార్‌కు రానీయకపోయినా బాధపడలేదు. దాన్నో అంశంగా మార్చవద్దు అని ఇక్కడి మా పార్టీ నేతలకు చెప్పేవాడిని. బీహార్‌కు చెందిన వీర జవాన్లు పాక్ చేతుల్లో అమరులయ్యారు. కానీ, మన మంత్రిగారు.. మరింతమంది సైన్యంలో చేరి, అమరత్వాన్ని పొందాలని సెలవిస్తున్నారు. ఈ అవమానాన్ని సహించగలరా?
- గతంలో నేను రైళ్లలో టీలు అమ్మేవాడిని. భారతదేశంలోని రైళ్ల పరిస్థితి రైల్వే మంత్రి కన్నా నాకే బాగా తెలుసు.
- ఇంకా ఎంత 200 రోజులు. మీరు చూపిస్తున్న ప్రేమకు వడ్డీ కలిపి మరీ తిరిగి చెల్లించుకుంటాను.
- 'ముందు దేశం' అనేది నా మతం. అభివృద్ధి నా మంత్రం. చాణక్యుడు నాకు ఆదర్శం.
- ముస్లింల గురించి మాట్లాడేవారికి నేను చెప్పేదల్లా..అభివృద్ధే అన్ని సమస్యలకూ పరిష్కారం అని. గుజరాత్ ముస్లింలతో పోల్చితే బీహారీ ముస్లింలు బాగా వెనకబడ్డారు. హిందూ, ముస్లింలు కలిసికట్టుగా దేశాభివృద్ధికి పాటుపడాల్సిన సమయం ఆసన్నమైంది.
మౌన ప్రధానిని ప్రశ్నించేదెలా ?
బొగ్గు కేటాయింపుల వ్యవహారంలో అవసరమైతే సీబీఐ విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధమన్న ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఎద్దేవా చేశారు. " మన ప్రధాని అసలు మాట్లాడనే లేరు. అలాంటప్పుడు ఆయనను సీబీఐ ఎలా ప్రశ్నించాలి?'' అని ప్రశ్నించారు.
- See more at: http://www.andhrajyothy.com/node/15292#sthash.S9QA5517.dpuf

ఆ పేర్లు బయటపెట్టు - MODI to Rahul

ఆ పేర్లు బయటపెట్టు

Published at: 26-10-2013 05:13 AM
 New  0  0 
 
 

