
|
| హైదరాబాద్, ఆగష్టు 28 : జనసేన పార్టీ అధినేత, నటుడు పవన్ కళ్యాణ్‌పై మరో వివాదం రేగింది. మహాత్మాగాంధీని కించపరిచారంటూ పవన్‌పై ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఫేస్బుక్లో పవన్ ఫోటోతో ఉన్న రూ.50 కరెన్సీ నోటును ఎవరో పోస్ట్ చేశారు. వందేళ్ల క్రితం పవన్ జన్మించి ఉంటే మన పచ్చ నోటు నిజంగా ఇలా ఉండేదని ఫేస్బుక్లో కామెంట్ చేయడం వివాదానికి కారణమైంది. మహాత్మాగాంధీని కించపరిచారంటూ ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో బాలరాజు, అరుణ్ అనే న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. |
|
No comments:
Post a Comment