Saturday, 9 May 2015

గౌతమబుద్ధుడికి గిరాకీ! (07-May-2015)

గౌతమబుద్ధుడికి గిరాకీ! (07-May-2015)
బుద్ధుడిని విష్ణు అవతారంగా మార్చి జీర్ణం చేసుకున్నట్టే, అంబేద్కర్‌ను అధికారిక చరిత్రలోకి, ఆమోదనీయ శ్రేణిలోకి జీర్ణం చేసుకుని నిశ్శక్తుడిని చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. రెండోసారి తలెత్తిన బుద్ధుడిని మరోసారి జీర్ణం చేసుకునే ప్రయత్నాలూ మొదలయ్యాయి. అంబేద్కర్‌నూ, గౌతమబుద్ధుడినీ ఇద్దరినీ రక్షించుకోవలసిన బాధ్యత భారత్‌లోని ప్రగతిశీల, సామాజిక శక్తులన్నిటికీ ఉన్నది.

చైనా కమ్యూనిస్టు నాయకుడు మావో జెడాంగ్‌ నాస్తికుడని అందరికీ తెలుసు. బుద్ధుడి గురించి, బౌద్ధ స్థలాల గురించి కానీ ఆయన గొప్పగా మాట్లాడిన సందర్భాలు కూడా లేవు. చారిత్రకస్థలాలు వారసత్వ సంపద అని, వాటిని పరిరక్షించుకోవాలని మాత్రం ఆయన అనేక మార్లు చెప్పారు. టిబెట్‌ మీద చైనా చేసిన ఆక్రమణ, సాంస్కృతిక విప్లవకాలం లో బౌద్ధారామాలపై, భిక్షుగృహాలపై జరిగిన దాడులు మావోప్రకటిత అభిప్రాయాలకు భిన్నమైన ఆచరణను చూపిస్తాయి.
 
బౌద్ధం చైనాలోకి ప్రవేశించడమే మహాయాన రూపంలో ప్రవేశించడం, రాచరిక భూస్వామ్యశక్తుల ప్రోద్బలంతో అది విస్తరించడం కారణంగా మావోకు గానీ, ఇతర చైనా విప్లవనేతలకు గానీ ఆ మతం మీద అభిమానం లేకపోయి ఉండవచ్చు. ఇప్పుడు చైనాలో ఉన్న అధికార పక్షం తాను కూడా కమ్యూ నిస్టు పార్టీయేనని చెప్పుకుంటున్నప్పటికీ, మావో సిద్ధాంతాల నుంచి చాలా ఎడం జరిగిపోయింది. బౌద్ధం మీద, సన్యాసుల మీద, పురావస్తు స్థలాల మీద సహనం, ఆదరణ పెరిగాయి కానీ, ప్రస్తుత పాలకులకు కూడా మౌలిక బౌద్ధ సిద్ధాంతాల మీద ఆసక్తిగానీ, గౌరవం కానీ లేవు.
 
చైనాలో పన్నెండువందల ఏళ్ల పురాతనమైన బౌద్ధస్థలం ఒకటి ఉన్నది. అది వుటై పర్వతం. బుద్ధుని శిష్యుడైన మంజుశ్రీ బోధిసత్వ నివసించాడన్న కారణంగా ఆ స్థలాన్ని చైనీయ బౌద్ధులు పవిత్రంగా భావిస్తారు, అంతర్జాతీయ పర్యాటకులు సందర్శిస్తారు. 1949లో అక్టోబరు విప్లవం విజయవంతమయ్యాక, ఇంకా అధికారం చేపట్టడానికి మధ్య ఉన్న విరామంలో మావో వుటై పర్వతాన్ని సందర్శించాడు. అదృష్టాన్ని జాతకాన్ని చెప్పే చిలకజోస్యం కార్డుల వంటివి ఆ చోట ప్రసిద్ధం. మావో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడట. ఒక కార్డు తీశాడు. ఆయనకు 8341 నెంబరు గల కార్డు వచ్చిందట. ఆ కార్డు ఏమి చెబుతోందో వివరించమని అక్కడున్న బౌద్ధ సన్యాసిని అడిగాడట. ఆ సన్యాసి మౌనం వహించాడు. ఎంత బతిమాలినా చెప్పలేదు.
 