లేదా ముస్లింలకు బహిరంగ క్షమాపణ చెప్పు
రాహుల్‌పై నరేంద్రమోదీ నిప్పులు
ఈసీకి బీజేపీ ఫిర్యాదు!
ఎస్పీ,జేడీయూ,ముస్లిం మత పెద్దల ధ్వజం
'యువరాజు' వ్యాఖ్యలపై ఈసీ దృష్టి
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: ముజఫర్‌నగర్ అల్లర్లలో బాధిత ముస్లిం యువకులను పాకిస్థాన్ నిఘా సంస్థలు ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని నిఘా అధికారి ఒకరు తనతో చెప్పారంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ, జేడీయూ, ఎస్పీ సహా ముస్లిం మత పెద్దలు సైతం మండిపడుతున్నారు. గురువారం ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న నరేంద్ర మోదీ.. రాహుల్‌గాంధీని 'షెహజాదా (యువరాజు)' అంటూ వ్యంగ్యంగా సంబోధిస్తూ.... నిప్పులు చెరిగారు. ముజఫర్‌నగర్ ముస్లిం యువతతో ఐఎస్ఐ టచ్‌లో ఉందని చెప్పిన రాహుల్.. సదరు ముస్లిం యువకుల పేర్లను బయటపెట్టాలని, లేదా ముస్లింలపై అంత తీవ్రమైన, వారిని అపఖ్యాతిపాలు చేసే వ్యాఖ్యలు చేసినందుకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీకి ఏ హోదా ఉందని నిఘా సంస్థలు నేరుగా ఆయనకు ఈ విషయాన్ని చెబుతాయని మండిపడ్డారు. ఇదిలావుండగా, రాహుల్ దేశంలో మత విద్వేషాలను రేకెత్తించే ప్రయత్నిస్తున్నారంటూ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు బీజేపీ సిద్ధమైంది.
ఈ మేరకు ఆ పార్టీ నేతలు సోమవారం ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. అసలు ఇంటెలిజెన్స్ అధికారులు ఒక కాంగ్రెస్ ఎంపీ (రాహుల్)కి ఈ విషయాన్ని ఎందుకు చెప్పారో, దీనిపై ప్రభుత్వం ఏయే చర్యలు తీసుకుందో హోం మంత్రి షిండే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరోగనక రాహుల్‌గాంధీకి ఈ విషయం చెప్పింది నిజమే అయితే.. దీన్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉందని, దీనిపై దర్యాప్తు జరపాలని బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా అన్నారు. మరోవైపు.. ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ కూడా కాంగ్రెస్ యువరాజుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఆయన తన వ్యాఖ్యలకు ఆధారాలు చూపాలని, చూపితే తాము దానిపై దర్యాప్తు జరిపిస్తామని ఎస్సీ నేత నరేష్ అగర్వాల్ అన్నారు. రాహుల్ వ్యాఖ్యలు ముస్లింలను అవమానించేలా ఉన్నాయని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి ధ్వజమెత్తారు.
రాహుల్ వ్యాఖ్యలు ముస్లింలపై ద్వేషం రేకెత్తించేలా ఉన్నాయని సీపీఐ నేత అతుల్ రంజన్ అన్నారు. బాధితుల దుస్థితిని, బాధను అర్థం చేసుకోకుండా రాహుల్ గాంధీ రాజకీయాలకు పాల్పడుతున్నారని ప్రముఖ షియా మతపెద్ద మౌలానా సైష్ అబ్బాస్ నఖ్వీ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. ఇండోర్‌లో రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఉన్నాయంటూ మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నరేంద్ర సింగ్ తోమార్ చేసిన ఫిర్యాదుకు ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి జైదీప్ గోవింద్ స్పందించారు. దీనిపై దృష్టి సారించాల్సిందిగా ఇండోర్ కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. "ఈరోజు నేనిక్కడికి ఏడ్చి ఫిర్యాదులు చేయడానికి రాలేదు. ఏడిపించే కథలతో మిమ్మల్ని కన్నీళ్లు పెట్టించడానికి రాలేదు. మీకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించి, మీ కన్నీళ్లు తుడవటానికి వచ్చాను''...ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో గురువారం బీజేపీ నిర్వహించిన భారీ సభలో ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోదీ ఉపన్యాసంలో రాహుల్‌గాంధీపై పరోక్షంగా విసిరిన చెణుకులివి! ఇటీవలికాలంలో.. తన తల్లి, నానమ్మ త్యాగాల గురించి చెబుతున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలతో తన ఉపన్యాసాన్ని ప్రారంభించిన మోదీ క్రమంగా జోరు పెంచారు.
తన నానమ్మ హత్యకు గురైనప్పుడు తనకు చాలా కోపం వచ్చిందని రాహుల్‌గాంధీ చెప్పారని.. అయితే, 1984 ఊచకోతలో ప్రాణాలు కోల్పోయిన సిక్కుల కోసం ఆయనెప్పుడైనా కన్నీళ్లు కార్చారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌పార్టీకి ఈ దేశాన్ని పాలించడానికి 60 ఏళ్లు అవకాశమిచ్చారని.. తమకు 60 నెలలు ఇచ్చి చూడాలని ప్రజలను కోరారు. అప్పుడు తాను ఉత్తరప్రదేశ్ రాతనే కాదు.. దేశ తలరాతనే మార్చేస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీనే కాదు.. ఎస్పీ, బీఎస్పీలపైనా మోదీ విరుచుకుపడ్డారు.
- See more at: http://www.andhrajyothy.com/node/14592#sthash.MNv6QRPy.dpuf

1931 నాటికే హైదరాబాద్ అభివృద్ధి చెందింది

1931 నాటికే హైదరాబాద్ అభివృద్ధి చెందింది

Published at: 30-09-2013 03:09 AM
 2  0  1 
 
 

