విజయవాడ, జనవరి 30: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రాంతంలో వెలుస్తున్న అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు. విజయవాడ సీఆర్డీఏ పరిధిలో అక్రమంగా చేసిన లేఅవుట్లను అధికారులు గుర్తించారు. ఈ మేరకు సంబంధిత లేఅవుట్ల యజమానులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. రాజధాని గ్రామాల్లో భూమి ధరలు తగ్గడానికి అక్రమ లేఅవుట్లే కారణమని భావించిన అధికారులు వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం అధికారులు తళ్లూరు నుంచి విజయవాడకు పయనమయ్యారు.
No comments:
Post a Comment