సరే అనుకుని హడావుడిగా మావో వెళ్లిపోయాడట. తరువాత తెలిసిందేమిటంటే, ఆ కార్డులోని మొదటి రెండు అంకెలు ఆయన ఆయు ష్షుని, తరువాతి రెండు అంకెలు ఆయన పార్టీ సారథ్యకాలాన్ని సూచించేవి. మావో 83 సంవత్సరాలు బతికారు. 41 సంవత్సరాల పాటు (1935 నుంచి) కమ్యూనిస్టుపార్టీ అధినేతగా వ్యవహరించారు. వుటై పర్వతం చూడ్డానికి వచ్చే సందర్శకులందరికీ అక్కడి ప్రభుత్వ గైడ్‌లు ఈ కథను చెబుతుంటారు. బౌద్ధం కారణంగా ఆ స్థలానికి ఎంత ప్రాశస్త్యం అబ్బిందో, మావో కథ వల్ల అంతకు రెట్టింపు ప్రాచుర్యం లభించింది.
 
అదృష్టపు కార్డుల కథ కట్టుకథ అని వేరే చెప్పనక్కరలేదు. కానీ, పెట్టుబడికి కట్టుకథల మీద వ్యతిరేకత ఏమి ఉంటుంది? బౌద్ధం లేని బుద్ధుడిని బంగారు దేవుడిని చేసినట్టే, మావో నుంచి సారాన్ని తీసేసి కొత్తదేవుడిగా ప్రతిష్ఠించుకున్నది చైనా. బుద్ధుడినీ మావోనీ కలిపేసి గుండుగుత్తగా వ్యాపారం చేసుకుంటోంది. భారతదేశం చైనాకు బుద్ధుడిని ఇస్తే, చైనా మనకు మావోను ఎగుమతి చేసిందని కొందరు చమత్కరిస్తుంటారు. భారతదేశం బుద్ధుడిని కానుకగా ఇవ్వలేదు. బుద్ధుడిని చేజేతులా వదులుకున్నది, మావో కూడా పాపం చైనా వదిలి అనేకానేక దేశాల్లో తలదాచుకుంటున్నాడు. తాము నిరాకరించిన, నిర్లక్ష్యం చేసిన వ్యక్తులను కూడా వ్యాపారం కోసం కావలించుకోవడం భారతదేశంలో కూడా మొదలయింది.
 
ఈ ఏడాది మన దేశంలో బుద్ధపూర్ణిమ హడావిడి ఎక్కువైపోయింది. యుద్ధం లేని లోకం కోసం బుద్ధమే శరణమని సాక్షాత్తూ నరేంద్రమోదీ అన్నారు. నాగార్జునసాగర్‌లో మిరుమిట్లు గొలిపే బుద్ధవనాన్ని నిర్మిస్తామని కెసిఆర్‌ ప్రకటించారు.. ఇక నవ్యాంధ్ర రాజధాని పేరే అమరావతి. అక్కడ ఘనంగా వైశాఖపూర్ణిమ వేడుకలు జరిగాయి. లోకంలో బుద్ధుడి మీద ఆసక్తి వేగంగా పెరుగుతున్న మాట నిజమే కానీ, ఇదిట్లా అధికారికమైన అట్టహాసంగా మారితే కొంచెం సందేహించవలసిందే. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉండగా కూడా తన గదిగుమ్మానికి బుద్ధశిల్పం ఉండేదని మోదీ చెప్పినప్పుడు ఆశ్చ ర్యమే కలిగింది.
 