కేసముద్రం రూరల్, సెప్టెంబర్ 29: హైదరాబాద్ అభివృద్ధిపై సీమాంధ్ర నాయకులు, తెలంగాణవాదుల మధ్య వాదనలకు ముగింపు పలికేందుకు ఒక ఆధారం లభించిందని వరంగల్‌కు చెందిన కాకతీయ విశ్వవిద్యాలయం రిటైర్డ్ హిస్టరీ ప్రొఫెసర్ బి.చంద్రయ్య తెలిపారు. బ్రిటిష్ సామ్రాజ్యంలో హైదరాబాద్ ఆరో అతి పెద్ద నగరమని 1931లో భారత గణాంక శాఖ ప్రచురించిన నివేదికలో స్పష్టంగా ఉందని వివరించారు. తన పరిశోధనలో భాగంగా దాదాపు 20 ఏళ్ల కిందట మద్రాస్ కేంద్ర గ్రంథాలయంలో ఈ ఆధారాలను సేకరించినట్లు ఆయన 'ఆంధ్రజ్యోతి'కి తెలిపారు.
భారత గణాంకశాఖ కమిషనర్ గులాం అహ్మద్‌ఖాన్ 1931లో నిజాం సంస్థానం (హైదరాబాద్ రాష్ట్రం)పై గణాంక నివేదిక ఇచ్చారు. 13వ వాల్యూమ్ పార్ట్-1 నివేదిక ప్రకారం ఆనాటి రాష్ట్రంలో హైదరాబాద్, ఔరంగబాద్, గుల్బర్గా, వరంగల్‌లను నగరాలుగా పేర్కొన్నారు. ఈ నాలుగు నగరాల జనాభా 6,06,966గా ఉంది. ఇందులో హైదరాబాద్ దేశంలో నాలుగో స్థానం, బ్రిటీష్ పాలనలో ఉన్న రాజ్యాల్లో లండన్, సిడ్నీ, కలకత్తా, బాంబే, మద్రాస్ తర్వాత హైదరాబాద్(ఆరోస్థానం) ఉంది. ప్రపంచంలో 23వ ర్యాంకుతో హైదరాబాద్ ఉన్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు.
- See more at: http://www.andhrajyothy.com/node/5084#sthash.rGBoXC6h.dpuf

Sunday, 27 October 2013

కేంద్రంతో జగన్ కుమ్మక్కు నిజం

కేంద్రంతో జగన్ కుమ్మక్కు నిజం

Published at: 28-10-2013 06:39 AM
 New  0  0 
 
 

దత్తపుత్రుడు బలపడితే విభజన వేగవంతం
ఇదే వాళ్ల ఆలోచన
అందుకే సమైక్య శంఖారావం
వైసీపీ బలహీనపడితే ప్రక్రియ ఆగిపోతుంది
టీఆర్ఎస్‌తోనూ లాలూచీ
జగన్, కేసీఆర్ తోడు దొంగలు
సభను అడ్డుకోకపోవడమే నిదర్శనం
వైసీపీకి బలం లేదని అధిష్ఠానానికి ఆలస్యంగా అర్థమైంది : లగడపాటి
హైదరాబాద్, విజయవాడ, అక్టోబర్ 27: జగన్ పార్టీ ఎంత బలపడితే విభజన ప్రక్రియ అంత వేగవంతమవుతుందని, బలహీనపడితే ప్రక్రియ ఆగిపోతుందని కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. కేంద్రంతో జగన్ కుమ్మక్కయ్యారని, అధిష్ఠానం ఆయన్ని దత్తపుత్రుడిగా భావిస్తోందని పేర్కొన్నారు. ఇక వైసీపీ, టీఆర్ఎస్ లాలూచీ పడ్డాయన్న విషయాన్ని శనివారం నాటి జగన్ సభను చూసిన చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడని అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. సమైక్య సభ బలపడాలని జగన్ ప్రయత్నించారని, అయితే ఆయన పార్టీ బలపడటం లేదని అధిష్ఠానానికి ఆలస్యంగా అర్థమైందన్నారు. రాష్ట్రం జగన్ గుప్పిట్లో ఉందన్న భ్రమతో కాంగ్రెస్ అధిష్ఠానం విభజన ప్రకియను వేగవంతం చేస్తోందన్నారు.
సమైక్యవాదంతో ముందుకెళ్తున్న ఏపీఎన్జీవో సభకు అడ్డంకులు సృష్టించిన టీఆర్ఎస్.. జగన్‌తో కుమ్మక్కయినందునే ఆయన సభకు ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదన్నారు. జగన్, కేసీఆర్ తోడు దొంగల్లా కూడబలుక్కుని హైదరాబాద్‌లో శంఖారావం సభను నిర్వహించారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో బిల్లు వచ్చినా, తీర్మానం వచ్చినా ఓడిస్తామని, ఆ తర్వాత రాజీనామా చేయడానికి ముఖ్యమంత్రితో సహా సీమాంధ్ర నేతలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మూడునెలలుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఆందోళన చేస్తున్నారని, ఇందులో నాయకులు లేరని పేర్కొన్నారు. దీనిపై పత్రికల్లో వచ్చిన సమాచారాన్ని ఢిల్లీకి పంపినట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పడాలన్నా, ప్రక్రియ ఆగిపోవాలన్నా కాంగ్రెస్‌కు మాత్రమే సాధ్యమని, అందుకే ఢిల్లీ పెద్దలను ఒప్పించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించడానికి, ప్రజల గుండెల్లోని భావనను తెలియజేసేందుకు యత్నిస్తున్నామన్నారు. ప్రజల భావోద్వేగాలను తేలిగ్గా తీసుకోవద్దని అధిష్ఠానానికి చెప్పామన్నారు.
ఆ శక్తి ఇప్పుడెక్కడిది?