స్వయంగా బౌద్ధమతానుయాయులైన పాలకులలో నియంతలూ నరహంతకులూ అనేకులున్నారు. వారి మతం వేరు. ఇతర మతస్థులైనవారు బుద్ధుడిని కీర్తించినప్పుడు మాత్రం వారి ఆసక్తికి బౌద్ధవిలువలే ఆధారమని అను కుంటుంటాము. మోదీకి బౌద్ధం మీద ఇంతటి ఆసక్తి ఉన్నదని మనకు మొన్నటి దాకా తెలియనే తెలియదు. యుద్ధాలు లేని లోకం కోసమే కాదు, అసమానతలు లేని సమాజానికి కూడా బౌద్ధం పనికివస్తుందని మోదీ గుర్తిస్తారా? మనది కాని దాన్ని అపహరించకూడదని, బలవంతంగా తీసుకోకూడదని బుద్ధుడు చెప్పాడని భూసేకరణ బిల్లు తెచ్చిన ప్రధానికి తెలుసునా? చరిత్రలో చంద్రగుప్తుడు, రాణాప్రతాపుడు, ఛత్రపతి శివాజీ వంటివారే కాక, ప్రపంచంలోనే అతి గొప్ప పాలకుడు మానవతావాది బౌద్ధుడు అయిన అశోకుడు కూడా ఉన్నాడని, అతను ఆదర్శప్రాయుడని మోదీ కానీ ఆయన పరివారం కానీ తమ అనుయాయులకు ఇకనైనా చెప్తారా? గోవధ కూడదన్న విలువ బౌద్ధం నుంచి వచ్చిందని, విచక్షణారహిత గోవధకు పాల్పడుతున్న వైదికమార్గీయులకు ఎదురొడ్డింది ఆ మతమేనని చరిత్రను సవరించి చెప్పగలరా? 
 
అమరావతి అని పేరు పెట్టుకుంటే చాలదు, బుద్ధవిహారాలను అలంకరిస్తే చాలదు, మనుషులను ఎదురుకాల్పుల పేరుతో చంపకుండా కూడా ఉండా లని తెలుగు రాషా్ట్రల ముఖ్యమంత్రులకు ఎవరు బోధిస్తారు? డెబ్భై అంతస్థుల భవనాలు, పలువరుసల పలు అరల రహదారులు- అవసరం కోసం కాక ఆడంబరం కోసమే అని తెలిసి వస్తే, మనుషులు సంతృప్తిగా శాంతిగా బతికే నగరాలను నిర్మించే ప్రయత్నం చేస్తాము. అభివృద్ధి ఉన్మాదంలో శివాలూగుతున్నవారికి మధ్యేమార్గాలు రుచిస్తాయా? 
 
బౌద్ధం భారతదేశం మీద వదిలిన ప్రగాఢమైన భౌతిక ముద్రలను ఓరియంటలిస్టులు, వలసవాద ఔత్సాహికులు, పురాతత్త్వవేత్తలు వెలికితేస్తే, బుద్ధునితో ఒక పరంపరాగత అనుబంధాన్ని, భావబంధాన్ని ఆవిష్కరించినవాడు డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌. ఆధునిక భారత దేశం, ప్రజాస్వామిక భారతీయ సమాజం అంబేద్కర్‌ను దీర్ఘకాలం వెలిగానూ, మార్జిన్‌లోనూ ఉంచి, ఇప్పుడిప్పుడే ఆయన ప్రాసంగికతను, అనివార్యతను కనుగొంటున్నది. అంబేద్కర్‌తో రక్తసంబంధం ఉన్న వర్గాలు సమాజంలో గొంతువిప్పి, నడుంకట్టి, ఒక సాధికార శక్తిగా రూపొందుతున్న క్రమం నేడు చూస్తున్నాము. బుద్ధుడిని విష్ణు అవతారంగా మార్చి జీర్ణం చేసుకున్నట్టే, అంబేద్కర్‌ను అధికారిక చరిత్రలోకి, ఆమోదనీయ శ్రేణిలోకి జీర్ణం చేసుకుని నిశ్శక్తుడిని చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి.
 
మధ్యయుగాల చరిత్రలో మట్టికొట్టుకుపోయిన బౌద్ధస్థలాల పునరావిష్కరణ, సామాజిక న్యాయశక్తుల ఉద్యమ స్ఫూర్తి శాక్యగౌతముని యదార్థతత్వాన్ని మరోసారి లోకం ముందుకు తెచ్చాయి. రెండో సారి తలెత్తిన బుద్ధుడిని మరోసారి జీర్ణం చేసుకునే ప్రయత్నాలూ మొదలయ్యాయి. అంబేద్కరూ, బుద్ధుడూ - ఇద్దరినీ ఒకేసారి మర్యాదస్తులుగా తీర్చిదిద్దే సృజనాత్మక తంత్రాన్ని ఇప్పుడు కళ్లా రా చూస్తున్నాము. అంబేద్కర్‌నూ, గౌతమ బుద్ధుడినీ ఇద్దరినీ రక్షించుకోవలసిన బాధ్యత భారత్‌లోని ప్రగతిశీల, సామాజిక శక్తులన్నిటికీ ఉన్నది. 
 
గౌతమబుద్ధుని వలె గౌరవాస్పదుడైన పురాచారిత్రకవ్యక్తి మరొకరు ఉన్నారా అన్నది సందేహమే. తన తార్కిక శక్తి వలన, సామాజిక పరస్పరతను నిలిపే విలువలను బోధించినందున ఆయన గౌరవం పొందాడు. కులాలను, యజ్ఞయాగాదులను నిరసించడం- బౌద్ధం ప్రతిపాదించిన ఒకసమగ్ర జీవనవిధానంలో అవిభాజ్యమైన భాగాలు. అతని కాలానికి అతను ఆకాశమంత ఎత్తున నిలబడగలిగాడు.అతని వంటి ఆలోచనాపరుడైన దేవుడు మరొకరు లేరు. స్వయంగా భౌతికవాదీ వామపక్ష అభిమాని అయిన సీనియర్‌ కొశాంబి కూడా అందుకే ‘భగవాన్‌ బుద్ధ’ అనకుండా ఉండలేకపోయాడు. కొందరి స్వార్థానికీ, అందరి సంక్షేమానికీ వైరుధ్యం నిత్యయుద్ధంగా పరిణమించిన కాలంలో, మిత జీవనమూ సమ్యక్‌ వర్తనమూ వంటి బౌద్ధ విలువలకు అవసరమూ ప్రయోజనమూ పెరిగాయి. వైరుధ్యం అంతిమంగా ఎలా పరిష్కారమవుతుందోకానీ, అప్పటిదాకా జరిగే ప్రయాణానికి విలువల బత్తెం కావాలి.

ప్రకృతినీ, సమష్టినీ కొల్లగొట్టే దురాశను, అందులో మోచేతి విదిలింపుల కోసం దిగజారే కక్కుర్తులను అవినీతిగా చెప్పగలిగే ఒక ఆధ్యాత్మికత కూడా కావాలి. దేవుళ్లూ దేవుళ్ల ఏజెంట్లూ భక్తి పేరుతో మనుషులను పీక్కు తింటున్నపుడు దేవుడు లేని మతమొకటి కావాలి. నాటి నరహత్యలను, పశుహత్యలను ఆపడానికి బౌద్ధం అవతరించినట్టే, నేటి విధ్వంసక అభివృద్ధి యజ్ఞాన్ని నిలువరించే బోధన, నైతికశక్తి కలిగిన బోధన ఒకటి కావాలి. 

ఒబామాను కలిసిన లోకేశ్‌

ఒబామాను కలిసిన లోకేశ్‌


హైదరాబాద్‌, మే 8 (ఆంధ్రజ్యోతి): అమెరికా అధ్య క్షుడు బరాక్‌ ఒబామాతో ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్‌ సమావేశమయ్యారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న లోకేశ్‌.. అపాయింట్‌మెంట్‌ మేరకు పోర్ట్‌ల్యాండ్‌ నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఒబామాను కలిశారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పఽథకాలను వివరించారు. రాష్ట్ర విభజన పరిణామాలు, కొత్తగా ఏర్పడిన రాషా్ట్రనికి పెట్టుబడులను ఆకర్షించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు, కొత్తగా తీసుకువచ్చిన పారిశ్రామిక విధానాలను ఒబామాకు వివరించారు. లోకేశ్‌ స్మార్ట్‌ విలేజ్‌ పథకం గురించి చెబుతున్నపుడు..
వినూత్నంగా ఉన్నదంటూ ఒబామా మెచ్చుకొన్నారు. అమెరికా లో ఉన్న ప్రవాసాంధ్రులను ఈ పథకంలో భాగస్వాములను చేయడానికే తాను వచ్చానని లోకేశ్‌ చెప్పినప్పుడు ఆయన అభినందించారు. చంద్రబాబు గురించి విన్నానని, ఆయనకు తన అభినందనలు తెలియచేయాలని ఒబామా లోకేశ్‌కు సూచించారు. ‘కొత్త రాషా్ట్రనికి ప్రచారం అవసరం. గతంలో హైదరాబాద్‌ను ప్రపంచవ్యాప్తంగా ఎలా మార్కెటింగ్‌ చేశామో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌నూ అలాగే చేస్తున్నాం. ఆ గుర్తింపు కోసమే ఒబామాను కలిశాను’ అని లోకేశ్‌ అనంతరం ప్రవాసాంధ్రులకు వివరించారు. కాగా, అమెరికాలో ఐటీ రంగంలో ప్రముఖులుగా ఉన్న ప్రవాస భారతీయులను కలిసిన లోకేశ్‌.. ఏపీలో ఐటీ రంగ విస్తరణకు వారి సహాయ సహకారాలు కోరారు. జూపిటర్‌ నెట్‌వర్క్స్‌ చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ ప్రదీప్‌ సింధుతో భేటీ అయ్యారు.