ఇడుపులపాయ ప్లీనరీలో తెలంగాణ ఇచ్చే శక్తి తనకు లేదని, తెచ్చేవాణ్ని కాదని, ఇచ్చేవాణ్ని కాదని... కేంద్ర ప్రభుత్వం ఏమైనా చేసుకోవచ్చని జగన్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆనాడు లేని శక్తి ఇవాళ ఎక్కడి నుంచి వచ్చిందని, ఆనాడు చేయని దీక్షలు ఇప్పుడెలా చేస్తున్నారని లగడపాటి ప్రశ్నించారు. కేంద్రంతో లాలూచీపడి దత్తపుత్రుడిగా మారి రాష్ట్రాన్ని విడగొట్టడానికి సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్, జేఏసీ నుంచి ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఉద్యోగులు నిర్వహించిన సభను జగన్ మీడియా చూపించలేదన్నారు. సీట్లను వీళ్లెక్కడ తన్నుకుపోతారోనని భయపడ్డారని మండిపడ్డారు. సామాన్య ఉద్యోగులు ఉద్యమిస్తూ సభ పెడితే చూపించే సంస్కారం జగన్ మీడియాకు లేకపోయిందన్నారు. జగన్‌తో కేంద్ర నాయకత్వం లాలూచీ పడుతోందన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని లగడపాటి వ్యాఖ్యానించారు. సీమాంధ్ర నుంచి 25 సీట్లు తెస్తామని వైసీపీ, తెలంగాణ నుంచి 15 సీట్లు తెస్తామని టీఆర్ఎస్.. కాంగ్రెస్ నాయకత్వానికి చెప్పాయన్నారు. ఈ లోపాయికారి ఒప్పందాన్ని ప్రజలు చీదరించుకోవడంతో సీట్లు రావని కేంద్రం ఇప్పుడు ఆందోళన చెందుతోందన్నారు.
దత్తపుత్రుడనుకున్న వారికి శక్తి తగ్గిపోతున్నదని ఢిల్లీ పెద్దలు గమనిస్తున్నారని లగడపాటి వ్యాఖ్యానించారు. సోనియా, రాహుల్‌ను మాట వరుసకు, మొహమాటంగా మాత్రమే జగన్ విమర్శించారన్నారు. విభజన కోసం పోరాడిన టీఆర్ఎస్‌పై, కేసీఆర్‌పై సభలో పల్లెత్తు మాట అన్నారా? అని ప్రశ్నించారు. ప్రజల జీవితాలను పణంగా పెట్టి ఎలాంటి చీకటి ఒప్పందాలు చేసుకున్నారో దీంతో వెల్లడవుతోందన్నారు. కరీంనగర్ జిల్లా జగన్ పత్రికను చూస్తే టీఆర్ఎస్‌కు జగన్ ఏ విధంగా వత్తాసు పలుకుతున్నాడో అర్థమవుతోందని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రం కోసం తాము ధర్మ పోరాటం చేస్తున్నామని లగడపాటి అన్నారు. ముఖ్యమంత్రి దేన్నీ లెక్క చేయకుండా ముందుకెళ్తున్నారని ప్రశంసించారు. ఆయన పదవుల కోసం పాకులాడకుండా సమైక్యవాదాన్ని భుజానికెత్తుకున్నారన్నారు. 2014లోగా ఏ శక్తి కూడా రాష్ట్ర విభజన చేయలేదన్నారు. రాజకీయ భవిష్యత్తు నాశనమైనా పట్టించుకోబోమన్నారు.
సాక్షి ప్రతినిధులతో వాగ్వాదం
లగడపాటి మాట్లాడుతున్న సందర్భంలో 'సాక్షి' ప్రతినిధి ప్రశ్న వేయడంతో ఆయన ఆగ్రహించారు. తాను ప్రెస్‌మీట్ పెట్టానని, ఇది మీట్‌ది ప్రెస్ కాదని లగడపాటి మండిపడ్డారు. తాను మాట్లాడటం పూర్తి చేయకముందే ప్రశ్నలేంటని అసహనం వ్యక్తంచేశారు. సాక్షి వాళ్లను తాను ప్రెస్‌మీట్‌కు పిలవలేదని, ఇష్టం లేకుంటే బయటకు వెళ్లొచ్చన్నారు. అయితే ఇతర మీడియా ప్రతినిధులు వారించడంతో ప్రెస్‌మీట్ కొనసాగించారు.
- See more at: http://www.andhrajyothy.com/node/15291#sthash.wnZIC3T2.dpuf