ఒబామాతో లోకేశ్ ఫొటో

Sakshi | Updated: May 09, 2015 02:19 (IST)
ఒబామాతో లోకేశ్ ఫొటో
డెమోక్రటిక్ పార్టీ నిధుల సేకరణ కార్యక్రమంలో ఒబామాతో కరచాలనం చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి కుమారుడు లోకేశ్. పదివేల డాలర్లు చెల్లించినవారికి ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ఒమాబాతో కరచాలనంచేస్తూ ఫొటో దిగే అవకాశం ఇచ్చారు. లోకేశ్ అలాగే ఈ అవకాశాన్ని ‘కొని’తెచ్చుకున్నారు.

హైదరాబాద్: 
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు లోకేశ్ ఫొటో తీసుకున్నారు. నిధుల సమీకరణ కోసం డెమాక్రటిక్ పార్టీ '2016 వైట్‌హౌస్ విక్టరీ ఫండ్' పేరుతో ఏర్పాటు చేసిన సమావేశం సందర్భంగా ఆయన ఈ ఫొటో దిగారు. నిధుల సమీకరణకు ఒరెగాన్ రాష్ట్రం పోర్ట్‌లాండ్‌లోని సెంటినెల్ హోటల్‌లో గురువారం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనడానికి 300 మంది టికెట్లు కొనుగోలు చేసినట్టు ఆ పార్టీకి చెందిన డెమాక్రటిక్ నేషనల్ కమిటీ (డీఎన్‌సీ) ప్రకటించింది. ఒబామా 26 నిమిషాలపాటు వారిని ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ఎక్కువ మొత్తం పెట్టి టికెట్ కొనుగోలు చేసినవారు ఒక్కొక్కరితో విడిగా అమెరికా అధ్యక్షుడు కరచాలనం చేశారు.

అందులో భాగంగానే లోకేష్ కూడా ఒబామాను కలిశారు. కార్యక్రమం హాలులో ప్రవేశానికి 500 అమెరికన్ డాలర్లు, ఒబామాతో ఫోటో దిగడానికి 5 వేల డాలర్లు, ఆయనతో కరచాలనం చేసి పరిచయం చేసుకోవడానికి 10 వేల డాలర్లు రుసుముగా నిర్దేశించిన విషయం తెలిసిందే. 500 డాలర్ల టికెట్ కొనుగోలు చేసిన వారు హాలులో ప్రవేశించి ఒబామా ప్రసంగాన్ని వినడానికి మాత్రమే వీలుంటుంది. లోకేశ్ 10 వేల డాలర్లు చెల్లించి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇలా వచ్చిన నిధులన్నీ డెమాక్రటిక్ పార్టీ ఖాతాలోకి వెళతాయి. లోకేశ్ పోర్ట్‌ల్యాండ్‌లో ఒబామాను కలుసుకున్నారని తెలుగుదేశం పార్టీ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని నూతన పారిశ్రామిక విధానాన్ని, స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు విశేషాలను ఆయన ఒబామాకు వివరించినట్టు తెలిపింది. తన నాలుగో రోజు అమెరికా పర్యటనలో పలు ఐటీ కంపెనీల ప్రముఖులతో లోకే శ్ భేటీ అయ్యారని వివరించింది.