Saturday, 26 October 2013

ఢిల్లీ కోటను బద్దలు కొడదాం - Jagan

ఢిల్లీ కోటను బద్దలు కొడదాం

Published at: 27-10-2013 04:35 AM
 New  0  0 
 
 

30 ఎంపీ సీట్లు సాధించి ప్రధానిని నిర్ణయిద్దాం
ఇటలీ వెళ్లిపో..అని పార్లమెంటులో తీర్మానం చేస్తే సోనియాకు నచ్చుతుందా?
కొడుకును ప్రధానిని చేయడానికి మాతో ఆటలా?
రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తున్న కిరణ్, బాబు
అన్యాయం చేస్తే విప్లవ జెండాలు పట్టుకుంటాం
సమైక్య శంఖారావంలో జగన్
(హైదరాబాద్ - ఆంధ్రజ్యోతి):"రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని పార్లమెంటు శీతాకాల సమావేశాల వరకు పోరాడదాం. అవసరమైతే 2014 వరకు పోరాటం చేద్దాం. రాష్ట్రంలో 30 ఎంపీ సీట్లు గెలిపించుకుందాం. ఢిల్లీ కోటను బద్దలు కొడదాం. ఢిల్లీలో రాజకీయాలను మనమే శాసిద్దాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వ్యక్తినే ప్రధానిని చేద్దాం. ఆ తర్వాత రాష్ట్రాన్ని ఎవరు విడదీస్తారో చూద్దాం'' అని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి పిలుపునిచ్చారు. వైసీపీ ఆధ్వర్యంలో శనివారం ఎల్బీ స్టేడియంలో జరిగిన సమైక్య శంఖారావంలో శంఖాన్ని పూరించి ఆయన మాట్లాడారు. ఢిల్లీ అహంకారానికి, తెలుగువాడి ఆత్మ గౌరవానికి జరుగుతున్న పోరాటం మనదన్నారు. మౌనంగా ఉంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను.. భవిష్యత్తులో మరికొన్ని రాష్ట్రాలను ఓట్లు, సీట్ల కోసం ముక్కలు చేస్తారని, అందరం కలిసికట్టుగా ఎదుర్కొంటేనే ఓట్లు, సీట్ల రాజకీయాలను నిలువరించవచ్చని సూచించారు. "విభజనకు సహకరించి చరిత్రహీనులుగా మిగులుతారా? ప్రజలకు తోడుగా ఉంటారా?'' అని సోనియా, కిరణ్, చంద్రబాబులను ప్రశ్నించారు. శంఖారావంలో ఈ ముగ్గురిపైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
"1968లో రాజీవ్ గాంధీతో మీకు (సోనియా) పెళ్లయింది. 1983లో భారతదేశ పౌరసత్వం తీసుకున్నావు. ఇప్పుడు.. పౌరసత్వం తీసుకున్న వారంతా దేశం విడిచి వెళ్లాలనే బిల్లు పార్లమెంట్‌లో వస్తే సోనియాకు నచ్చుతుందా? ఈ మాట అంటేనే కాంగ్రెస్ వాళ్లు కల్లు తాగిన కోతుల్లా రెచ్చిపోతారు. 30 ఏళ్లకే నీకు ఇంతటి మమకారం ఉంటే.. 60 ఏళ్లుగా కలిసున్న మమ్మల్ని విడదీసే ప్రయత్నం చేస్తుంటే మాకెంత బాధ ఉంటుంది? నీ కొడుకుకు ప్రధాని ఉద్యోగం కోసం మా పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవడం ఎంతవరకు న్యాయం?'' అని సోనియాను నిలదీశారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ వైఎస్ రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలో కూర్చోబెడితే రాహుల్‌ను ప్రధానిని చేయడం కోసం ఇప్పుడు తెలుగు ప్రజలతో చెలగాటమాడతారా అంటూ విమర్శించారు. అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్ర తెలుసా అని సోనియాను ప్రశ్నించారు. మీ అత్త ఇందిరా గాంధీ ప్రధాని హోదాలో పార్లమెంటులో చేసిన ప్రసంగం చదువుకో అంటూ ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఇందిర చేసిన కొన్ని వ్యాఖ్యలను ఉటంకించారు. తెలుగు జాతిని చీల్చాలనుకోవడం న్యాయమేనా? బలమైన రాష్ట్రాన్ని బలహీనం చేయడం సబబేనా అని సోనియాను ప్రశ్నించారు. "రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ 80 రోజులుగా అన్ని వర్గాలవారు ఉద్యమాలు చేస్తున్నారు.
ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించాలని చూస్తున్న సోనియాకు ఈ ఆందోళనలు పట్టలేదు. ప్యాకేజీలు అడుగుతున్న చంద్రబాబుకు తట్టలేదు. సోనియా గీత దాటకుండా మోసం చేస్తున్న కిరణ్‌కు పట్టలేదు. వీళ్లంతా మనుషులేనా!? నీళ్ల పరిస్థితిని గమనించారా? సీడబ్ల్యూసీ తీర్మానం చేసినప్పుడే ముఖ్యమంత్రి పదవికి కిరణ్ రాజీనామా ఎందుకు చేయలేదు. సోనియా ఆదేశించినప్పుడే చేస్తారు. అంతా అయిపోయాక, ప్రజల వద్దకు వెళ్లి మొసలి కన్నీరు కారుస్తారు. అసెంబ్లీని సమావేశపరచాలని, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని తీర్మానం చేద్దామని కిరణ్‌ను కోరాం. దాంతో దేశంలో అలజడి వస్తుందని చెప్పాం. గవర్నర్‌కు విన్నవించాం. నేను, మా అమ్మ దీక్షలు చేశాం. సీఎం కార్యాలయం వద్ద ధర్నాలు చేశాం. ముసాయిదా బిల్లు రాకముందే సమైక్యానికి అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేద్దామన్న మా ప్రయత్నం అరణ్య రోదనే అయింది'' అని విమర్శించారు. కిరణ్, చంద్రబాబు ఇద్దరూ రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ కనీవినీ ఎరుగని విధంగా అసెంబ్లీ తీర్మానాన్ని పక్కన పెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చే స్తోందని విమర్శించారు. అందరం కలిసికట్టుగా విభజించు పాలించు రాజకీయాలను అడ్డుకోవాలని, ఇప్పుడు మేలుకోకపోతే భవిష్యత్తు అంధకారమవుతుందని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పిలుపునిచ్చారు.
మీరా నాయకులు!?
"రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక జలాశయాలు నిండిన తర్వాత రాష్ట్రానికి నీళ్లు వస్తున్నాయి. ట్రిబ్యునళ్లు, కోర్టులు ఉన్నా రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు రావడం లేదు. మధ్యలో ఇంకో రాష్ట్రం వస్తే శ్రీశైలం, నాగార్జున సాగర్ తదితర ప్రాజెక్టులకు నీళ్లెక్కడి నుంచి వ స్తాయి? కృష్ణా ఆయకట్టులో రోజూ కొట్టుకునే పరిస్థితి రాదా? పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేసినా నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు తాగేందుకు మంచి నీళ్లు కూడా దొరకవు. అన్నీ తెలిసి ప్యాకేజీలు, ట్రిబ్యునళ్లు, కోర్టులు అంటారా? మీరా పాలకులు!? రాష్ట్రం ఒక్కటిగా ఉండగానే మహారాష్ట్ర, కర్ణాటక మన జీవితాలతో ఆడుకుంటున్నాయి. విభజన సంకేతాలు వచ్చిన వెం టనే నికర జలాలపై వాటా, మిగులు జలాలపై హక్కును పెం చుకునే ప్రయత్నాలను చేస్తున్నాయి. మీకు కనబడడం లేదా? కావేరీ వివాదాన్ని చూడడం లేదా? కళ్లుండీ చూడలేని కబోదులనే మిమ్మ ల్ని అడుగుతున్నా. మీరా నాయకులు!?'' అని ధ్వజమెత్తారు.
హైదరాబాద్‌ను నాశనం చేస్తున్నారు
"పదేళ్లలో హైదరాబాద్‌ను విడిచి వెళ్లాలట. చదువుకుంటున్న పిల్లలు తమ చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం ఎక్కడికెళ్లాలని కాలర్ పట్టుకుని అడిగితే సోనియా, కిరణ్, చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు? వీళ్ల పాపానికి మూడేళ్లుగా రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదు. గతంలో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న హైదరాబాద్ ఇప్పుడు 12వ స్థానానికి దిగజారింది. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఏటా 57 వేల మందికి క్యాంపస్ ఉద్యోగాలు వచ్చేవి. ఇప్పుడు 25 వేలు కూడా రావడం లేదు. హైదరాబాద్‌ను చేతులారా నాశనం చేస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో సగం హైదరాబాద్ నుంచే వస్తుంది. అది రాకపోతే జీతాలివ్వడానికైనా డబ్బులుంటాయా?'' అని ప్రశ్నించారు. విభజన తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు, చిన్న చిన్న ఇళ్లు కట్టుకున్న వారి ఆస్తుల విలువ సగానికి తగ్గిపోతే దానిని సోనియా ఇస్తారా? చంద్రబాబు ఇస్తారా? అని ప్రశ్నించారు.
"రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చంద్రబాబును ఎన్జీవోలు కోరారు. విభజన కోసం కేంద్రానికి ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోవాలని విన్నవించారు. కానీ, నిర్దయగా వెనక్కు తీసుకోను అని చంద్రబాబు చెప్పారు. పైగా బెంగళూరు, చెన్నైలలో తెలుగువారు బతుకుతున్నారుగా అని ప్రశ్నించారు. మీరు, మీతోపాటు మిగిలినవారు రాజీనామా చేస్తే ప్రభుత్వం పడిపోతుందని, రాజీనామా చేయాలని కోరితే నిర్దయగా చేయను అన్నారు.
రాష్ట్ర విభజన కోసం ఢిల్లీలో చంద్రబాబు దీక్ష చేశారు. ఢిల్లీలో ఎవరెవరితో సంప్రదించారో కానీ ఆయన దీక్ష పూర్తయ్యేలోగానే ఇక్కడ ఉద్యోగ సంఘాల నాయకులను బెదిరించి, మాట్లాడి.. మొత్తంగా ఉద్యోగులందరినీ సమ్మె నుంచి విరమింపచేసే పనిని కిరణ్ పూర్తి చేశారు. వీళ్లు మనుషులేనా?'' అని ప్రశ్నించారు. పట్టపగలే నిజాయితీ లేని రాజకీయాలు చేస్తూ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. "మనం మనుషులమా? ఆట వస్తువులమా? రాజకీయ చదరంగంలో పావులం అనుకుని అన్యాయం చేస్తే ఊరుకోం. వందేమాతర గేయం అందుకుంటాం. విప్లవ జెండాలు పట్టుకుంటాం. మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపేందుకు కూడా వెనకడుగు వేయం'' అని జగన్ హెచ్చరించారు.
సమైక్య సభకు వెళ్తున్న బస్సులపై దాడి
సభకు వెళ్తున్న బస్సులపై తెలంగాణ ఉద్యమకారులు శనివారం రాళ్ల దాడి చేశారు. వరంగల్ సమీపంలోని భట్టుపల్లి-కడిపికొండ రోడ్డు గుండా వెళ్తున్న బస్సులను అడ్డుకునేందుకు రోడ్డుకు అడ్డంగా డ్రమ్ములు పెట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు బస్సులపై రాళ్లదాడికి దిగారు. దీంతో బస్సుల్లోని ప్రయాణికులను కిందకు దింపిన పోలీసులు వారిని కాలినడకన కాజీపేటకు పంపించారు. అక్కడి నుంచి బస్సుల్లోకి ఎక్కించి హైదరాబాద్‌కు పంపించారు
- See more at: http://www.andhrajyothy.com/node/15004#sthash.g5LZZUsr.dpuf