ప్రొఫెసర్‌ సాయిబాబా అత్యంత ప్రమాదకర వ్యక్తా?: అరుంధతి రాయ్

ప్రొఫెసర్‌ సాయిబాబా అత్యంత ప్రమాదకర వ్యక్తా?: అరుంధతి రాయ్

‘అవుట్‌లుక్‌’ వ్యాసంలో అరుంధతి రాయ్‌ ప్రశ్నలు
న్యూఢిల్లీ, మే 8 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సాయిబాబాను విడుదల చేసేది ఎప్పుడంటూ ప్రముఖ రచయిత్రి, సామాజిక ఉద్యమకారిణి అరుంధతి రాయ్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆయనను అరెస్ట్‌ చేసి, శనివారం నాటికి ఏడాదవుతున్న నేపథ్యంలో ‘‘భారతదేశంలో అందరికంటే ప్రమాదకరమైన వ్యక్తి ఈయనేనా?’’ అనే శీర్షికతో ‘అవుట్‌లుక్‌’ ఆంగ్ల పత్రికకు ఆమె ముఖపత్ర వ్యాసం రాశారు. శుక్రవారం విడుదలైన ఈ తాజా సంచికలోగల ఈ వ్యాసంలో ఆమె అనేక మౌలిక ప్రశ్నలను లేవనెత్తారు. నడుము నుంచి కాళ్లదాకా చచ్చుబడి, 90 శాతం వైకల్యంతో బాధపడే ఆయనను నానా రకాల ఆరోపణలతో అరెస్ట్‌ చేసి, పలు సెక్షన్లకింద లేనిపోని కేసులు మోపారని పేర్కొన్నారు. ఆదివాసీలపై ‘ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌’ వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించినందుకే ఆయనను అరెస్టు చేశారని ఆరోపించారు. దేశంపై యుద్ధం ప్రకటించారంటూ ‘రాజద్రోహం’ కేసు కింద నిరవధిక నిర్బంధం ఎన్నాళ్లని ప్రశ్నించారు. సాయిబాబా నివాసం నుంచి 2013 సెప్టెంబర్‌లో 50 మంది పోలీసులు ల్యాప్‌టాప్‌, హార్డ్‌ డిస్క్‌లు, పెన్‌ డ్రైవ్‌లు ఎత్తుకెళ్లడంతో దమనకాండ మొదలైందన్నారు. మే 9న కిడ్నాప్‌ చేసి నాగపూర్‌ జైల్లో 300 మంది రకరకాల నేరస్థులున్న సెల్‌లో పడేశారని ఆరోపించారు. కాలకృత్యాలకూ మరొకరి సాయం అవసరమైన వ్యక్తిని నానా రకాలుగా హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్‌ అల్లర్లలో వందలాది మందిని ఊచకోత కోసినవారిని కూడా బెయిల్‌పై విడుదల చేశారన్నారు. కానీ, సాయిబాబాపై నేరం రుజువు కాకుండానే నిర్బంధించడం చూస్తే, అసలు సజీవంగా బయటకు రాగలరా? అన్న సందేహం కలుగుతోందని వ్యాఖ్యానించారు.
 
కాగా, సాయిబాబా తన బంధువని, ప్రజల హక్కుల కోసం పోరాడిన ప్రొఫెసర్‌ను ఇంతకాలం నిర్బంధించడం దారుణమని తెలంగాణ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతానని, నాగపూర్‌ కూడా వెళ్లి చూసి వస్తానని ఆయన చెప్పారు. కాగా, సాయిబాబా అరెస్టును నిరసిస్తూ శనివారం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో అధ్యాపకులు నిరాహార దీక్ష చేయనున్నారు.

10 ఏళ్లలో 13 లక్షల మారుతీ స్విఫ్ట్ కార్ల అమ్మకం

10 ఏళ్లలో 13 లక్షల మారుతీ స్విఫ్ట్ కార్ల అమ్మకం
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): దేశీయ కార్ల ఉత్పత్తి దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) 13 లక్షల స్విఫ్ట్‌ కార్లను విక్రయించి రికార్డు సృష్టించింది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ కారు స్విఫ్ట్‌ను విడుదల చేసిన పదేళ్ల (2005) లోనే ఈ రికార్డును అందుకోవటం విశేషం. భారతీయ ఆటోమొబైల్‌ రంగ చరిత్రను మార్చిన స్విఫ్ట్‌ కారు దేశీయ మార్కెట్లోకి విడుదలైన స్వల్పకాలంలోనే 13 లక్షల మార్కును అందుకుందని ఎంఎస్‌ఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (మార్కెటింగ్‌) ఆర్‌ఎస్‌ కల్సి అన్నారు. పెద్ద కారు ఫీచర్లతో తీసుకువచ్చిన స్విఫ్ట్‌ భారత వినియోగదారుల మనసును ఎంతగా ఆకట్టుకుందో ఈ కార్ల విక్రయాలే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. భారత మార్కెట్లోకి విడుదల చేసిన ఏడాదే కార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును గెలుచుకోగా 2011లో మరోసారి స్విఫ్ట్‌ మోడల్‌లో మార్పులు చేర్పులు చేసిన అనంతరం మళ్లీ ఈ అవార్డును గెలుచుకుందని మారుతి సుజుకీ ఇండియా వెల్లడించింది. 2007లో లక్ష యూనిట్లతో ఆరంభమైన స్విఫ్ట్‌ ప్రయాణం 2015 ఏప్రిల్‌ నాటికి 13 లక్షల యూనిట్లకు చేరుకుందని తెలిపింది.
 
పదేళ్లలో స్విఫ్ట్‌ ప్రయాణం..
  •  2002లో పారిస్‌ ఆటో షోలో కాన్సెప్ట్‌ ఎస్‌ విడుదల
  •  2003 ఫ్రాంక్‌ఫర్ట్‌ ఆటో షోలో కాన్సెప్ట్‌ ఎస్‌2 ఆవిష్కరణ 
  •  2004 పారిస్‌ ఆటో షోలో విడుదల
  •  2004 నవంబర్‌లో జపాన్‌ మార్కెట్లోకి విడుదల
  •  2005 మే నెలలో భారత మార్కెట్లోకి అడుగు
  •  2007 డీజిల్‌ వేరియంట్‌ విడుదల
  •  2011లో సరికొత్త రూపంతో మార్కెట్లోకి

Friday, 8 May 2015

కిడ్నాప్ చేసి పురుషుడిపై అత్యాచారం

కిడ్నాప్ చేసి పురుషుడిపై అత్యాచారం

Others | Updated: May 09, 2015 11:51 (IST)
కిడ్నాప్ చేసి పురుషుడిపై అత్యాచారం
గాటెంగ్: దక్షిణాఫ్రికాలో పురుషులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల ముగ్గురు యువతులు ఓ యువకుడిని బెదిరించి కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు.

గాటెంగ్ నగరంలో మహిళలు తుపాకీతో బెదిరించి 33 ఏళ్ల యువకుడిని బీఎండబ్ల్యూ కారులో తీసుకెళ్లారు. ఆ యువకుడిని 500 కిలో మీటర్ల దూరం తీసుకెళ్లారు. నిర్మానుష ప్రాంతంలో కారును ఆపి అతని చేత బలవంతంగా మద్యం తాగించారు. అనంతరం ముగ్గురు యువతులు అతనిపై లైంగికదాడికి పాల్పడ్డారు.  అతడి నుంచి వీర్యం సేకరించి, కారులోంచి తోసేసి వెళ్లిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాటెంగ్ నగరంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి.

Wednesday, 6 May 2015

Maternal waist circumference and the prediction of children's metabolic syndrome.

 2007 Dec;161(12):1205-10.

Maternal waist circumference and the prediction of children's metabolic syndrome.

Abstract

OBJECTIVE:

To determine the association between metabolic syndrome (MS) components in 620 children and their mothers.

DESIGN:

Cross-sectional assessment.

SETTING:

Three public elementary schools in Buenos Aires, Argentina.

PARTICIPANTS:

A total of 620 students at a mean +/- SD age of 9.00 +/- 2.07 years and their mothers at a mean +/- SD age of 37.69 +/- 7.19 years.

MAIN OUTCOMES MEASURES:

The association between MS in children and components of MS in their mothers, such as body mass index (BMI) (calculated as weight in kilograms divided by height in meters squared), high-density lipoprotein cholesterol concentration, triglycerides concentration, glucose concentration, homeostasis model assessment of insulin resistance, blood pressure, and age.

RESULTS:

Ninety-five (15.3%) of the children were obese (BMI > or = 95th percentile), 108 (17.4%) were overweight (BMI > or = 85th percentile and < 95th percentile), and 418 (67.3%) were a healthy weight (BMI < 85th percentile). One hundred twelve (18.1%) of the mothers were obese (BMI > or = 30), 183 (29.5%) were overweight (BMI > or = 25 and < 30), and 325 (52.4%) were a healthy weight (BMI < 25). Low concentration of high-density lipoprotein cholesterol (in 46.0% and 56.9% of mothers and children, respectively) and central obesity (in 36.0% and 25.0% of mothers and children, respectively) were common, whereas hypertension (in 10.5% and 1.9% of mothers and children, respectively) and impaired fasting glucose (in 2.9% and 0.3% of mothers and children, respectively) were infrequent. The prevalence of MS was 10.8% in children and 11.0% in mothers. Central obesity was less frequent in mothers of children without MS vs mothers of those with MS (41.2% vs 78.8%, respectively; P < .001). Mothers of children without MS had fewer MS components than did mothers of children with MS (BMI z score, 0.09 vs 0.69, respectively [P < .001]; waist circumference z score, 0.15 vs 0.87, respectively [P < .001]). Mothers' waist circumference was a significant independent predictor of their children's MS when adjusted for mothers' concentrations of triglycerides, cholesterol, and glucose and age (odds ratio, 2.11; 95% confidence interval, 1.36-3.26).

CONCLUSION:

A mother's waist circumference predicts her child's MS, consistent with known familial associations of obesity and type 2 diabetes.

Tuesday, 5 May 2015

వాజపేయి భారత రత్నమా?

వాజపేయి భారత రత్నమా?

  • బాబ్రీ విధ్వంసం వెనుక ఆయనా ఉన్నారు
  • ‘నేలను చదును చేస్తాం’ అని తెలిపారు
  • విద్వేషాన్ని విస్తరించిన ఆడ్వాణీకి ‘పద్మ విభూషణ్‌’?
  • పురస్కారాలను తప్పుపట్టిన ఒవైసీ
హైదరాబాద్‌, మే 4: భారత మాజీ ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు వాజపేయికి భారత రత్న అవార్డు బహూకరించడంపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ ఉప ప్రధాని ఆడ్వాణీని ‘పద్మ విభూషణ్‌’తో సత్కరించడాన్ని కూడా తప్పుబట్టారు. ఆదివారం రాత్రి జరిగిన ఒక పుస్తకావిష్కరణ సభలో అసదుద్దీన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘అయోధ్య అంశంపై వాజపేయి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మతపరంగా రెచ్చగొట్టేలా మాట్లాడారు. 1992 డిసెంబర్‌ 5వ తేదీన వాజపేయి చేసిన ఆ ప్రసంగం వీడియో ఇప్పటికీ యూట్యూబ్‌లో ఉంది. మనం ఈ విషయాన్ని మరిచిపోయామా? నాడు ‘నేలను చదును చేస్తాం’ అని వ్యాఖ్యానించిన వారికి నేడు భారత రత్న ఇచ్చారు’’ అంటూ ఒవైసీ విమర్శించారు. ఆడ్వాణీకి ‘పద్మ విభూషణ్‌’ ఇవ్వడం గురించి ప్రస్తావిస్తూ... ‘‘ఆడ్వాణీ తన రథయాత్రతో దేశమంతా విధ్వంసాన్ని విస్తరించారు. నేర అభియోగాలు (అయోధ్య కేసులో) ఎదుర్కొంటున్న వ్యక్తికి ఈ దేశపు రెండో అత్యున్నత పురస్కారాన్ని ఎలా ఇస్తారు?’’ అని ప్రశ్నించారు. 
 
మరి... లాడెన్‌కు ఇవ్వాలా: బీజేపీ
అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. ఈ అంశానికి మతంరంగు పులమడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించింది. ‘‘ఈ దేశానికి ఎంతో సేవ చేసిన వారికి అవార్డులు ఇవ్వడాన్ని ఎందుకు తప్పుపడుతున్నారు? ఎందుకంటే... దేశానికి సేవ చేసిన నేతలంటే వాళ్లకు గిట్టదు. చెడు చేసే వారంటేనే వారికి ఇష్టం. బహుశా... వారి దృష్టిలో ఒసామా బిన్‌లాడెన్‌కు గొప్ప అవార్డులు ఇవ్వాలి కాబోలు’’ అని కేంద్ర మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ ఎద్దేవా చేశారు. కేవలం మతపరమైన విద్వేషాన్నే రెచ్చగొట్టి జాతీయ స్థాయిలో రాజకీయంగా ఎదగాలనుకునే వారి వైఖరి ఇలాగే ఉంటుందని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు ద్వివేదీ వ్యాఖ్యానించారు.